మృతుడి సోదరుడు ప్రవీణ్‌రెడ్డి ఫిర్యాదుతో ఎస్ఆర్ నగర్ పోలీసులు లెక్చరర్ భాస్కర్‌రెడ్డి, ప్రిన్సిపల్ చంద్రమోహన్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
AI Morphing Student Died: ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
AI Morphing Student Died:లెక్చరర్ ఫొటోను ఏఐతో మార్ఫింగ్ చేసిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ ప్రిన్సిపల్, లెక్చరర్ వేధింపులతోనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు.

- మనస్తాపంతో ఆత్మహత్య, లెక్చరర్, ప్రిన్సిపాల్‌పై కేసు.
AI Morphing Student Died: ఏఐ ఉపయోగించి సరదాగా లెక్చరర్ ఫొటోను మార్ఫింగ్ చేసిన ఓ హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థి ప్రాణాలు తీసుకున్న విషాదకర ఘటన హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పరిధిలో చోటుచేసుకుంది.
ఎస్ఆర్ నగర్ ఇన్‌స్పెక్టర్ దొంతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన కట్టా భానుప్రసాద్‌రెడ్డి (20) హైదరాబాద్ బల్కంపేటలోని చెన్నైస్ అమ్రిత హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీలో సెకండియర్ చదువుతున్నాడు. చదువుతో పాటు ఖాళీ సమయాల్లో జెప్టోలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. మిత్రులతో కలిసి ఎస్ఆర్ నగర్‌లోని ఓ గదిలో అద్దెకు ఉంటున్నాడు.
ఏఐ మార్ఫింగ్ వల్ల
వారం క్రితం భానుప్రసాద్‌రెడ్డి తమ కాలేజీ లెక్చరర్ భాస్కర్ ఫొటోను ఏఐ సహాయంతో మార్ఫింగ్ చేసి తన స్నేహితుడైన శేఖర్‌కు పంపాడు. ఆ తర్వాత ఆ ఫొటో శేఖర్ లెక్చరర్‌కు చూపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తన ఫొటోను మార్ఫింగ్ చేయడంపై సీరియస్ అయిన లెక్చరర్ భాస్కర్.. కాలేజీ ప్రిన్సిపల్ చంద్రమోహన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రిన్సిపల్ భానుప్రసాద్‌రెడ్డిని పిలిచి మందలించడంతో పాటు అతని సెల్‌ఫోన్‌ను తీసుకున్నారు. తల్లిదండ్రులను కాలేజీ పిలిపించి మాట్లాడితేనే ఫోన్ ఇస్తామని తేల్చిచెప్పారు. తాను జెప్టోలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నానని, ఫోన్ లేకపోతే ఇబ్బందులు వస్తాయని విద్యార్థి ఎంత వేడుకున్నా ప్రిన్సిపల్ కనికరించలేదు. ఈ విషయాన్ని భానుప్రసాద్‌రెడ్డి తన సోదరుడు ప్రవీణ్‌రెడ్డికి తెలిపాడు.
Also Read: విశాఖ బీచ్‌లో విషాదం.. ముగ్గుర్ని రక్షించిన లైప్ గార్డ్స్, ఇద్దరు గల్లంతు
ప్రిన్సిపల్ మొండిపట్టుతో
గురువారం కాలేజీకి వచ్చిన ప్రవీణ్‌రెడ్డి లెక్చరర్, ప్రిన్సిపల్‌తో మాట్లాడి.. తన సోదరుడు చేసిన తప్పునకు క్షమాపణ కోరాడు. ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగవని హామీ ఇచ్చినా ప్రిన్సిపల్ మొండిపట్టు వీడలేదు. సెల్‌ఫోన్‌ను మాత్రం తిరిగి ఇవ్వలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన భానుప్రసాద్ రెడ్డి శుక్రవారం రాత్రి తాను ఉంటున్న గదికి వెళ్లి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి 9 గంటల సమయంలో కిటికీ నుంచి గమనించిన స్నేహితుడు నూతన్.. పోలీసులకు సమాచారం అందించాడు.
మృతుడి సోదరుడు ప్రవీణ్‌రెడ్డి ఫిర్యాదుతో ఎస్ఆర్ నగర్ పోలీసులు లెక్చరర్, ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శనివారం ఉదయం విద్యార్థి సంఘాలు, తోటి విద్యార్థులు కాలేజీ ముందు పెద్దఎత్తున ఆందోళన నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
Also Read: మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
Frequently Asked Questions
ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
ట్రెండింగ్ వార్తలు






















