By: ABP Desam | Updated at : 08 Jan 2023 04:15 PM (IST)
సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
- సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.
- ముగ్గురు కార్మికులు మృతి, మరి కొందరికి గాయాలు.
- జిన్నారం మండలం గడ్డిపోత ప్రాంతాలలో ఈ ఘటన
- మృతులు అసిస్టెంట్ మేనేజర్ కోటేశ్వరరావు, సంతోష్, రంజిత్
Sangareddy Fire Accident: సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మైలాన్ పరిశ్రమలో ప్రమాదం జరగగా, ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు పరిశ్రమ యాజమాన్యం తెలిపింది. జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని మైలాన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. వేర్‌హౌస్ బ్లాక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ముగ్గురు మృతి చెందారు. మరికొందరికి కాలిన గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. అగ్ని ప్రమాదంలో మైలాన్ పరిశ్రమ అసిస్టెంట్ మేనేజర్ లోకేశ్వర్‌రావు (38), కార్మికులు సంతోష్ మెహతా (40), బిహార్ వాసి రంజిత్ కుమార్ (27) తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర కాలిన గాయాలైన వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ప్రాణాలు కోల్పోయారని పరిశ్రమకు చెందిన వారు తెలిపారు.
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ అగ్ని ప్రమాదంపై ఐడీఏ బొల్లారం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. చనిపోయిన అసిస్టెంట్ మేనేజర్ లోకేశ్వర్‌రావు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు. ఇద్దరు కార్మికులు బెంగాల్ కు చెందిన పరితోష్ మెహతా, బిహార్ కు చెందిన రంజిత్ కుమార్ చనిపోయారని గుర్తించారు.
Srisailam Bus Accident : శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెనుప్రమాదం
గంజాయి స్మగ్లర్లు, మత్తు పదార్థాలు వినియోగిస్తున్న వారికి ఏపీ పోలీసుల స్పెషల్ కౌన్సిలింగ్
Gujarat Junior Clerk Exam Cancel: హైదరాబాద్‌లో పేపర్ లీకేజీ కలకలం, జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ రద్దు చేస్తూ కీలక నిర్ణయం
Adilabad Cheddi Gang : ఆదిలాబాద్ జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ కలకలం, రాత్రిపూట కర్రలతో గ్రామాల్లో గస్తీ
Hyderabad News: హైదరాబాద్‌లో ‘అత్తిలి సత్తి’ - విక్రమార్కుడు సీన్ రిపీట్!
Australian Open 2023: 2023ను రికార్డుతో మొదలెట్టిన ‘జోకర్’ - పదో ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం!
Nellore Rural MLA: నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ! వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?
BRS Parliamentary Party Meeting: బీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ - ముఖ్యంగా ఆ విషయాలపైనే ఫోకస్ !