News
News
X

Visakha Cyber Crime : పెళ్లి చేసుకుంటాడని నమ్మి ఆ ఫొటోలు పంపిన యువతి, చివరకు?

Visakha Cyber Crime : విశాఖలో యువతిని పెళ్లి చేసుకుంటానని ట్రాప్ చేసి నగ్న ఫొటోలు, వీడియోలు పంపించాలని వేధించాడో వ్యక్తి. యువతి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో యువకుడ్ని గుట్టురట్టైంది.

FOLLOW US: 

Visakha Cyber Crime : ఉద్యోగం కోసం రెజ్యూమ్ పంపిన యువతిని ట్రాప్ చేశాడో వ్యక్తి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి నగ్న ఫొటోలు, వీడియోలు పంపించాలని వేధిస్తున్న యువకుడ్ని విశాఖ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ ఎంవీపీ కాలనీ సెక్టర్‌ 10లో ఉంటున్న తిరుమలశెట్టి కనకరాజు తాను బెంగళూరులో ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌గా పని చేస్తున్నానని విశాఖకు చెందిన యువతితో పరిచయం చేసుకున్నాడు. ఫోన్‌ లో రోజూ మాట్లాడుతూ యువతితో పరిచయం మరింత పెంచుకున్నాడు. 

పెళ్లి చేసుకుంటానని మోసం 

యువతిని పెళ్లి చేసుకుంటానని, ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు కనకరాజు. అతడి మాటలు నమ్మిన యువతి తన రెజ్యూమ్‌తో పాటు ఫొటోలు, ఇతర సర్టిఫికెట్లు పంపించింది. ఆ తర్వాత యువతి నగ్న ఫొటోలు పంపించాలని కనకరాజు రోజూ వేధించేవాడు. పెళ్లి చేసుకుంటాడని నమ్మి ఒకసారి నగ్న ఫొటోలు, వీడియోలు వాట్సాప్‌ ద్వారా పంపించింది యువతి. కొద్ది రోజులు మామూలుగానే మళ్లీ నగ్న ఫొటోలు, వీడియోలు పంపించాలని వేధించడం మొదలుపెట్టాడు కనకరాజు. పంపకపోతే ముందు పంపించిన ఫొటోలు, వీడియోలు యువతి కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరించాడు.

సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు 

మోసపోయానని గ్రహించిన యువతి ఈ నెల 22న విశాఖ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. దీంతో సీసీఎస్‌ ఏడీసీపీ డి.సూర్యశ్రావణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో సైబర్‌ క్రైమ్‌ స్టేషన్‌ మహిళా ఎస్‌ఐ, బృందం దర్యాప్తు చేపట్టారు. యువతని బెదిరిస్తున్న వ్యక్తి ఎంవీపీ కాలనీలో ఉంటున్న తిరుమలశెట్టి కనకరాజు(48)గా గుర్తించారు. అతడిని అరెస్టు చేశారు. తెలియని వారిని నమ్మి సోషల్‌ మీడియాలో వ్యక్తిగత వివరాలు, ఫొటోలు పంపి మోసపోవద్దని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సూచించారు. 

కొంపముంచి సోషల్ మీడియా పరిచయం 

సోషల్ మీడియా వచ్చాక ఆన్‌లైన్ పరిచయాలు పెరిగిపోతున్నాయి. ముక్కు, మొహం తెలియన వాళ్లతో గంటల తరబడి చాటింగ్‌లు చేయటం, పరిధులు దాటటం లాంటివి ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. ఇలాంటి పరిచయాలన్నీ మోసపోవటంతోనే ముగిసిపోతున్నాయి. దేశరాజధాని దిల్లీలోనూ ఇటీవల ఇలాంటి ఘటనే జరిగింది. ఓ 55 ఏళ్ల వ్యక్తికి సోషల్ మీడియాలో ఓ అమ్మాయి పలకరించింది. పదేపదే మాట్లాడేది. వీరి పరిచయం కాస్త ముందుకెళ్లింది. ఉన్నట్టుండి ఓ రోజు తన ఫ్లాట్‌కు రమ్మంటూ ఆ అమ్మాయి మెసేజ్ చేసింది. ఆమె చెప్పినట్టుగానే అమ్మాయి ఫ్లాట్‌కి వెళ్లి రాత్రంతా గడిపాడు ఆ 55 ఏళ్ల వ్యక్తి. ఆ తరవాత  ట్విస్ట్‌కి ఆ పెద్దాయనకు షాక్ తగిలింది. వెంటనే పోలీస్ స్టేషన్‌కు పరుగులు పెట్టాడు. 

అసలు కథేంటంటే..? 

ఆ చనువుగా ఉన్న అమ్మాయి...పెద్దాయనను హనీట్రాప్ చేసింది. మెల్లగా మాటల్లోకి దించి తన ఫ్లాట్‌కి రప్పించుకుంది. ఇద్దరూ కాసేపు గడిపాక సడెన్‌గా ముగ్గురు వ్యక్తులు ఫ్లాట్‌కి వచ్చారు. పోలీసులమంటూ పెద్దాయనను బెదిరించారు. ఈ గుట్టు రట్టు కాకుండా ఉండాలంటే డబ్బులివ్వాల్సిందేనని పట్టు పట్టారు. చేసేదేమి లేక లక్షన్నర సమర్పించుకున్నాడు బాధితుడు. ఆ తరవాత కానీ అర్థం కాలేదు. ఆ నలుగురూ కలిసి ఆడిన నాటకమిదని. అప్పటికైనా మేలుకున్న బాధితుడు వెంటనే పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు. ఓ అమ్మాయి హనీప్రీత్ అనే ఓ అమ్మాయి తనను నమ్మించి మోసం చేసిందని చెప్పాడు. దర్యాప్తులో భాగంగా అమ్మాయి ఫ్లాట్‌కు వెళ్లిన పోలీసులు అసలు నిజాలు బయటపెట్టారు. హరియాణాకు చెందిన పవన్, మన్‌జీత్, దీపక్‌..పోలీసులమని నాటకమాడి బాధితుడి నుంచి లక్షన్నర రూపాయలు కొల్లగొట్టారని, ఆ అమ్మాయి పరారీలో ఉందని వెల్లడించారు. హనీప్రీత్ అనే అమ్మాయిని మిగతా ముగ్గురు నిందితులు తరచూ కలిసేవారని అపార్ట్‌మెంట్ యజమాని చెప్పాడు. 

బడా బాబులే టార్గెట్ 

లక్షన్నరతో ఉడాయించిన నిందితులు, తమ వస్తువుల కోసం మరోసారి ఫ్లాట్‌కు వచ్చారు. అప్పటికే వీరిపై నిఘా ఉంచిన పోలీసులు వెంటనేఅరెస్ట్ చేశారు. పవన్ అనే వ్యక్తి ఈ ప్లాన్‌ చేశాడని, గతంలోనూ ఈ తరహా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఓ ఫ్లాట్‌ని అద్దెకు తీసుకున్నారని, బడా బాబుల్ని బుట్టలో వేసుకుని ఇలా మోసం చేయటం వీరికి అలవాటేనని చెప్పారు. పరారీలో ఉన్న అమ్మాయి కోసం వెతుకుతున్నారు పోలీసులు. సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్ రిక్వెస్ట్‌లను వెరిఫై చేయకుండా యాక్సెప్ట్ చేయకూడదని, ఫేక్ అకౌంట్‌గా అనుమానం వస్తే వెంటనే బ్లాక్‌ చేయాలని సూచిస్తున్నారు. 

 

Published at : 26 Jun 2022 06:47 PM (IST) Tags: social media cyber crime Crime News Visakha News woman personal photos

సంబంధిత కథనాలు

Mancherial News :  ప్రేమించిన యువతి కోసం యువకుడి పోరాటం, లవర్ ఇంటి ముందు నిరసన

Mancherial News : ప్రేమించిన యువతి కోసం యువకుడి పోరాటం, లవర్ ఇంటి ముందు నిరసన

జగిత్యాలలో మరో చిన్నారి కిడ్నాప్, అసలేమైందంటే?

జగిత్యాలలో మరో చిన్నారి కిడ్నాప్, అసలేమైందంటే?

Mlc Anantababu : ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో ఎట్టకేలకు ఛార్జ్ షీట్, 88 రోజుల తర్వాత

Mlc Anantababu : ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో ఎట్టకేలకు ఛార్జ్ షీట్, 88 రోజుల తర్వాత

Crime News : బెదిరించడం కోసమే పెట్రోల్ కానీ తేడా కొట్టేసింది ! అంబర్ పేట కాలేజీలో జరిగింది ఇదే

Crime News : బెదిరించడం కోసమే పెట్రోల్ కానీ తేడా కొట్టేసింది ! అంబర్ పేట కాలేజీలో జరిగింది ఇదే

ఏలూరు జిల్లాలో సంచలనంగా మారిన వైసీపీ లీడర్ వీడియో!

ఏలూరు జిల్లాలో సంచలనంగా మారిన వైసీపీ లీడర్ వీడియో!

టాప్ స్టోరీస్

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!

Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!