(Source: ECI/ABP News/ABP Majha)
BJP : మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడం కష్టమే .. మొన్న కేంద్రమంత్రి ఇంద్రజిత్.. ఇవాళ గవర్నర్ మాలిక్ వ్యాఖ్యలు !
నోరు జారే నేతలున్నారు కానీ ఉద్దేశపూర్వకంగా సొంత పార్టీ గెలవదని చెప్పే నేతలు కొద్ది మందే ఉంటారు. అలాంటి వారు ఇప్పుడు బీజేపీలో పెరిగిపోతున్నారు.
" రైతుల డిమాండ్లు నెరవేర్చకపోతే భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి రాదు. యూపీ గ్రామాల్లోకి లీడర్లు కూడా ప్రవేశించలేరు..." ఇవి ఏ కాంగ్రెస్ పార్టీ లీడరో లేకపోతే బీజేపీకి బద్ద శత్రువు అయిన ప్రాంతీయ పార్టీ నేతనో చేసిన విమర్శ కాదు. అచ్చంగా బీజేపీ నేతగా వ్యవహరించే మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యలు. గవర్నర్‌గా ఉంటూ రాజకీయ కామెంట్లు చేయడానికి ఆయన ఎప్పుడూ సంకోచించలేదు. నిన్నామొన్నటి వరకూ జమ్మూకశ్మీర్‌కు లెప్టినెంట్ గవర్నర్‌గా ఉన్నారు. తర్వాత మేఘాలయ గవర్నర్‌గా వెళ్లారు. అయినా బీజేపీని కాకుండా ఇతర పక్షాలపై విమర్శలు చేయడంలో ఆయన ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు బీజేపీనే టార్గెట్ చేశారు. కేంద్రమంత్రి పదవికి అజయ్ మిశ్రా పనికి రారని మాలిక్ తేల్చేశారు. యూపీకే చెందిన సత్యపాల్ మాలిక్ కరుడు గట్టిన బీజేపీ నేత. రెండు సార్లు ఎంపీగా కూడా గెలిచారు.
Also Read : కాంగ్రెస్‌లో ప్రశాంత్ కిషోర్ చిచ్చు ! ప్రియాంకను ఎదగకుండా రాహుల్ అడ్డుకుంటున్నారా ?
సత్యపాల్ మాలిక్ కన్నా మూడు రోజుల ముందు కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ ఇంకా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పేరు చెప్పుకుని పోటీ చేస్తే 45 సీట్లు సాధించడం కూడా సందేహమేననే అభిప్రాయపడ్డారు. కార్యకర్తలంతా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేస్తేనే విజయం సాధ్యమని స్పష్టం చేశారు. మోడీ నాయకత్వంలో బీజేపీ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. మూడో సారి మోడీనే నమ్ముకుంటే కష్టమని.. మోడీ పేరు మీద ఓట్లు వస్తాయనే గ్యారెంటీ లేదని స్పష్టం చేశారు. హర్యానాలో ఓ ఉపఎన్నిక ప్రచారానికి వెళ్లి ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read : యూపీ ఎన్నికల్లో 'ప్రియాంకం'.. 'భాజపా X కాంగ్రెస్' గా మారిన రాజకీయం
భారతీయ జనతా పార్టీకి కీలకమైన రాష్ట్రాల్లో అత్యంత క్లిష్టమైన సమస్యలు ఎదురు వస్తున్నాయి. యూపీ, పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో వ్యవసాయ చట్టాలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ఉద్యమం చేస్తున్న రైతులను పట్టించుకోకపోవడం .. వారిపై దాడులకు తెగబడటం వంటివి ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి కారణం అవుతున్నాయి. అదే సమయంలో పెట్రోల్, గ్యాస్ ధరల పెంపు సామాన్యులపై పెను భారం మోపుతోంది.
Also Read: Kerala Rain Fury: కేరళలో మహా విలయం.. వర్షాలు, వరదల ధాటికి 21 మంది మృతి
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేకతను అగ్రెసివ్‌గా ఉండే మంత్రులు, గవర్నర్లు బహిరంగంగానే చెబుతున్నారు. అలా చెప్పినప్పుడు సహజంగానే అందరి దృష్టిలో పడుతున్నాయి. కానీ వారు లేవనెత్తిన సమస్యల విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతోంది. ఫలితంగా ఇలా వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపోటములపై కీలక నేతలు కూడా వ్యాఖ్యలు చేసే పరిస్థితి వచ్చింది.
Also Read : నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు అన్యాయం జరిగింది.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి