News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Loan Apps Scam: పేటీఎం ద్వారా డబ్బులు పంపి, మహిళకు చుక్కలు చూపిస్తున్న ఆగంతకులు!

Loan Apps Scam: గుర్తు తెలియని వ్యక్తుల పేటీఎం నుంచి ఓ మహిళ పేటీఎంకు డబ్బులు వచ్చాయి. మిస్ అయి వచ్చాయనుకొని ఆ డబ్బులను అదే నెంబర్ కు తిరిగి పంపించాారు. అదే ఆమె పాలిట శాపంగా మారింది. 

FOLLOW US: 
Share:

Loan Apps Scam: ఆన్ లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. ఇప్పటి వరకు లోన్ యాప్ లను సంప్రదించి అప్పు తీసుకున్న వారినే వేధించిన సంఘటనలు చూశాం. కానీ తూర్పు గోదావరి జిల్లా కడియంలో సరికొత్త లోన్ యాప్ వేధింపుల ఘటన చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... కడియం మండలంలో నివాసం ఉండే దేవి అనే మహిళ నిన్న దిశా ఎస్ఓఎస్ కు కాల్ చేసి తనను లోన్ యాప్ నిర్వాహకుడు వేధిస్తున్నట్టుగా సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో బాధితురాలి ఇంటికి వెళ్లిన దిశ పోలీసులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని రోజుల కిందట గుర్తు తెలియని నెంబర్ నుండి తనకు 2000 రూపాయలు ఫోన్ పే ద్వారా వచ్చాయని.. అది గమనించి వెంటనే అదే నెంబర్ కు అమౌంట్ తిరిగి పంపించినట్లు తెలిపారు.

అప్పటి నుండి అదే నెంబర్ నుండి వాట్సాప్ కాల్ చేసిన వ్యక్తి హిందీ, ఇంగ్లీషులో మాట్లాడుతూ వేధింపులకు పాల్పడుతున్నట్లు బాధితురాలు వాపోయారు. అదనంగా డబ్బులు చెల్లించాలని లేదంటే తన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బాధితురాలిని బెదిరించాడు. ఆగంతకుడు చెప్పిన విధంగానే బాధితురాలి ఫోటోలను మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫోటోలను పంపించడం మొదలు పెట్టాడు. ఆగంతకుడి ఆకృత్యాలు శృతిమించడంతో బాధితురాలు దిశా పోలీసులకు కాల్ చేసి సమాచారం ఇచ్చారు.

 బాధితురాలు దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దిశా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆగంతకుడు కాల్ చేసిన ఫోన్ నెంబర్, ఇతర వివరాల ఆధారంగా కడియం పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. అజ్ఞాత వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేసి వేధింపులకు పాల్పడితే వెంటనే దిశ ఎస్ఓఎస్ కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు పోలీసులు సూచించారు.

ఐదు రోజుల క్రితమే లోన్ యాప్ ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతి పెద్ద ఫేక్ లోన్ యాప్స్ ముఠా ఆట కట్టించారు. ముగ్గురు విదేశీయుల్ని కూడా అరెస్ట్ చేశారు. లోన్ , గేమింగ్ యాప్స్ పేరుతో కస్టమర్లను ఆకర్షించి తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేసి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు  చేస్తున్నారు. మొత్తం ఎనిమిది దేశాల్లో వీరి నేర సామ్రాజ్యం విస్తరించి ఉందని పోలీసులు చెబుతున్నారు. తూ.గో జిల్లా కడియం పోలీస్ స్టేషన్ లో వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరిపిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. మలేషియాలో ఉంటూ.. అక్కడ్నుంచే .. ఇండియాలో ఏజెంట్లను పెట్టుకుని ఫేక్ లోన్ యాప్స్ ను నడుపుతున్నారు. 

ఒక్క సారి లోన్ తీసుకుంటే చచ్చేదాకా కట్టాలని వేధించే లోన్ యాప్స్ 

ఈ లోన్ యాప్స్ ద్వారా ఎవరైనా ఓ పదివేల రూపాయల రుణం తీసుకుంటే వారిని ఈ ముఠా పీల్చిపిప్పి చేస్తుంది. పది వేలకు రూ . లక్ష కట్టినా ఒప్పుకోరు. మార్ఫింగ్ ఫోటోలు.. ఇతర పద్దతుల ద్వారా బ్లాక్ మెయిల్ చేసి ఎంత కడితే అంత కట్టించుకుంటూనే ఉంటారు. కడియం పోలీసులు దర్యాప్తు చేసిన కేసులో బాధితుడు మే ఐదో  తేదన ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి లోన్ యాప్స్ నిర్వాహకులు, ఏజెంట్ల వేధింపులే కారణం. నిందితుల్ని పట్టుకున్న తర్వాత వారి బ్యాంకు లావాదేవీల్ని చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే కనీసం కోటి రూపాయల మేరకు రోజుకూ లావాదేవీలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా అనేక మంది వీరి బాధితులు ఉన్నట్లుగా గుర్తించారు. 

Published at : 29 May 2023 12:12 PM (IST) Tags: AP News Latest Crime News Loan APPs

ఇవి కూడా చూడండి

IITH: ఐఐటీ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, ఈ అర్హతలు అవసరం

IITH: ఐఐటీ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, ఈ అర్హతలు అవసరం

AP PECET: ఏపీ పీఈసెట్-2023 సీట్ల కేటాయింపు పూర్తి, కళాశాలలవారీగా వివరాలు ఇలా

AP PECET: ఏపీ పీఈసెట్-2023 సీట్ల కేటాయింపు పూర్తి, కళాశాలలవారీగా వివరాలు ఇలా

Aditya L1: ఇస్రో కీలక అప్‌డేట్, సూర్యుడి వైపు దూసుకెళ్తున్న ఆదిత్య L1

Aditya L1: ఇస్రో కీలక అప్‌డేట్, సూర్యుడి వైపు దూసుకెళ్తున్న ఆదిత్య L1

JNTUH: జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో అకడమిక్ అసిస్టెంట్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

JNTUH: జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో అకడమిక్ అసిస్టెంట్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

TS EAMCET: ఎంసెట్‌ బైపీసీ స్పాట్‌ ప్రవేశాల గడువు పొడిగింపు, ఎప్పటివరకు అవకాశం ఉందంటే?

TS EAMCET: ఎంసెట్‌ బైపీసీ స్పాట్‌ ప్రవేశాల గడువు పొడిగింపు, ఎప్పటివరకు అవకాశం ఉందంటే?

టాప్ స్టోరీస్

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ