News
News
X

Dera Baba : జీవితాంతం జైల్లోనే డేరా బాబా .. హత్య కేసులో మరో యావజ్జీవ శిక్ష !

రంజిత్ సింగ్ హత్య కేసులో డేరాబాబాకు యావజ్జీవ శిక్ష పడింది. ఇప్పటికే రెండు కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న డేరాబాబాకు మరో శిక్ష పడినట్లయింది.

FOLLOW US: 

వివాదాస్పద మత గురువు డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌ సింగ్ అలియాస్ డేరాబాబాకు యావజ్జీన ఖైదు విధించారు. తన శిష్యుడు, మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా బాబాతో పాటు మరో ఐదుగురిని దోషులుగా పంచకుల సీబీఐ స్పెషల్ కోర్టు తేల్చింది. ఐదుగురికీ జీవిత ఖైదు విధించింది. డేరా బాబాకు రూ.31 లక్షలు..  మిగిలిన నలుగురికీ రూ.50 వేల చొప్పున జరిమానా విధించింది. 

Also Read : యూపీ ఎన్నికల్లో 'ప్రియాంకం'.. 'భాజపా X కాంగ్రెస్' గా మారిన రాజకీయం

రంజిత్ సింగ్‌ను 2002 జులై 10న హత్యకు గురయ్యారు.  ఆశ్రమంలోని మహిళలను సెక్స్ బానిసలుగా చేసుకుని డేరా బాబా చేస్తున్న అరాచకాలకు సంబంధించి అప్ప‌ట్లో ఒక లేఖ బ‌య‌టికి వ‌చ్చింది. అయితే, త‌న అరాచ‌కాల‌ను బయటి ప్రపంచానికి తెలియజెప్పడానికి రంజిత్ సింగే ఆ ప‌ని చేసిన‌ట్లు డేరా బాబా అనుమానించి హ‌త్య చేయించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో డేరా బాబానే హత్య చేశాడని ఆరోపిస్తూ  రంజిత్ సింగ్ కొడుకు జగ్సీర్‌‌ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును సీబీఐకి సిఫార్సు చేశారు. 2003 డిసెంబర్‌‌ 3న సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. దర్యాప్తు మొదలు పెట్టింది. హర్యానాలోని పంచకులలో ఉన్న సీబీఐ స్పెషల్ కోర్టులో ఈ కేసు విచారణ సాగుతోంది. సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. పది రోజుల క్రితమే పంచకుల కోర్టు డేరా బాబాతో పాటు మరో ఐదుగురిని సెక్షన్ 302 కింద దోషులుగా తేల్చింది. సోమవారం శిక్షను ప్రకటించింది. 

Also Read : మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడం కష్టమే .. మొన్న కేంద్రమంత్రి ఇంద్రజిత్.. ఇవాళ గవర్నర్ మాలిక్ వ్యాఖ్యలు !

డేరా బాబా ఇప్పటికే రెండు కేసుల్లో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. తన ఆశ్రమంలో శిష్యులుగా ఉన్న ఇద్దరు మహిళలను రేప్ చేసిన కేసులో 2017 ఆగస్టులో పంచకుల సీబీఐ కోర్టు డేరా బాబాను దోషిగా తేల్చి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అలాగే డేరా బాబా తన ఆశ్రమంలో చేస్తున్న అరాచకాలు, మహిళలపై చేస్తున్న అఘాయిత్యాలపై వార్త కథనాలు రాసిన జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతిని చంపిన కేసులోనూ దోషిగా తేలుస్తూ 2019లో కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. 

Also Read : కాంగ్రెస్‌లో ప్రశాంత్ కిషోర్ చిచ్చు ! ప్రియాంకను ఎదగకుండా రాహుల్ అడ్డుకుంటున్నారా ?

పంజాబ్, హర్యానాల్లో కొన్ని లక్షల మంది అనుచరులు ఉన్న వివాదాస్పద తమ గురువు డేరా బాబా, ఆయన సామ్రాజ్యం అంతా నేరాల మయమే. అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆయన సినిమాల్లోనూ నటిస్తూంటారు. అయితే చివరికి పాపాలు పండటంతో జైలు పాలయ్యాడు. ఇప్పుడు ఇక జీవితాంతం జైల్లోనే మగ్గనున్నారు. 

Also Read: Kerala Rain Fury: కేరళలో మహా విలయం.. వర్షాలు, వరదల ధాటికి 21 మంది మృతి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 18 Oct 2021 07:49 PM (IST) Tags: dera sacha sauda Ranjit Singh Murder Case Dera chief ్ dera baba darababa life imprisonment Gurmeet Ram Rahim Singh

సంబంధిత కథనాలు

MLA Kethireddy: నీ పథకాలేం అక్కర్లేదన్న గ్రామస్థుడు, క్షణాల్లోనే దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే

MLA Kethireddy: నీ పథకాలేం అక్కర్లేదన్న గ్రామస్థుడు, క్షణాల్లోనే దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే

Delhi: కత్తులతో పొడుస్తుంటే కుర్చీ వేసుకుని చూసిన వ్యక్తి - వీడియో వైరల్!

Delhi: కత్తులతో పొడుస్తుంటే కుర్చీ వేసుకుని చూసిన వ్యక్తి - వీడియో వైరల్!

Minister KTR : బీజేపీ పేరు ఇలా మార్చేసుకోండి, ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ సెటైర్

Minister KTR : బీజేపీ పేరు ఇలా మార్చేసుకోండి, ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ సెటైర్

Revanth Reddy: కేసీఆర్, మోదీలు బ్రిటీషర్లకు ఏకలవ్య శిష్యులు, వారి విధానం అదే - రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Revanth Reddy: కేసీఆర్, మోదీలు బ్రిటీషర్లకు ఏకలవ్య శిష్యులు, వారి విధానం అదే - రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Chittoor: డబ్బు తెమ్మని భర్తను అడవిలోకి పంపిన భార్య, దాని వెనక భారీ కుట్ర - మొత్తం బట్టబయలు

Chittoor: డబ్బు తెమ్మని భర్తను అడవిలోకి పంపిన భార్య, దాని వెనక భారీ కుట్ర - మొత్తం బట్టబయలు

టాప్ స్టోరీస్

Ayyanna Patrudu: మమ్మల్ని మ్యాచ్ చెయ్యడం మీ తరం కాదు - విజయసాయిరెడ్డికి అయ్యన్న కౌంటర్

Ayyanna Patrudu: మమ్మల్ని మ్యాచ్ చెయ్యడం మీ తరం కాదు - విజయసాయిరెడ్డికి అయ్యన్న కౌంటర్

Blood Diamonds: ఆ దేశంలో వజ్రాలు విరివిగా దొరకుతాయి! అయినా, నిత్యం ఆకలి చావులు, అనుక్షణం భయం భయం!!

Blood Diamonds: ఆ దేశంలో  వజ్రాలు  విరివిగా దొరకుతాయి! అయినా, నిత్యం ఆకలి చావులు, అనుక్షణం భయం భయం!!

Bigg Boss 6 Telugu: దసరా సందడంతా బిగ్‌బాస్ హౌస్‌లోనే, ఈ రోజు ఎపిసోడ్ మామూలుగా ఉండదు

Bigg Boss 6 Telugu: దసరా సందడంతా బిగ్‌బాస్ హౌస్‌లోనే, ఈ రోజు ఎపిసోడ్ మామూలుగా ఉండదు

Ex MLA Vijaya Ramanarao Arrest: పెద్దపల్లి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య ఇసుక అక్రమ రవాణా వివాదం, ప్రమాణాలకు సై అంటే సై!

Ex MLA Vijaya Ramanarao Arrest: పెద్దపల్లి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య ఇసుక అక్రమ రవాణా వివాదం, ప్రమాణాలకు సై అంటే సై!