అన్వేషించండి

Honor Killing In Adilabad: ఆదిలాబాద్‌ జిల్లాలో దారుణం- మతాంతర వివాహం చేసుకుందని కుమార్తె గొంతు కోసి హత్య చేసిన తండ్రి

అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగల్ కొండలో 21 ఏళ్ల యువతి హత్య సంచలనంగా మారింది. తండ్రే ఈ హత్య చేశాడని తెలిసిన అంతా విస్తుపోతున్నారు.

తెలంగాణలో మరో పరువు హత్య సంచలనం రేపుతోంది. ప్రేమ పెళ్లి చేసుకుందన్న కారణంతోనే తల్లిదండ్రులు తమ బిడ్డను చంపుకున్నారని పోలీసులు తేల్చారు. ఆదిలాబాద్‌ జిల్లాలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు సీరియస్‌గా ఫోకస్ పెట్టారు. 

అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగల్ కొండలో 21 ఏళ్ల యువతి హత్య సంచలనంగ మారింది. పవర్ రాజేశ్వరి అనే యువతిని అతి దారుణంగా ఇంట్లో హత్యకు గురైంది. యువతి గోంతుపై కత్తితో చేసిన గాయాలు ఉన్నాయి. రక్తపు మడుగులో పడి ఉన్నా ఆమెది హత్యగానే పోలీసులు నిర్దారించారు. 

ఇంట్లో అనుమానాస్పద స్థితిలో తమ బిడ్డ చనిపోయి ఉందని తల్లిదండ్రులే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన జరిగిన తీరును చూసిన పోలీసులు... ఇది కచ్చితంగా హత్యగానే అనుమానం వ్యక్తం చేశారు. ఆ దిశగానే దర్యాప్తు చేసిన పోలీసులు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. తండ్రే ఈ హత్య చేసినట్టు తేల్చారు. 

అన్యమతస్తున్ని ప్రేమించినదన్న కక్షతోనే తండ్రి ఈ హత్య చేసినట్టు తెలుస్తోంది. అందర్నీ తప్పుదారి పట్టించడానికి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని ఓసారి... ఆత్మహత్య చేసుకుందని మరోసారి బురిడీ కొట్టించేందుకు తండ్రి దేవీదాస్‌ కట్టుకథలు చెప్పాడు. మొదటి నుంచి ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు తమ స్టైల్‌లో విచారిస్తే అసలు విషయం చెప్పినట్టు తెలుస్తోంది. 

తన చేతులతో తానే చంపానని పోలీసులకు రాజేశ్వరి తండ్రి దేవీదాస్‌ వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. తమ మతం కాని వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఆమె గొంతు కోసి హత్య చేసినట్టు అంగీకరించాడు. తమ కుటుంబం పరువు తీసిందన్న కోపంతోనే ఈ దారుణానికి పాల్పడినట్టు చెప్పుకొచ్చాడు. 

మూడు నెలల క్రితం వేరే మతస్తుడిని రాజేశ్వరి పెళ్లి చేసుకుంది. దీనికి పెద్దలు అంగీకరించలేదు. అప్పటి నుంచి వాళ్లిద్దర్నీ విడదీసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. భయపెట్టి వాళ్లను విడదీయలేమని గ్రహించిన దేవీదాస్‌... ప్రేమ నటించి బిడ్డను ఇంటికి తీసుకొచ్చాడు. ఆమె ఇంటికి వచ్చిన తర్వాత ఇరు వర్గాల పెద్దలను పిలిచి ఇద్దర్నీ విడదీసేందుకు ప్లాన్ చేశాడు దేవీదాస్. 

అనుకున్నట్టుగానే అందర్నీ బలవంతంగా ఒప్పంచి కట్టుకథలు చెప్పి రాజేశ్వరిని ఆమెను భర్త నుంచి వేరు చేయగలిగాడు దేవీదాస్. రెండు వారల క్రితం తను అనుకున్నట్టుగానే ఇద్దరీ విడదీస్తూ పెద్దలు అంగీకరించారు. అప్పటి నుంచి రాజేశ్వరి ఇంట్లో ఒకటే గొడవ. తన భర్త తనకు కావాలంటూ రోజూ గొడవ పడుతూనే ఉంది. 

ఇవాళ ఉదయం కూడా మరోసారి పెద్ద ఘర్షణ జరిగింది. దీంతో రాజేశ్వరిని ఒప్పించలేనని గ్రహించిన దేవీదాస్‌.. కుమార్తెను హత్య చేశాడు. తల్లి ఎదురుగా ఉండగానే రాజేశ్వరిని అతి దారుణంగా గొంతుకోసి హత్య చేశాడు. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు. అయినా పోలీసుల ముందు దొరికిపోయాడు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Andhra Pradesh News: సజ్జల భార్గవ్‌, వర్రా రవీందర్‌పై మరో కేసు- నిందితుల కోసం పోలీసుల గాలింపు
సజ్జల భార్గవ్‌, వర్రా రవీందర్‌పై మరో కేసు- నిందితుల కోసం పోలీసుల గాలింపు
Sri Reddy Open Letter: మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Hyderabad Crime News: ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
Embed widget