Hyderabad Crime : ఇళ్లు రెంట్ కు చూపిస్తానని చెప్పి యువతిపై అత్యాచారయత్నం, వాట్సాప్ గ్రూప్ ద్వారా ట్రాప్!
Hyderabad Crime : ఇళ్లు రెంట్ కు ఇస్తానని చెప్పి యువతిని ఇంట్లో బంధించి అత్యాచారయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్లాట్ అండ్ ప్లాట్ మేట్ అనే గ్రూప్ ద్వారా యువతులను ట్రాప్ చేస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తుంది.
![Hyderabad Crime : ఇళ్లు రెంట్ కు చూపిస్తానని చెప్పి యువతిపై అత్యాచారయత్నం, వాట్సాప్ గ్రూప్ ద్వారా ట్రాప్! Hyderabad young girl trapped with what's app group sexually abused in rental house Hyderabad Crime : ఇళ్లు రెంట్ కు చూపిస్తానని చెప్పి యువతిపై అత్యాచారయత్నం, వాట్సాప్ గ్రూప్ ద్వారా ట్రాప్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/27/2c9cca5207efeb3d6d56df29e75e0cee_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణ ఘటన జరిగింది. ఓ యువతిని ఇళ్లు రెంటుకి ఇస్తానని తీసుకెళ్లి ఆ ఇంట్లోనే బంధించి అత్యాచారయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువకుడిని ప్రతిఘటించిన యువతి గట్టిగా కేకలు వేసింది. అరిస్తే రేప్ చేస్తానంటూ కింగ్ ఖాన్ హమీద్ అనే యువకుడు మహిళను బెదిరించాడు. అక్కడి నుంచి తప్పించుకున్న యువతి చదర్ ఘాట్ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో 354A, 354b, 342,323 IPC కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. యువతికి ఇళ్లు చూపించేందుకు ఈ నెల 18న ఒవైసీ ఆసుపత్రి దగ్గరకు రావాలని పిలిపించి, అక్కడ నుంచి ఆమెను అక్బర్ బాగ్ తీసుకెళ్లాడు హమీద్. ఇంటికి వెళ్లాక సెల్ ఫోన్ తీసుకుని, యువతిపై అత్యాచారయత్నం చేయబోయాడు. ప్లాట్ మేట్ అనే గ్రూప్ ద్వారా యువతి నెంబర్ సేకరించి చాట్ మొదలు పెట్టాడు యువకుడు. చాలా మంది అమ్మాయిలను ఇళ్లు రెంట్ పేరుతో అఘాయిత్యాలు చేస్తున్నారని, ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేయాలని బాధితురాలు పోలీసులను వేడుకుంది.
(నిందితుడు హమీద్)
సెల్ఫీ వీడియో వైరల్
Also Read : Manjusha Neogi Death: కోల్‌కతాలో మరో మోడల్ మృతి- 2 వారాల్లో మూడో ఘటన!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)