Hyderabad: తల్లిపైనే నీచానికి పాల్పడిన కన్న కూతురు.. ప్రియుడి సాయం తీసుకొని దారుణం
తన ప్రేమకు అడ్డు వస్తోందని ఓ బాలిక కన్న తల్లినే హత మార్చింది. హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
![Hyderabad: తల్లిపైనే నీచానికి పాల్పడిన కన్న కూతురు.. ప్రియుడి సాయం తీసుకొని దారుణం Hyderabad: Minor Daughter murders own mother with minor lover in Rajendranagar Hyderabad: తల్లిపైనే నీచానికి పాల్పడిన కన్న కూతురు.. ప్రియుడి సాయం తీసుకొని దారుణం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/17/2ff1e53bc8423439c14debb802b00727_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
హైదరాబాద్‌లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మైనర్ల ప్రేమ ఏకంగా కన్న తల్లి హత్యకు దారి తీసింది. కన్న కుమార్తెనే తల్లిని మట్టుబెట్టిన సంచలన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు ప్రియుడి సహకారం తీసుకుంది. ఈ అత్యంత పాశవికమైన ఘటన హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్‌లో చోటు చేసుకుంది. 17 ఏళ్ల వయసులో ప్రేమలో పడడమే కాకుండా క్షణికావేశానికి గురై వారిద్దరూ తల్లినే హతమార్చారు. నగరంలో ఇది సంచలనంగా మారింది.
Also Read: ఈటలను చిత్తు చేయండి.. హరీశ్ రావు వ్యాఖ్యలు, సొంత ఇలాకాలో మంత్రికి షాక్
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తన ప్రేమకు అడ్డు వస్తోందని ఓ బాలిక కన్న తల్లినే హత మార్చింది. రాజేంద్ర నగర్ సమీపంలోని చింతల్‌మెట్‌లో దంపతులు ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె పెళ్లిని ఇటీవలే చేసి అత్తారింటికి పంపారు. చిన్న కుమార్తె (17) ఇంట్లోనే తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆమె స్థానికంగా ఉండే 17 ఏళ్ల బాలుడితో ప్రేమలో పడింది. ఈ విషయం బాలిక తల్లికి తెలియడం వల్ల గతంలో ఎన్నో సార్లు తిట్టింది. అతనితో తిరగొద్దని హితవు పలికింది. ఈ క్రమంలోనే సోమవారం కూడా మరోసారి గట్టిగా చెప్పింది.
Also Read: Nellore Crime: మైనర్ అత్యాచారం కేసులో మరో టిస్ట్.. పోలీసులు తనను బెదిరించారని బాలిక ఆరోపణ..!
అదే సమయంలో బాలిక ఏకంగా ప్రియుడ్ని ఇంటికి పిలిపించుకొని తల్లితో గొడవ పెట్టుకుంది. ఆ గొడవ మరీ పెద్దది కావడంతో తన చున్నీ తీసి తల్లి మెడకు చుట్టి బిగించింది. బాలుడు కూడా సహకరించడంతో ఆమె తల్లి అక్కడికక్కడే చనిపోయింది. దీంతో భయపడిపోయిన ఇద్దరూ తన తల్లి నేలపై పడి చనిపోయిందని చుట్టుపక్కల వారికి చెప్పి నమ్మించింది. ఆ సమయంలో బాలిక తండ్రి పనిపై బయటకు వెళ్లాడు. తర్వాత ఇంటికి వచ్చిన ఆయనకు, స్థానికులకు అనుమానం రావడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని నిందితులపై బాలిక, బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరినీ ప్రశ్నించగా.. తామే హత్య చేసినట్లుగా ఒప్పుకున్నారని పోలీసులు వెల్లడించారు.
Also Read: యూపీలో ఘోరం.. జిల్లా కోర్టులో లాయర్ దారుణహత్య.. రోహిణి షూటౌట్ మరువకముందే..!
Also Read: జీవితాంతం జైల్లోనే డేరా బాబా .. హత్య కేసులో మరో యావజ్జీవ శిక్ష !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)