అన్వేషించండి

Guntur Stampede Incident: గుంటూరు తొక్కిసలాట ఘటనలో ఉయ్యూరు శ్రీనివాస రావు అరెస్ట్!

Guntur Stampede Incident: గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఉయ్యూరు శ్రీనివాస రావును పోలీసులు అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకునే ముందు ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. 

Guntur Stampede Incident: గుంటూరు తొక్కిసలాట ఘటనలో ఉయ్యూరు శ్రీనివాస రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఆయనను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ప్రవాస భారతీయుడు ఉయ్యూరు శ్రీనివాస్ నేతృత్వంలోని ఉయ్యూరు ఫౌండేషన్ గుంటూరు సదాశివ నగర్ లోని వికాస్ హాస్టల్ మైదానంలో ఆదివారం చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఎన్టీఆర్‌ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు చనిపోయారు. మరికొందరు ఆసుపత్రిలో చేరారు. ఇంకొదరికి చిన్న చిన్న గాయాలు అయ్యాయి. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది.  

కార్యక్రమానికి సరిపడా సెక్యూరిటీ ఇచ్చినప్పటికీ.. ప్రమాదం

గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నల్లపాడు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు కాగా... ఇందులో ప్రధాన నిందితుడిగా ఉయ్యూరు శ్రీనివాస్‌ను పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయనను అరెస్ట్ చేశారు. క్యూలో జనాలను ఎక్కువ సమయం నిలబెట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాద స్థలాన్ని జిల్లా కలెక్టర్‌, ఎస్పీ పరిశీలించారు. కార్యక్రమానికి సరిపడా సెక్యూరిటీ ఇచ్చామని వివరిణ ఇచ్చారు. ఫస్ట్‌ కౌంటర్ వద్దే ప్రమాదం జరిగిందని... తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముందుగానే హెచ్చరించినట్టు పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా తానా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఉన్న శ్రీనివాస్‌ పలు కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికే ఆయన గుంటూరు సహా మూడు ప్రాంతాల్లో అన్న క్యాంటీన్‌లు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు జనతా వస్త్రాలు, సంక్రాంతి కానుకలు పంపిణీకి యత్నించారు. మొదటగా గుంటూరు వెస్ట్‌లో చీరలు, సరకుల పంపిణీ చేపట్టారు.

ముఖ్య అతిథిగా వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు

ఉయ్యూరు ఫౌండేషన్ తరఫున చేపట్టిన ఈ పంపిణీ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబును చీఫ్‌ గెస్ట్‌గా పిలిచారు. స్థానిక నాయకులను కూడా ఆయన ఆహ్వానించలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు ప్రసంగించి వెళ్లిన కాసేపటికే చీరల పంపిణీలో అపశ్రుతి జరిగిపోయింది. అనుకున్నదాని కంటే ఎక్కువ సంఖ్యలో మహిళలు రావడంతో నిర్వాహకులు అదుపు చేయలేకపోయారు. బారికేడ్ల పై నుంచి జనం తోసుకొని రావడంతో ఘోరం జరిగిపోయింది. 

మృతుల కుటుంబాలకు 31 లక్షల చొప్పున నష్ట పరిహారం

ఘటన జరిగిన వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారికి పరిహారం కూడా ప్రభుత్వంతోపాటు తెలుగు దేశం పార్టీ, ఆ పార్టీ నాయకులు, చీరల పంపిణీ చేసిన ఉయ్యూరు శ్రీనివాస్‌ కూడా ప్రకటించారు. మృతి చెందిన వారికి కుటుంబానికి ఒక్కొక్కరికి 31 లక్షలు అందనుంది. ఇందులో తెలుగుదేశం ఐదు లక్షలు ఇవ్వనుంది. ప్రభుత్వం తరఫున 2 లక్షలు అందించనున్నారు. ఉయ్యూరు ఫౌండేషన్ తరఫున 20 లక్షలు సాయం ప్రకటించారు. ఇలా మొత్తంగా 31 లక్షల సాయం మృతుల కుటుంబాలకు అందనుంది. గాయపడిన వారికి యాభై వేలు ఇవ్వబోతున్నారు. మొన్న కందుకూరు, నిన్న గుంటూరులో తొక్కిసలాట జరగడం టీడీపీకి ఇబ్బందిగా మారింది. అన్ని పార్టీల నుంచి విమర్శల దాడి తీవ్రమైంది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget