అన్వేషించండి

Hyderabad: రాత్రి ఇంట్లోంచి బయటికెళ్లిన బాలిక, కొద్ది దూరంలోనే శవంగా! నోట్లో నుంచి రక్తం

రాత్రి 10 గంటలకు బయటికి బాలిక బయటకు వెళ్లిందని, అర్ధరాత్రి దాటాక 2.30 ఆమె శవాన్ని గుర్తించినట్లుగా పోలీసులు వెల్లడించారు.

రాత్రి వేళ ఒంటరిగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన బాలిక కాసేపటికి శవంగా మారడం హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు. రాత్రి 10 గంటలకు బయటికి బాలిక బయటకు వెళ్లిందని, అర్ధరాత్రి దాటాక 2.30 ఆమె శవాన్ని గుర్తించినట్లుగా పోలీసులు వెల్లడించారు. పూర్తి వివరాలివీ..

జీడిమెట్ల పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల సమీపంలోని సుభాష్‌ నగర్‌లో బచ్చన్‌ సింగ్, పూర్ణం కౌర్‌ దంపతులకు ఐదుగురు పిల్లలు ఉండగా.. వీరిలో నలుగురు కుమార్తెలు. ఒక కుమారుడు. వీరిలో పెద్ద కుమార్తెకు 17 ఏళ్లు. ఆరో తరగతి వరకు చదివి.. ఆపేసింది. ఇంటి వద్దనే ఉంటుంది. బచ్చన్‌ సింగ్‌ కుటుంబం నాలుగు నెలల క్రితం గాజులరామారంలో ఉండేది కాగా.. ఇటీవలే సుభాష్‌ నగర్‌కు మారారు.

ఇదిలా ఉండగా.. సోమవారం రాత్రి 10 గంటల వరకు ఇంట్లోనే ఉన్న బాలిక ఒంటరిగా ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అరగంట అయినా ఆమె ఇంకా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. అయినా ఆమె కనిపించలేదు. దీంతో రాత్రి ఒంటి గంటకు జీడిమెట్ల పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే పోలీసులు కిడ్నాప్‌‌గా కేసు నమోదు చేశారు.

తర్వాత రాత్రి 2.30 సమయంలో స్థానిక పైప్‌ లైన్‌ రోడ్డులోని ఓ భవనం వద్ద బాలిక శవం పడి ఉందని సమాచారం అందింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు బాలిక తల్లిదండ్రులను రమ్మని శవాన్ని చూపించారు. దీంతో ఆమె తమ కుమార్తెనే అని తల్లిదండ్రులు నిర్ధరించారు. ఆ బాలిక చున్నీ అదే భవనంలోని ఐదో అంతస్తులో దొరికింది. బాలిక తలపై బలమైన గాయం, నోట్లో నుంచి రక్తం వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో ఆత్మహత్య అని అనుమానించారు. బాలిక పోస్టుమార్టమ్‌ రిపోర్టులోనూ హత్య జరిగిందనే ఆనవాళ్లు దొరకలేదు. 

ప్రేమికుల దినోత్సవం రోజే ఈమె ఆత్మహత్య చేసుకోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. తన ఇంటికి దూరంగా ఉన్న అపార్ట్‌మెంట్‌ వద్దకు వచ్చినా.. చీకటిగా ఉండే 5వ అంతస్తుకు ఒంటరిగా ఎలా వెళ్లింది? వాచ్ మెన్ ఏం చేస్తున్నాడు? వెళ్లినా అపార్ట్‌మెంట్‌పైన పిట్టగోడ చాలా ఎత్తులో ఉంది. అది బాలిక అంత సులభంగా ఎలా ఎక్కగలదు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

Also Read: Khammam Crime: మామ గారితో కోడలు అఫైర్! పడకపై ఉండగా చూసిన కన్న కూతురు, చివరికి ఏమైందంటే

Also Read: Hyderabad: నెట్‌ఫ్లిక్స్‌లో వెబ్ సిరీస్‌లు చూస్తూ వరుసగా కిడ్నాప్‌లు, వీళ్ల పక్కా ప్లాన్‌లు తెలిసి అవాక్కైన పోలీసులు!

టాప్ హెడ్ లైన్స్

Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Nandu World Couple Reaction : డబ్బులు తీసుకుని ఫేక్ ప్రచారం... ఎవరూ నమ్మొద్దు - యూకే వీసా స్కాంపై నందు వరల్డ్ జంట రియాక్షన్
డబ్బులు తీసుకుని ఫేక్ ప్రచారం... ఎవరూ నమ్మొద్దు - యూకే వీసా స్కాంపై నందు వరల్డ్ జంట రియాక్షన్
Nandu World Insta Couple Scam: సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
IPL final match driving accident: ఐపీఎల్ ఫైనల్ చూస్తూ డ్రైవింగ్ - బావిలోకి వెళ్లిపోయిన కారు - వ్యక్తి మృతి !
ఐపీఎల్ ఫైనల్ చూస్తూ డ్రైవింగ్ - బావిలోకి వెళ్లిపోయిన కారు - వ్యక్తి మృతి !

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Opposition Crisis Deep Dive Analysis: ప్రాంతీయ పక్షాల కోటలకు బీటలు! ప్రశ్నార్థకంగా పార్టీల మనుగడ! అధికారంలో లేకపోతే అంతే సంగతులా?
ప్రాంతీయ పక్షాల కోటలకు బీటలు! ప్రశ్నార్థకంగా పార్టీల మనుగడ! అధికారంలో లేకపోతే అంతే సంగతులా?
AP DSC 2025 Irregularities: మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు! కమిటీ వేసిన వైఎస్‌ జగన్! సీబీఐ విచారణకు డిమాండ్!
మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు! కమిటీ వేసిన వైఎస్‌ జగన్! సీబీఐ విచారణకు డిమాండ్!
TDP Janasena BJP Seat Sharing Formula: ఏపీ స్థానిక ఎన్నికల ఆలస్యం వెనుక బాబు మాస్టర్ ప్లాన్ - కూటమిలో చిచ్చు పెట్టకుండా నియోజకవర్గ స్థాయి ‘సమన్వయ’ ఫార్ములా!
ఏపీ స్థానిక ఎన్నికల ఆలస్యం వెనుక బాబు మాస్టర్ ప్లాన్ - కూటమిలో చిచ్చు పెట్టకుండా నియోజకవర్గ స్థాయి ‘సమన్వయ’ ఫార్ములా!
West Bengal TMC Political Crisis 2026: బెంగాల్ రాజకీయాల్లో మహారాష్ట్ర సీన్ - టీఎంసీలో ఓ షిండే రెడీ - మమతా బెనర్జీకి 50 మంది ఎమ్మెల్యేలు షాకిస్తారా?
బెంగాల్ రాజకీయాల్లో మహారాష్ట్ర సీన్ - టీఎంసీలో ఓ షిండే రెడీ - మమతా బెనర్జీకి 50 మంది ఎమ్మెల్యేలు షాకిస్తారా?
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
Peddi Premiere Collections: రామ్ చరణ్ 'పెద్ది' ప్రీమియర్స్ కలెక్షన్స్... ఇండియాలో ఓజీ, ధురంధర్ 2 తర్వాత
రామ్ చరణ్ 'పెద్ది' ప్రీమియర్స్ కలెక్షన్స్... ఇండియాలో ఓజీ, ధురంధర్ 2 తర్వాత
Trump Iran War Powers: ట్రంప్‌కు బిగ్‌ షాక్‌! ఇరాన్‌పై యుద్ధ అధికారులకు బ్రేక్‌! అమెరికా అధ్యక్షుడిపై సొంతపార్టీలోనే తిరుగుబాటు! 
ట్రంప్‌కు బిగ్‌ షాక్‌! ఇరాన్‌పై యుద్ధ అధికారులకు బ్రేక్‌! అమెరికా అధ్యక్షుడిపై సొంతపార్టీలోనే తిరుగుబాటు! 
DK Shivakumar First Cabinet Meeting:డీకే శివకుమార్ మార్క్ పాలన! తొలి కేబినెట్ సమావేశంలోనే సంచలన నిర్ణయాలు!
డీకే శివకుమార్ మార్క్ పాలన! తొలి కేబినెట్ సమావేశంలోనే సంచలన నిర్ణయాలు!
Embed widget