(Source: ECI/ABP News/ABP Majha)
Hyderabad Crime : ప్రేమ పేరుతో ట్రాన్స్ జెండర్ ను మోసం చేసిన యువకుడు, రెండేళ్లు సహజీవనం చేసి పరార్!
Hyderabad Crime : ప్రేమించానని ఓ ట్రాన్స్ జెండర్ వెంటబడ్డాడు ఓ యువకుడు. రెండేళ్లు ఆమెతో సహజీవనం చేసి ఇప్పుడు వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ సిద్ధమయ్యాడు. దీంతో ట్రాన్స్ జెండర్ పోలీసులను ఆశ్రయించింది.
Hyderabad Crime : ఓ ట్రాన్స్ జెండర్ ను ప్రేమ పేరుతో మోసం చేశాడో యువకుడు. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇందిరానగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందిరా నగర్ లో నివసిస్తున్న ట్రాన్స్ జెండర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు బాబు అలియాస్ గోపి అనే యువకుడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. తనకు న్యాయం చేశాలని ట్రాన్ జెండర్ ఆందోళనకు దిగింది. ఆమెకు బాసటగా పలువురు ట్రాన్స్ జెండర్ లు నిలిచారు.
న్యాయం పోరాటం చేస్తా
తనను రెండు సంవత్సరాలుగా బాబు అనే యువకుడు ప్రేమించాడని బాధిత ట్రాన్స్ జెండర్ తెలిపింది. గత కొద్ది రోజులుగా కలిసే ఉన్నామని, ఏడాది క్రితం తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. బాబు అలియాస్ గోపి తనతో సహజీవనం చేశాడని పేర్కొంది. ఇప్పుడు వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకుని తనను మోసం చేశాడని వాపోయింది. బాబుపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో తనను మోసం చేశాడని ఫిర్యాదు చేసినట్లు బాధిత ట్రాన్స్ జెండర్ తెలిపింది. బాబు మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందని, బాబుకు వారి పేరెంట్స్ ఖమ్మంలో వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిపించారని ఆరోపించింది. ట్రాన్స్ జెండర్ సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం వెళ్లి న్యాయ పోరాటం చేస్తానని తెలిపింది.
రెండేళ్లు సహజీవనం
Also Read : Bank Fraud: డేటింగ్ యాప్‌లో అమ్మాయితో లవ్వు! పనిచేస్తున్న బ్యాంకుకే కన్నమేసిన ఉద్యోగి!
Also Read : Visakha Cyber Crime : పెళ్లి చేసుకుంటాడని నమ్మి ఆ ఫొటోలు పంపిన యువతి, చివరకు?