News
News
X

Amberpet Dogs Attack : వీధి కుక్కల దాడి ఘటనపై ఎట్టకేలకు కేసు నమోదు, నిందితులు ఎవరంటే?

Amberpet Dogs Attack : హైదరాబాద్ అంబర్ పేట్ కుక్కల దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు రోజుల తర్వాత లీగల్ ఓపినియన్ తీసుకుని బాలుడి మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

FOLLOW US: 
Share:

Amberpet Dogs Attack : తెలంగాణలో సంచలనం అయిన అంబర్ పేట్ కుక్కల దాడి ఘటనపై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. లీగల్ ఒపీనియన్ తీసుకుని మూడు రోజుల తర్వాత కేసు నమోదు చేశారు. 174 సీఆర్పీఈసీ ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే కేసులో నిందితులు ఎవరినీ చూపెట్టలేదు. బాలుడిని ఎవరు చంపారో ఎఫ్ఐఆర్ లో పోలీసులు నమోదు చేయలేదు.  

వీధికుక్కల దాడిలో చిన్నారి మృతి

హైదరాబాద్‌లో ఇటీవల హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పిల్లలకు సెలవు కావడంతో.. పిల్లలను తనతో పాటు పని చేసే చోటుకి తీసుకెళ్లాడు. తండ్రి పని చేసుకుంటుండగా పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలోనే అక్క కాస్త దూరంగా ఉండడంతో నాలుగేళ్ల కుమారుడు అటువైపు వెళ్లాలనుకున్నాడు. ఇదే సమయంలో అక్కడకు వచ్చిన వీధి కుక్కలు బాలుడిపైకి పరిగెత్తుకొచ్చాయి. విషయం గుర్తించిన బాలుడి వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ వదలకుండా అతనిపై దాడి చేశాయి. మూడు కుక్కలు బాలుడి శరీర భాగాలను నోట కరుచుకొని ఒక్కోవైపుగా లాగడం మొదలు పెట్టాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 

అసలేం జరిగిందంటే..?

నిజామాబాద్ జిల్లా ఇందల్ వాయి మండల కేంద్రానికి చెందిన గంగాధర్ నాలుగేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వచ్చాడు. చే నంబరు చౌరస్తాలోని ఓ కారు సర్వీస్ సెంటర్ లో వాచ్ మెన్ గా పని చేస్తూ భార్యాపిల్లలను పోషిస్తున్నాడు. భార్య జనప్రియ, ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ప్రదీప్ తో కలిసి బాగ్ అంబర్ పేట ఎరుకల బస్తీలో నివాసం ఉంటున్నాడు. ఆదివారం(ఫిబ్రవరి 19) రోజు సెలవు కావడంతో పిల్లలిద్దరినీ వెంట బెట్టుకొని తాను పని చేస్తున్న సర్వీస్ సెంటర్ లోపలికి తీసుకెళ్లాడు. కుమారుడు ఆడుకుంటూ ఉండగా.. మరో వాచ్ మెన్ తో కలిసి గంగాధర్ వేరే ప్రాంతానికి వెళ్లాడు. కాసేపు అక్కడే ఆడుకున్న ప్రదీప్.. ఆ తర్వాత తన అక్క కోసం క్యాబిన్ వైపు నడుచుకుంటూ వెళ్లాడు. ఈ క్రమంలోనే వీధి కుక్కలు వెంటపడ్డాయి. భయపడిన బాలుడు వాటి నుంచి తప్పించుకునేందుకు అటూ ఇటూ పరుగులు తీశాడు. ప్రాణాలను కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ కాలయముల్లా ఆ వీధి కుక్కలు మాత్రం బాలుడిపైకి వస్తూనే ఉన్నాయి.  

హైకోర్టు ఆగ్రహం 

ఇటీవల హైదరాబాద్ లోని అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇదివరకే ఈ ఘటనపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు రావడంతో పరిస్థితిని గ్రహించిన హైకోర్టు కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ పై తండ్రి పనిచేసే చోట వీధి కుక్కలు దారుణంగా దాడి చేయడం అమానుష ఘటన అని హైకోర్టు వ్యాఖ్యానించింది. కుక్కల దాడిలో పసివాడు మృతిచెందడం అత్యంత బాధాకరమని చెప్పింది. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే జీహెచ్ఎంసీ ఏం చేస్తుందని, మీ నిర్లక్ష్యంతోనే బాలుడు చనిపోయాడంటూ హైకోర్టు మండిపడింది. తదుపరి విచారణను హైకోర్టు మార్చి16కి వాయిదా వేసింది. నగరంలో గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని, వీధి కుక్కలు దాడులు పెరిగిపోతుంటే మీరు ఏం చర్యలు తీసుకున్నారని జీహెచ్ఎంసీని హైకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి ఘటనలు మరోసారి రిపీట్ కాకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారని జీహెచ్ఎంసీని హైకోర్టు ప్రశ్నించింది. బాలుడు ప్రదీప్ మృతికి నష్ట పరిహారం చెల్లించడాన్ని పరిగణలోకి తీసుకుంటామని హైకోర్టు తెలిపింది. ఈ ఘటనపై తెలంగాణ చీఫ్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ కలెక్టర్, తెలంగాణ లీగల్ సెల్ అథారిటీ, అంబర్ పేట్ మున్సిపల్ అధికారికి రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి16కి వాయిదా వేసింది. 

Published at : 24 Feb 2023 08:10 PM (IST) Tags: Hyderabad case Amberpet Child TS Police Dogs Attack

సంబంధిత కథనాలు

Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు

Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు

Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్

Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు - తీహార్ జైలుకు రామచంద్ర పిళ్లై తరలింపు! 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు - తీహార్ జైలుకు రామచంద్ర పిళ్లై తరలింపు! 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ

Students Bike Stunts : ఇన్ స్టా రీల్స్ కోసం నడిరోడ్డుపై బైక్ స్టంట్స్, అరెస్టు చేసిన పోలీసులు!

Students Bike Stunts : ఇన్ స్టా రీల్స్ కోసం నడిరోడ్డుపై బైక్ స్టంట్స్, అరెస్టు చేసిన పోలీసులు!

CI Dies Of Heart Attack: ఏపీలో మరో విషాదం - విధి నిర్వహణలో గుండెపోటుతో సీఐ మృతి

CI Dies Of Heart Attack: ఏపీలో మరో విషాదం - విధి నిర్వహణలో గుండెపోటుతో సీఐ మృతి

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌