అన్వేషించండి

Karumuru Venkat Reddy Arrest: వైసీపీ నేత కారుమూరు వెంకట్ రెడ్డి అరెస్ట్, హైదరాబాద్ నుంచి ఏపీకి తరలింపు

Karumuru Venkat Reddy | వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్ రెడ్డిని తాడిపత్రి రూరల్ పోలీసులు హైదరాబాద్‌కు వచ్చి కూకట్‌‌పల్లిలో అరెస్ట్ చేశారు. ఆయనపై ఏపీలో పలు కేసులు నమోదయ్యాయి.

YSRCP leader Karumuru Venkat Reddy | హైదరాబాద్‌: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఏరియాలో ఏపీలోని తాడిపత్రి పోలీసులు వెంకట్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ఏపీకి తరలిస్తున్నారు. వైసీపీ నేత కారుమూరి వెంకట్‌రెడ్డిపై ఆంధ్రప్రదేశ్‌లో పలు కేసులు నమోయ్యాయి.

వైసీపీ నేత వెంకట్‌రెడ్డిపై నమోదైన కేసుల వివరాలు పరిశీలిస్తే, ఇటీవల తిరుమల పరకామణి కేసులో ఫిర్యాదుదారు అయిన సతీశ్‌కుమార్‌ నవంబర్ 14వ తేదీన తాడిపత్రి సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన హత్యకు గురయ్యాడు. దాంతో ఏపీ పోలీసులు ఈ కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టలను దెబ్బతీసేలా వ్యవహరించడం, సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత కారుమూరి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత ఓ టీవీ ఛానల్ డిబేట్‌లో పాల్గొన్న వెంకట్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై, సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని తాడిపత్రి టీడీపీ నేత ప్రసాదనాయుడు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్‌కు వచ్చి అరెస్ట్ చేసిన పోలీసులు

టీడీపీ నేత ఫిర్యాదు ఆధారంగా కారుమూరు వెంకట్ రెడ్డిపై తాడిపత్రి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ఆయన హైదరాబాద్ లో ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో తాడిపత్రి రూరల్ పోలీసులు హైదరాబాద్‌కు వచ్చి కూకట్‌పల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉన్న వెంకట్ రెడ్డిని మంగళవారం అరెస్ట్ చేశారు. వైసీపీ నేత కారుమూరును హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిస్తున్నారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, అందులో భాగంగానే ప్రభుత్వాన్ని ప్రశ్నించే తమను అరెస్ట్ చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

కారుమూరు వెంకట్ రెడ్డి భార్య ఏమన్నారంటే..

తొలుత మా ఇంట్లోకి వచ్చిన పోలీసులు జస్ట్ ఇన్ఫార్మ్ చేయడానికే వచ్చామని చెప్పారు. ఆ తర్వాత నోటీసులు ఇవ్వడానికి వచ్చినట్లు చెప్పి.. ఆఖరిగా విచారణ కోసం తీసుకెళ్తున్నాం అన్నారు. ఇంట్లోకి వచ్చీ రాగానే పోలీసులు నా ఫోన్, మా ఆయన వెంకటరెడ్డి ఫోన్‌ను లాగేసుకున్నారు.. ఎవరికీ సమాచారం ఇవ్వొద్దు అని బెదిరించారు. చాలా సేపు వాదించిన తర్వాత ఆఖరిగా నా ఫోన్ చేతికి ఇచ్చి వెంకటరెడ్డిని వారితో తీసుకెళ్లారు - కారుమూరు వెంకటరెడ్డి సతీమణి హరిత 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
YS Jagan On DSC 2025:
"డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వమే అంగీకరించింది, అందుకే సీబీఐ విచారణ చేయాలి" వైఎస్‌ జగన్ డిమాండ్ 

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Embed widget