By: ABP Desam | Updated at : 13 Sep 2021 12:41 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
మియాపూర్ లో చిన్నారి అనుమానాస్పద మృతి(ప్రతీకాత్మక చిత్రం)
హైదరాబాద్ మియాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. 13 నెలల చిన్నారి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఆదివారం ఓంకార్ నగర్‌లో బాలిక అదృశ్యమయ్యింది. సోమవారం తెల్లవారుజామున ఇంటి సమీపంలో చిన్నారి మృతదేహం దొరికింది. బాలికను 13 ఏళ్ల బాలుడు ఎత్తికెళ్లినట్లు పోలీసులకు చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పాప కళ్లు పొడిచి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పాప మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం తరలించారు.
ప్రమాదమా.. హత్యా?
మియాపూర్‌లో 13 నెలల బాలిక అదృశ్యమైన ఘటన విషాదం అయ్యింది. ఇంటి సమీపంలోని నీటి గుంతలో బాలిక మృతదేహం లభించింది. చిన్నారి తల్లిదండ్రులు ఆదివారం పనులకు పాపను చూసుకోమని పక్కంటి వారికి చెప్పారు. బాలిక తల్లిదండ్రులు చెత్త ఏరుకుంటూ జీవిస్తుంటారు. పనుల నుంచి తిరిగి వచ్చే సరికి బాలిక ఆచూకీలేదు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఇవాళ ఉదయం నీటి గుంతలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు... ప్రమాదమా, లేక హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన వివరాల్లో స్పష్టత లేకపోవడంతో వారిని విచారిస్తున్నారు. ఓ బాలుడు నిన్న సాయంత్రం పాపను తీసుకెళ్లినట్లు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. అప్పటి నుంచి బాలుడు కూడా అదృశ్యమైనట్లు తెలుస్తోంది.
చిన్నారి మృతిపై అనుమానాలు
బాలిక నిన్న రాత్రి కనిపించకుండా పోయి ఇవాళ ఉదయం విగతజీవిగా మారడంపై అనుమానాలు రేగుతున్నాయి. పాప ఆచూకీ లభించినప్పుడు తడిబట్టలతో ఉన్నట్లు పోలీసులు అన్నారు. చిన్నారిని నీటిలో ముంచి చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. పాప కుటుంబ సభ్యుల్లో ఒకరిపై అనుమానం ఉందని పోలీసులు ఉంటున్నారు.
ఇంతలో మరో ఘటన
వినాయక చవితి రోజున హైదరాబాద్ సైదాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆరెళ్లి చిన్నారిపై ఓ మృగాడు అత్యాచారం చేసి హత్య చేశాడు. అనంతరం పరుపులో చుట్టి ఇంట్లో పెట్టి తాళం వేసి పారిపోయాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ కాలనీ వారు రోడ్లపైకి నిరసన చేశారు. ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చింది. నిందితుడికి కఠిన శిక్షపడేలా చేస్తామని తెలిపింది. ఈ ఘటన మరువక ముందే మరో చిన్నారి అనుమానాస్పద రీతిలో మృతి చెందడంపై హైదరాబాద్ వాసులను దిగ్బ్రాంతికి గురిచేస్తోంది. అభం సుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతుండడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Nalgonda Accident : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, రథానికి విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి
Tamilnadu News : అప్పుల భారంతో భార్య, బిడ్డలను హత్య చేసిన వ్యాపారి, ఆ పై ఆత్మహత్య!
Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు
Srikakulam Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైన కుటుంబం- ఇంటి నుంచి బయలుదేరిన 10 నిమిషాలకే !
Hyderabad Fire Accident: రాయదుర్గంలోని హోటల్లో భారీ అగ్ని ప్రమాదం, భవనంలో చిక్కుకున్న 20 మంది - రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్
Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు
Redmi 11 5G Launch: రెడ్మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!