అన్వేషించండి

Krmb Grmb Meet: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల కీలక సమావేశం... ఇవాళ దిల్లీలో కేంద్రజల్‌శక్తి కార్యదర్శితో భేటీ... గెజిట్ అమలుపై చర్చ

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల కీలక సమావేశం ఇవాళ దిల్లీలో జరగనుంది. గెజిట్ అమలుపై కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి రెండు బోర్డుల ఛైర్మన్లతో భేటీ అవ్వనున్నారు

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల కీలక సమావేశం ఇవాళ దిల్లీలో జరగనుంది. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి.. ఇరు బోర్డుల ఛైర్మన్లతో భేటీ అవ్వనున్నారు. ఈ సమావేశంలో గెజిట్ నోటిఫికేషన్  అమలుపై చర్చించే అవకాశం ఉంది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధికి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు వస్తున్నందున కేంద్రం ఈ సమావేశం ఏర్పాటు చేసింది. సోమవారం దిల్లీలో జరిగే ఈ సమావేశానికి నేరుగా హాజరు కావాలని కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లు ఎంపీ సింగ్‌, చంద్రశేఖర్‌ అయ్యర్‌లను కోరింది. నోటిఫికేషన్‌ అమలు తేదీని వాయిదా వేయాలని, రెండో షెడ్యూలులోని ప్రాజెక్టుల విషయంలో మార్పు చేయాలని తెలుగు రాష్ట్రాలు పట్టుపడుతున్న నేపథ్యంలో కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ అత్యవసరంగా నిర్వహిస్తున్న ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధులను ఖరారు చేస్తూ జులై 15న కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఆ గడువులోగా సాధ్యం కాదు

ఈ గెజిట్ అక్టోబరు 14 నుంచి అమలులోకి వస్తుందని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ తెలిపింది. అనుమతి లేని ప్రాజెక్టులకు ఆరు నెలల్లోగా అనుమతులు తీసుకోవాలని తెలిపింది. లేకపోతే ఆ ప్రాజెక్టులను నిలిపివేయాలని గెజిట్ లో పేర్కొంది. దీంతో సెప్టెంబరు ఒకటిన కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశం నిర్వహించాయి. గెజిట్‌లో పేర్కొన్న సమయానికి అనుమతులు పొందడం సాధ్యం కాదని, దశలవారీగా అమలుచేయాలని రెండు రాష్ట్రాలు బోర్డులకు తెలిపాయి. రెండు నెలల్లోగా ఒక్కో రాష్ట్రం ఒక్కో బోర్డుకు రూ.200 కోట్లు చొప్పున డిపాజిట్‌ చేయడం సాధ్యంకాదని ఇరు రాష్ట్రాలు పేర్కొన్నాయి. 15 రోజులకోసారి అవసరాలకు తగ్గట్లుగా విడుదల చేస్తామని తెలిపాయి. 

తెలంగాణ అభ్యంతరం

ఈ సమావేశం అనంతరం కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖకు ఏపీ లేఖ రాసింది. కృష్ణానదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులు బోర్డు పూర్తి అజమాయిషీలో రెండో షెడ్యూలులో ఉంటే సరిపోతుందని తెలిపింది. ప్రకాశం బ్యారేజి, పోతిరెడ్డిపాడు కింద ఉన్న కాలువలు, ప్రాజెక్టులు అవసరం లేదని తెలిపింది. సీఎం కేసీఆర్‌ ఈ నెల 6న కేంద్ర జల్‌శక్తి మంత్రిని కలిసి పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. గోదావరిలో అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలో చేర్చడం, కాళేశ్వరం అదనపు టీఎంసీ పనికి అనుమతి లేదని పేర్కొనడంపై చర్చించారు. వీటన్నింటిపై ఈ నెల 10న కేంద్రజల్‌శక్తి కార్యదర్శి దిల్లీలో సమావేశం నిర్వహించారు. దీనికి అనుగుణంగా ఇవాళ బోర్డు ఛైర్మన్లతో సమావేశం కావాలని నిర్ణయించారు.

Also Read: Old Note: అబ్బా లక్కీ ఛాన్స్.. ఈ పది రూపాయలుంటే రూ.5 లక్షలు మీవే.. ఇక జేబులో వేసుకోవచ్చు

టాప్ హెడ్ లైన్స్

How To Join ISRO After Graduation: ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
CM Vijay Cabinet Meeting: కేబినెట్ భేటీలో సీఎం విజయ్ ఫైర్ - అవినీతి ఊసే ఉంటే మంత్రి పదవి అవుట్.. తమిళనాడులో విప్లవాత్మక ఆదేశాలు!
కేబినెట్ భేటీలో సీఎం విజయ్ ఫైర్ - అవినీతి ఊసే ఉంటే మంత్రి పదవి అవుట్.. తమిళనాడులో విప్లవాత్మక ఆదేశాలు!
ISRO Scientists Resign:ఇస్రోలో 100 మందికిపైగా శాస్త్రవేత్తలు ఎందుకు రాజీనామా చేశారు? కేంద్రం తీసుకున్న చర్యలు ఏంటి?
ఇస్రోలో 100 మందికిపైగా శాస్త్రవేత్తలు ఎందుకు రాజీనామా చేశారు? కేంద్రం తీసుకున్న చర్యలు ఏంటి?
Breaking News: పూరీ జగన్నాథ్ ఆలయంలో తొక్కిసలాట- ఒకరు మృతి- 100 మందికి గాయాలు 
పూరీ జగన్నాథ్ ఆలయంలో తొక్కిసలాట- ఒకరు మృతి- 100 మందికి గాయాలు 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Agniveer Recruitment: భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Embed widget