నానక్‌రామ్‌గూడ కేంద్రంగా తొమ్మిదేళ్లుగా గంజాయి సామ్రాజ్యాన్ని నడుపుతున్న 'గంజాయి క్వీన్' కాలాపతి నీతూ బాయ్‌ను తెలంగాణ ఈగిల్ ఫోర్స్, నార్కోటిక్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Ganja Queen Arrest: రోజుకు రూ. 24 లక్షల గంజాయి దందా.. 30కి పైగా కేసులు.. లేడీ డాన్ నీతూ బాయ్ అరెస్ట్
Ganja Queen Arrest: హైదరాబాద్‌లో గంజాయి దందా నడిపిస్తోన్న నీతూబాయ్‌ను ఈగిల్ ఫోర్స్, నార్కోటిక్స్ పోలీసులు అరెస్టు చేశారు. నీతూ బాయ్ మొత్తం కుటుంబంపై 30కి పైగా కేసులు ఉన్నాయి.

- హైదరాబాద్‌లో తొమ్మిదేళ్లుగా గంజాయి దందా నడిపిన నీతూబాయి అరెస్ట్.
- కుటుంబంతో కలిసి రోజుకు రూ.24 లక్షల విలువైన గంజాయి అమ్మకాలు.
- 30కి పైగా కేసులున్నా బెయిల్‌పై వచ్చి మళ్లీ దందా కొనసాగించింది.
- స్థావరాలు మార్చినా, మొబైల్ వాడకున్నా నిఘా సమాచారంతో పోలీసులు అరెస్ట్.
Ganja Queen Arrest: హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో గంజాయి మాఫియాపై గురిపెట్టారు తెలంగాణ ఈగిల్ ఫోర్స్, నార్కోటిక్స్ పోలీసులు. తొమ్మిదేళ్లుగా నానక్‌రామ్‌గూడ కేంద్రంగా మత్తు సామ్రాజ్యాన్ని నడుపుతున్న గంజాయి క్వీన్ కాలాపతి నీతూ బాయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరెన్సీ కౌంటింగ్ మెషిన్లు, డిజిటల్ వేయింగ్ మెషిన్లను పెట్టుకుని రోజుకు ఏకంగా రూ.24 లక్షల విలువైన గంజాయి విక్రయాలు సాగించే ఈమె వ్యాపారం చూసి పోలీసులే షాకయ్యారు.
కుటుంబం మొత్తం గంజాయి దందా
నీతూ బాయ్ 2017 నుంచి కుటుంబ సమేతంగా గంజాయి అక్రమ రవాణా , విక్రయాల నెట్‌వర్క్‌ను నడుపుతోంది. గంజాయిని బల్క్‌గా కొనుగోలు చేసి చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి నానక్‌రామ్‌గూడ పరిసరాల్లోని ఐటీ ప్రొఫెషనల్స్, కాలేజీ స్టూడెంట్లకు విక్రయించేది. 2023లో స్కార్పియో వెహికల్‌లో 22 కేజీల గంజాయిని రవాణా చేస్తూ ఆమె కుమారుడు పోలీసులకు చిక్కాడు. గతంలో ఆమె కుటుంబంతో సంబంధం ఉన్న ఆపరేషన్లలో ఏకంగా రూ.67 లక్షల నగదు, 51.5 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
లేడీ డాన్ పై పదుల కేసుల
ఈ లేడీ డాన్, ఆమె కుటుంబంపై 30కి పైగా గంజాయి, ఎక్సైజ్ కేసులు నమోదు కాగా, ఆమె 13 కేసుల్లో దీర్ఘకాలంగా పరారీలో ఉంది. లంగర్ హౌస్‌లో రెండు G+3 భవనాలు, గచ్చిబౌలిలో G+2 భవనంతో పాటు పలు లగ్జరీ ఆస్తులను డ్రగ్ దందాతోనే సంపాదించింది. ఎన్నిసార్లు అరెస్టై జైలుకు వెళ్లినా బెయిల్‌తో బయటకు వచ్చి మళ్లీ అదే దందాను కొనసాగించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఆమె ఇంటికి గంజాయి కొనుగోలు చేసేందుకు వచ్చే దాదాపు 50 మంది కస్టమర్లను కూడా పోలీసులు ఇదివరకే పట్టుకుని కేసులు నమోదు చేశారు.
Also Read: భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
పోలీసులకు చిక్కకూడదనే ఎత్తులో నీతూ బాయ్ మొబైల్ ఫోన్లు వాడటమే మానేసి, తరచూ స్థావరాలను మారుస్తుంది. అయితే పక్కా ఇంటిలిజెన్స్ సమాచారంతో రంగంలోకి దిగిన ఈగిల్ ఫోర్స్ టీమ్, నవంబర్ 6న ఆమె మంగళ్‌హాట్ వైపు ఆటోరిక్షాలో ప్రయాణిస్తుండగా చుట్టుముట్టి అరెస్ట్ చేసింది.
Also Read: విశాఖ బీచ్‌లో విషాదం.. ముగ్గుర్ని రక్షించిన లైప్ గార్డ్స్, ఇద్దరు గల్లంతు
Frequently Asked Questions
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ఎవరు అరెస్ట్ అయ్యారు?
నీతూ బాయ్ గంజాయి వ్యాపారం ఏ స్థాయిలో ఉండేది?
ఆమె రోజుకు రూ.24 లక్షల విలువైన గంజాయి విక్రయాలు జరిపేది. కరెన్సీ కౌంటింగ్, డిజిటల్ వేయింగ్ మెషిన్లను ఉపయోగించి వ్యాపారం నిర్వహించేది.
నీతూ బాయ్ ప్రధానంగా ఎవరికి గంజాయి విక్రయించేది?
ఆమె గంజాయిని బల్క్‌గా కొనుగోలు చేసి, చిన్న ప్యాకెట్లుగా మార్చి నానక్‌రామ్‌గూడ పరిసరాల్లోని ఐటీ ప్రొఫెషనల్స్, కాలేజీ స్టూడెంట్లకు విక్రయించేది.
నీతూ బాయ్‌పై ఎన్ని కేసులు నమోదయ్యాయి?
ఈ లేడీ డాన్‌పై 30కి పైగా గంజాయి, ఎక్సైజ్ కేసులు నమోదయ్యాయి. ఆమె 13 కేసుల్లో దీర్ఘకాలంగా పరారీలో ఉంది.
ట్రెండింగ్ వార్తలు






















