(Source: ECI/ABP News/ABP Majha)
Uppal News : పెళ్లైన యువకుడికి బలవంతపు పెళ్లి, నెట్టింట వీడియో వైరల్
Uppal News : హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో పెళ్లైన యువకుడికి మరో యువతితో మహిళా సంఘం సభ్యులు బలవంతపు పెళ్లి చేశాయి. బలవంతపు పెళ్లితో యువకుడి బంధువులు పోలీసులను ఆశ్రయించారు.
Uppal News : హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. రామంతపూర్ లో శ్రీకాంత్ అనే యువకుడికి యువతి బంధువులు, మహిళా సంఘాలు బలవంతపు పెళ్లి చేశాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీకాంత్ అనే యువకుడికి ముందుగానే వేరే యువతితో వివాహం జరిగింది. గతంలో ఓ యువతిని ప్రేమించి శ్రీకాంత్ ముఖం చాటేయడంతో ఆ యువతి కుటుంబ సభ్యులు శ్రీకాంత్ జాడ తెలుసుకొని ఇంటికి వచ్చారు. శ్రీకాంత్ కి వివాహమైన కూడా ప్రేమించిన యువతిని తీసుకొని మే 26న ఆయన ఇంటికి వచ్చారు. వారికి మహిళ సంఘం తోడై ధర్నాలు చేశారు. మహిళ సంఘం సభ్యులు, ప్రేమించిన అమ్మాయి సంబంధించిన పెద్దలు, శ్రీకాంత్ అనే యువకుడిని చితకబాది, ప్రేమించిన యువతితో మే 27న బలవంతపు వివాహం చేశారు. యువకుడికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్న వీడియోలు వైరల్ గా మారడంతో శ్రీకాంత్ కు బలవంతంగా వివాహం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కుటుంబ సభ్యులు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన రామాంతపూర్ లో జరిగింది.
స్వీయ వివాహం
గుజరాత్ కు చెందిన ఓ యువతి పెళ్లిపై వినూత్న నిర్ణయం తీసుకుంది. తనను తానే పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించింది. వడోదరకు చెందిన 24 ఏళ్ల క్షమా బిందు తనతో తన పెళ్లికి ముహూర్తం పెట్టుకుంది. పెళ్లి ముహూర్తంతో పాటు హనీమూన్ వరకు అన్ని ప్లాన్ చేసుకుంది. జూన్ 11న వివాహం ముహూర్తం నిర్ణయించుకుంది. దేశంలోనే ఇది మొదటి స్వీయ వివాహం కానుంది. ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న క్షమా బిందు ఈ విషయంపై స్పందిస్తూ... తాను ఎప్పుడూ పెళ్లి చేసుకోవాలనుకోలేదన్నారు. కానీ పెళ్లికూతురిని కావాలనుకున్నానని, అందుకోసం తనను తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానని పేర్కొంది. దేశంలో ఇలాంటి పెళ్లి ఎక్కడైన జరిగిందో లేదో అని సెర్చ్ చేస్తే ఏదీ కనిపించలేదని తెలిపింది. తన వివాహమే బహుశా మొదటిది కావొచ్చని తెలిపింది.
హనీమూన్ గోవాలో
అయితే స్వీయ వివాహాన్ని అసంబద్ధంగా భావించొచ్చు, కానీ మహిళలూ ముఖ్యమే అనే వాస్తవాన్ని చాటి చెప్పేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్లు క్షమా బిందు తెలిపింది. స్వీయ వివాహం అనేది ఓ నిబద్ధత అని, మన కోసం మనం అనేది దాని నిబంధన అని తెలిపింది. షరతుల్లేని ప్రేమను ఇచ్చుకోవడాన్ని సూచిస్తుందని ఆమె పేర్కొంది. ఎవరైనా తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకుంటారని ఇక్కడ తనను తాను ప్రేమిస్తుందని, అందుకే ఈ వివాహం అని క్షమా చెప్పుకొచ్చింది. ఈ విషయంలో తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పలేదని, గోత్రిలోని ఓ ఆలయంలో వివాహం జరుగుతున్నట్లు తెలిపింది. పెళ్లి తర్వాత హనీమూన్ కు గోవాకు వెళ్తున్నట్లు ఆమె చెప్పింది.