అన్వేషించండి

Hyderabad News: ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో సాహితీ ఇన్ ఫ్రా మోసాలు - వెయ్యి కోట్లు దొచేయడంతో ఈడీ కన్ను

Hyderabad News: ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో దాదాపు వెయ్యి కోట్ల మోసాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కున్న సాహితీ ఇన్ ఫ్రా సంస్థలపై ఈడీ దృష్టి సారించింది.  

Hyderabad News: ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న సాహితీ ఇన్ ఫ్రా సంస్థలపై ఈడీ దృష్టి సారించింది. పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు జరిగందని భావిస్తున్న ఈడీ ఇది వరకే కేసు నమోదు చేసింది ఆ సంస్థ కొనుగోలు చేసినట్లు భావిస్తున్న స్థలాలకు సంబంధించి వివరాలు పంపాలంటూ సంబంధిత సబ్ రిజిస్ట్రార్ లకు లేఖలు రాసింది. వివరాలు అందిన తర్వాత ఆ ఆస్తులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో సాహితీ సంస్థలు భారీగా డబ్బులు వసూలు చేసినప్పటికీ వాటిలో చాలా ప్రాజెక్టులు మొదలు కూడా పెట్టలేదు. దాంతో డబ్బు కట్టిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. 

వీరి ఫిర్యాదుల ఆధారంగా సాహితీ ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ప్రీలాంచ్ ప్రాజెక్టుల పేరుతో 2500 మంది నుంచి 900 కోట్లు వసూలు చేసినట్టు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపై విచారణ జరరిపిన అధికారులు మోసాలు నిజమని తేల్చారు. అందుకే ఆయన్ని అరెస్టు చేశారు. 2019లో సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో సాహితీ శరవణి ఎలైట్‌ పేరుతో ప్రాజెక్టు ప్రారంభించారు. 23 ఎకరాల్లో 38 అంతస్తులతో పది అపార్టుమెంట్లు నిర్మిస్తున్నామని ప్రకటనల్లో తెలిపారు. డబుల్, ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ల ఫ్లాట్లు ఉంటాయని నమ్మబలికారు. మంచి ఎమినిటీస్‌తో తక్కువ ధరకే ఇస్తామని అందర్నీ ఆకర్షించారు. ఈ ప్రకటనలకు ఆకర్షితులైన 1700 మంది పెట్టుబడి పెట్టారు. వాళ్లంతా 539 కోట్ల రూపాయలు సాహితీ ఇన్‌ఫ్రాకు అందజేశారు. 

నెలలు కాదు సంవత్సరాలు గడుస్తున్నా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో కస్టమర్స్‌ సాహితీ శరవణి ఎలైట్‌పై ఆరా తీశారు. అసలు ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని ఆలస్యంగా తెలిసింది. అంతే వాళ్లంతా మోసపోతున్నామని గ్రహించి బుకింగ్‌లు రద్దు చేసుకోవడం స్టార్ట్ చేశారు. డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. వాళ్లను శాంతిపజేయడానికి వడ్డీ పేరుతో మరో మోసానికి తెరశారు బూదాటి లక్ష్మీనారాయణ. ఏడాదికి 15 నుంచి 18 శాతం వడ్డీ ఇస్తానంటూ నమ్మబలికారు. అందరికీ నమ్మకం కలిగించేందుకు కొందరికి చెక్స్‌ కూడా ఇచ్చారు. వడ్డీ వస్తుంది కదా అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ చెక్స్‌ను బ్యాంకులో వేస్తే బౌన్స్ అయ్యాయి. దీంతో పూర్తి తామంతా మోసపోయామని గ్రహించి లబోదిబోమని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. 

కేసు రిజిస్టర్ చేసుకొని విచారించిన పోలీసులుకు విస్తుపోయే వాస్తవాలు తెలిసాయి. ఒక్క అమీన్‌పూర్‌లోనే కాదు మరిన్ని ప్రాంతాల్లో మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రగతినగర్‌, బొంగుళూరు, కాకతీయ హిల్స్‌, అయ్యప్ప సొసైటీ, కొంపల్లి, శామీర్‌పేట్‌లో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడ్డారు. ఇలా 2,500 మంది నుంచి 900 కోట్లు వసూలు చేశారు. హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ పేరుతో మోసాలకు పాల్పడ్డ లక్ష్మీనారాయణ... ఆ సొమ్మునంతా అమరావతిలో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. ఇలా వచ్చిన డబ్బులను వివిధ ప్రాజెక్టులకు మళ్లించి... అవసరాలకు వాడుకొని బాధితులను నిలువునా ముంచారు. ఆయన ప్రారంభించిన ప్రాజెక్టుల్లో వేటికి కూడా అనుమతులు లేవని పోలీసులు గుర్తించారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం-   చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
Elections Commission News: ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
SS Rajamouli: ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
Sriram: అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్
అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

MS Dhoni IPL 2024 Retirement | మహేంద్ర సింగ్ ధోనికి ఇదే లాస్ట్ ఐపీఎల్ సీజనా.? | ABP DesamSRH Captain Pat Cummins IPL 2024 | కమిన్స్ రాకతోనైనా ఆరెంజ్ ఆర్మీ ఆకట్టుకుంటుందా.? | ABP DesamPinkvilla Screen And Style Awards: ముంబయిలో ఘనంగా జరిగిన అవార్డుల వేడుక, విభిన్న డ్రెస్సుల్లో తారలుRajamouli Mahesh Babu Movie: జపాన్ లో RRR స్క్రీనింగ్స్ సందర్భంగా మహేష్ మూవీ అప్డేట్ ఇచ్చిన జక్కన్న

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం-   చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
Elections Commission News: ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
SS Rajamouli: ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
Sriram: అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్
అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్
Home Loan: క్రెడిట్‌ స్కోర్‌ తక్కువున్నా గృహ రుణం, ఈ ఉపాయాలు తెలిస్తే చాలు!
క్రెడిట్‌ స్కోర్‌ తక్కువున్నా గృహ రుణం, ఈ ఉపాయాలు తెలిస్తే చాలు!
South Costal Politics: వైసీపీ కోటలో టీడీపీ పాగా వేసేనా..? రెడ్డిరాజ్యంలో పట్టు నిలుపుకునేదెవరో..?
వైసీపీ కోటలో టీడీపీ పాగా వేసేనా..? రెడ్డిరాజ్యంలో పట్టు నిలుపుకునేదెవరో..?
Manchu Lakshmi: మంచు లక్ష్మి కాళ్లు మొక్కిన అభిమాని - ‘ఆదిపర్వం’ ట్రైలర్ లాంచ్‌లో అనూహ్య ఘటన
మంచు లక్ష్మి కాళ్లు మొక్కిన అభిమాని - ‘ఆదిపర్వం’ ట్రైలర్ లాంచ్‌లో అనూహ్య ఘటన
Rajamouli On SSMB29: మహేష్ బాబు సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
మహేష్ బాబు సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
Embed widget