By: ABP Desam | Updated at : 25 Jun 2022 03:24 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
వికారాబాద్ లో సెల్ఫీ వీడియో కలకలం
Vikarabad Selfie Video : వికారాబాద్ జిల్లా తాండూరులో తండ్రీకూతుర్ల సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. 48 గంటల్లో తన భార్య ఎక్కడుందో పోలీసులు కనుక్కోపోతే ఆత్మహత్య చేసుకుంటామని వీడియోలో తండ్రి, ఇద్దరు కూతుర్లు చెప్పారు. మూడు నెలల నుంచి తన భార్య కనిపించడంలేదని, ఈ విషయంపై పోలీసుల ఆశ్రయించినా పట్టించుకోవడంలేదని ఆవేదన చెందారు. తన భార్య అదృశ్యంపై పెద్దల హస్తం ఉందని భర్త ఆరోపించారు. అతను కూడా తన కూతుళ్లతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోతూ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తన భార్యను 48 గంటల్లోగా కనిపెట్టాలని లేదంటే 48 గంటల తర్వాత తమ సూసైడ్ లొకేషన్ పంపిస్తామని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. తండ్రీకూతుర్ల కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు.
అసలేం జరిగింది?
వికారాబాద్ జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు దొరిశెట్టి సత్యమూర్తి తాండూరు శివాజీ చౌరస్తా ప్రాంతంలో భార్యా పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. సత్యమూర్తి భార్య అన్నపూర్ణ(36) ఇంట్లోనే ఉండేవారు. అయితే ఈ ఏడాది మార్చి 6వ తేదీ నుంచి ఆమె అదృశ్యమయ్యారు. సత్యమూర్తి తన కుటుంబ సభ్యులతో కలిసి భార్య ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. రెండు రోజుల తరువాత తాండూరు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటికి మూడు నెలలు అవుతున్నా పోలీసులు ఆమె ఆచూకీ కనుక్కోలేదు. కుటుంబ సభ్యులు అన్నపూర్ణ తెలిస్తే తమను సంప్రదించాలని, ఆమె గురించి తెలిపిన వారికి రూ.5 లక్షల నగదు బహుమతి ఇస్తామని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ విషయం తాండూరులో చర్చనీయాంశం అయింది.
వాట్సప్ గ్రూపుల్లో సూసైడ్ లెటర్
ఇంటి నుంచి వెళ్లిపోయినప్పుడు అన్నపూర్ణ ఒక నోట్ రాశారు. అందులో తన భర్త దేవుడు. పిల్లలు జాగ్రత్త అని ఉంది. ఫిర్యాదు అందుకున్న కొన్ని రోజుల వరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఆ తర్వాత వదిలిపెట్టారు. సత్యమూర్తి భార్య మిస్సింగ్ పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేశారు. సీసీ ఫుటేజీలు ఫోన్ రికార్డులను సేకరించి పోలీసులకు అందజేశారు సత్యమూర్తి. అయినా పోలీసులు తన భార్య ఆచూకీ విషయంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇక చేసేదేంలేక 48 గంటల్లో తన భార్యను కనిపెట్టాలని లేకపోతే పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ ఓ సూసైడ్ లెటర్ కూడా పోస్ట్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సత్యమూర్తి స్నేహితులు, బంధువులు ఆయన ఇంటికి వెళ్లి ఆరా తీయగా ఇంటికి తాళం వేసి ఉంది. సత్యమూర్తి ఫోన్ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈ విషయంపై బంధువులు పోలీసులను ఆశ్రయించారు. సత్యమూర్తి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Bullet Bike Thieves: బుల్లెట్ బైకులంటే ప్రాణం, ఎక్కడ కనిపించినా అదే పనిచేస్తారు!
Mla Jeevan Reddy : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యాయత్నం కేసు, దాడికి అసలు కారణమిదే?
Palnadu News : పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన కానిస్టేబుల్, రూ.5 లక్షలతో పరారీ
Murder in Ghaziabad: పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియుడి గొంతు కోసిన మహిళ- చివరికి ట్విస్ట్!
Man Suicide: మొదటి భార్య మరణాన్ని తట్టుకోలేక, ఆమె సమాధి వద్దే ఆత్మహత్య!
కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్మీ కొత్త ఫోన్ లాంచ్కు రెడీ!
రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!
Monkeypox: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం
108కు కాల్ చేయడానికి భయమెందుకు? ఈ రోజు ఎవరో, రేపు మీకే ఆ సమస్య వస్తే? ఈ రూల్స్ తెలుసా?