Son killed mother: తల్లిని కత్తితో పొడిచి చంపిన కుమారుడు - హైదరాబాద్‌లో ఘోరం - డబ్బుల కోసమే ?
Hyderabad: హైదరాబాద్ నేరెడ్ మెట్‌లో ఓ వ్యక్తి తల్లిని కత్తితో పొడిచి చంపాడు. వ్యసనాలకు బానిసై డబ్బులు ఇవ్వలేదన్న కారణంగా హత్య చేసినట్లుగా తెలుస్తోంది.

Hyderabad man stabbed his mother to death in Nered Met : కనిపెంచిన కొడుకే ఆమెను కాటికి పంపాడు. అత్యంత కరాతకంగా కత్తితో పొడిచి చంపాడు. హైదరాబాద్ నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల వినాయక నగర్ కాలనీలో ఈ ఘటన జరిగింది. మృతురాలిని బైకల్ మల్లమ్మగా గుర్తించారు. ఆమె వయసు అరవై ఐదేళ్లు. హత్య చేసిన కుమారుడు పేరు సురేష్. ఆతని వయసు 45 ఏళ్లు. హత్య గురించి తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. అప్పటికే సురేష్ పారిపోయినట్లుగా తెలుస్తోంది.
బైకల్ మల్లమ్మ భర్త లేకపోయినప్పటికీ పిల్లలను పెంచి పెద్ద చేసింది. అయితే కుమారుడు సురేష్ పనీ పాటా లేకుండా తిరగతూ ఉంటాడని డబ్బుల కోసం వేధిస్తూ ఉంటాడని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. వ్యసనాలకు బానిసైన సురేష్ తల్లి డబ్బులు ఇవ్వకపోవడంతో కత్తితో దాడి చేసినట్లుగా భావిస్తున్నారు. సురేష్ చుట్టుపక్కలవారితోనూ ఎక్కువగా గొడవ పడుతూ ఉంటాడని చెబుతున్నారు.



















