అన్వేషించండి

Crime News: రూ.20 అడిగినందుకు తల్లిని చితకబాదిన తనయుడు-తల్లి మృతి

Hyderabad Crime News: 20 రూపాయలు కోసం తల్లీకొడుకుల మధ్య మొదలైన గొడవ... తల్లి ప్రాణం తీసింది. తనయుడి చేతిలో తన్నులు తిన్న తల్లి... నిద్రలోనే ఊపిరి వదిలింది. ఈ దారుణం ఎక్కడ జరిగింది..?

Shadnagar Crime News: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో దారుణం జరిగింది. 20 రూపాయల కోసం తల్లి,కొడుకుల మధ్య జరిగిన గొడవ... తల్లి ప్రాణం పోవడానికి  కారణమైంది. మద్యానికి అలవాటు పడ్డ తల్లి.. డబ్బుల కోసం తరచూ తనయుడిని వేధిస్తోందని సమాచారం. ఈ క్రమంలో 20రూపాయలు ఇవ్వమని అడిగిన తల్లిపై విచక్షణా  రహితంగా దాడి చేశాడు తనయుడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె... ప్రాణాలు విడిచినట్టు తెలుస్తోంది. 

సుగుణమ్మ.. ఈమె వయస్సు 40ఏళ్లు. ఆమెకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురికి పెళ్లి అయిపోయింది. భర్త లేకపోవడంతో కుమారుడు శివతో కలిసి  షాద్‌నగర్‌లోని కేశంపేటరోడ్డులో ఒక అద్దె ఇంట్లో ఉంటోంది సుగుణమ్మ. ఆమె కూతురు నందిని కూడా షాద్‌నగర్‌లోనే భర్తతో కలిసి ఉంటోంది. సుగుణమ్మ మద్యానికి  అలవాటు పడింది. మందు తాగేందుకు డబ్బుల కోసం తరచూ కుమారుడిని వేధిస్తోందని సమచారం. ఈ క్రమంలో ఆదివారం (జనవరి 7న) ఉదయం తల్లి సుగుణమ్మ మందు  తాగేందుకు 20రూపాయలు ఇవ్వాలని కొడుకు శివను అడిగింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంతో తల్లిని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు తనయుడు శివ.  పక్కింటి వాళ్లు వచ్చి... శివకు నచ్చజెప్పారు. ఆ తర్వాత శివ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తల్లి సుగుణమ్మ కూడా బయటకు వెళ్లి మధ్యాహ్నానికి ఇంటికి వచ్చింది.  

ఆదివారం (జనవరి 7వ తేదీ) మధ్యాహ్నం ఇంటికి తిరిగొచ్చిన సుగుణమ్మ... షాద్‌నగర్‌లోనే ఉంటున్న కూతురు నందిని ఇంటికి వెళ్లింది. కొడుకు కొట్టిన విషయాన్ని ఆమె చెప్పింది. దీంతో నందిని వారి ఇంటికి వచ్చి... తల్లి, తమ్ముడితో మాట్లాడింది. అమ్మను ఎందుకు కొట్టావని తమ్ముడిని నిలదీసింది. డబ్బుల కోసం బాగా సతాయిస్తోందని, ఇంట్లో ఉన్న బంగారం కుదవపెట్టి మరీ మద్యం తాగుతోందని.. దీంతో విసిగిపోయానని చెప్పుకొచ్చాడు. తర్వాత తల్లికి, తమ్ముడికి నచ్చజెప్పింది నందిని. ఆదివారం (జనవరి 7న) మధ్యాహ్నం 3గంటల సమయంలో అక్కాతమ్ముడు ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత తల్లి సుగుణమ్మ కూడా బయటికి వెళ్లి మళ్లీ మద్యం తాగింది.  ఇంటి ముందు స్పృహ తప్పి పడిపోయింది. చుట్టుపక్కల వారు గమనించి... ఆమెను ఇంట్లో పడుకోబెట్టారు. 

అదే రోజు.. ఆదివారం (జనవరి 7వ తేదీ) అర్ధరాత్రి 12 గంటలకు మళ్లీ కూతురు నందినికి ఫోన్ చేసింది సుగుణమ్మ. కొడుకు డబ్బులివ్వడం లేదని, తనకు డబ్బులు ఇప్పించాలని చెప్పింది. ఉదయం వచ్చి మాట్లాడతానని చెప్పింది కూతురు నందింది. సోమవారం (జనవరి 8వ తేదీ) ఉదయం 9గంటలకు కొడుకు తల్లి సుగుణమ్మను నిద్ర లేపేందుకు ప్రయత్నించగా... ఆమె లేవలేదు.. సరికదా ఎలాంటి స్పందన రాలేదు. వెంటనే పక్కింటి వాళ్లను, వైద్యుడిని పిలిపించి చూపించాడు. అప్పటికే సుగుణమ్మ చనిపోయిందని చెప్పారు. 

పోలీసులకు సమాచారం ఇవ్వడంతో... వారు సుగుణమ్మ డెడ్‌‌‌‌బాడీని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం షాద్‌‌‌‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడు కొట్టిందువల్లే తల్లి చనిపోయిందా...? లేక.. ఇంకేమైనా కారణం ఉందా అన్నది పోస్టుమార్టం రిపోర్ట్‌లో తెలుస్తుందన్నారు పోలీసులు.

టాప్ హెడ్ లైన్స్

Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Yastika Bhatia Century: లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా
లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
వైభవ్ సూర్యవంశీ Tata Sierra గెలుచుకున్నా ఇప్పుడే అతడు నడపలేడు.. కారు ధర, ఫీచర్లు ఇవే
వైభవ్ సూర్యవంశీ Tata Sierra గెలుచుకున్నా ఇప్పుడే అతడు నడపలేడు.. కారు ధర, ఫీచర్లు ఇవే
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Embed widget