ఇలాంటి బెదిరింపులకు భయపడి డబ్బులు చెల్లించవద్దని, వెంటనే పోలీసులను లేదా సైబర్ క్రైమ్ విభాగాన్ని సంప్రదించాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు.
MLC Mirza Rahmat Extortion: మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
MLC Mirza Rahmat Extortion: తెలంగాణ ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్‌ను బెదిరించి రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.

- రూ.4.7 లక్షల నగదు స్వాధీనం; ప్రధాన నిందితుడి కోసం గాలింపు.
MLC Mirza Rahmat Extortion: సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోలు, అభ్యంతరకరమైన డీప్‌ఫేక్ వీడియోలను పెడతామంటూ తెలంగాణ ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్‌ను బెదిరించి భారీగా డబ్బులు వసూలు చేసేందుకు యత్నించిన ముఠాను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆరుగురు నిందితులను పట్టుకున్నారు.
రూ.5 కోట్లు డిమాండ్.. రూ.5 లక్షల వసూలు
పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఈ కుట్రకు తెరలేపారు. సుమారు 14 మందికి పైగా సభ్యులు ఉన్న ఈ గ్యాంగ్.. ఎమ్మెల్సీ రాజకీయ, సామాజిక ప్రతిష్ఠకు భంగం కలిగించడమే కాకుండా ఆయనకు ప్రాణహాని తలపెడతామని బెదిరించి ముందుగా రూ.5 కోట్లు డిమాండ్ చేసింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ నుంచి రూ.5 లక్షలు వసూలు చేశారు. మరో రూ.5 లక్షలు ఇవ్వాలంటూ ఒత్తిడి చేశారు.
అప్రమత్తమైన పోలీసులు
ఈ నెల 5న ఫాతిమా బేగం (అలియాస్ రీమా) అనే మహిళ మరో ఐదుగురితో కలిసి ఇబ్రహీంబాగ్‌లోని ఎమ్మెల్సీ ఆఫీసుకు వెళ్లి నగదు తీసుకున్నారు. ఈ సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ప్రత్యేక టీమ్‌గా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. నగదును తీసుకెళ్తుండగా.. ఐదుగురిని రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిచ్చిన సమాచారంతో మహ్మద్ మొహ్సిన్ ఖాన్ అనే మరో నిందితుడిని కూడా పట్టుకున్నారు.
నిందితుల వద్ద నుంచి రూ.4.70 లక్షల నగదు, 2 ఆటోలు, 6 సెల్ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Also Read: భార్యపై కోపంతో ఏడుగురి హత్య.. పార్టీకి పిలిచి మొత్తం అత్తింటి ఫ్యామిలీని అంతం!
పోలీసుల హెచ్చరిక
సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోలు, డీప్‌ఫేక్ వీడియోలు పోస్టు చేస్తామని బెదిరింపులకు పాల్పడే వారికి భయపడి డబ్బులు చెల్లించవద్దని, ఇలాంటి ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులను లేదా సైబర్ క్రైమ్ విభాగాన్ని సంప్రదించాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు.
Also Read: మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
Frequently Asked Questions
ఇలాంటి బెదిరింపులు ఎదురైతే పోలీసులు ఏమి సూచిస్తున్నారు?
ట్రెండింగ్ వార్తలు






















