అన్వేషించండి

Keesara Toll Plaza Road Accident: కీసర టోల్ ప్లాజా వద్ద కారుపై ట్యాంకర్ బోల్తా.. నుజ్జునుజ్జయిన కారు, ఎన్టీఆర్ జిల్లాలో విషాదం

Road Accident | ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్‌ప్లాజా దగ్గర అదుపుతప్పి వేగంగా వచ్చిన ఓ ట్యాంకర్ ఆగిఉన్న కారుపై పడింది. కారు మొత్తం నుజ్జునుజ్జు కావడంతో అందులో ఎంతమంది ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది.

కంచికచర్ల: ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ పరిధిలో పెను విషాదం చోటుచేసుకుంది. కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద శనివారం (ఏప్రిల్ 11న) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఒక లారీ ట్యాంకర్ బ్రేకులు ఒక్కసారిగా ఫెయిల్ కావడంతో డ్రైవర్  కంట్రోల్ కోల్పోయాడు. దీంతో ఆ ట్యాంకర్ అదుపు తప్పి పక్కనే ఆగిఉన్న BMW కారుపై ఒక్కసారిగా బోల్తా పడింది. ఆ ట్యాంకర్‌ రెడీమిక్స్ కాంక్రీట్ లోడ్‌తో వెళ్తోంది.

Keesara Toll Plaza Road Accident: కీసర టోల్ ప్లాజా వద్ద కారుపై ట్యాంకర్ బోల్తా.. నుజ్జునుజ్జయిన కారు, ఎన్టీఆర్ జిల్లాలో విషాదం

ఈ ప్రమాద దాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. రెడీ మిక్స్ కాంక్రీట్ లోడ్ ఉన్న ట్యాంకర్ కింద కారు నలిగిపోవడంతో, అందులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? వారి పరిస్థితి ఏమిటి? అనే విషయాలపై ప్రస్తుతం స్పష్టత లేదు. కారు లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, టోల్ ప్లాజా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ల సహాయంతో లారీని పక్కకు తొలగించి, సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

విజయవాడ - హైదరాబాద్ హైవేపై ఈ ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్యాంకర్ అదుపుతప్పి కారు (TS 09Ft 6662) మీద పడటంతో పూర్తిగా డ్యామేజ్ అయింది. ఇది హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్ అయినట్లు చూపిస్తోంది. BMW X1 మోడల్ ఐదేళ్ల కిందట రిజిస్టర్ అయింది. ప్రస్తుతం ట్యాంకర్ కిందపడిపోయిన కారును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైంది 16చక్రాల భారీ ట్యాంకర్ కావడంతో పెద్ద క్రేన్ల సాయంతో పక్కకి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన చోట భయానక వాతావరణం నెలకొంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget