Software Engineer Suicide: సాఫ్ట్‌వేర్ విషాదాలు- ఆన్‌లైన్ మోసానికి ఉద్యోగిని సూసైడ్, వ్యాయామం చేస్తూ మరొకరు మృతి
Cyber Crime Takes live of Female Software Engineer: ఏపీలో ఆన్‌లైన్ మోసాలకు ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకోగా, వ్యాయామం చేస్తుండగా గుండెపోటు రావడంతో యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి చెందాడు.
Software Engineer committed suicide : ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అదృశ్యం కేసు విషాదంగా మారింది. అయితే ఆమె డిప్రెషన్ కారణంగా కాదు, ఆన్ లైన్ మోసానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో జరిగింది. హైదరాబాద్‌లో ఉద్యోగం వచ్చిందని, జాబ్ లో జాయిన్ అవుతానని చెప్పి.. గుంటూరు జిల్లా నుంచి బయలుదేరిన యువతి మార్గం మధ్యలోనే ఆత్మహత్య చేసుకున్నారు.
అసలేం జరిగిందంటే..
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవ్వులూరుకి చెందిన జాస్తి శ్వేత (22) సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా జాబ్ చేస్తోంది. మూడు నెలల కిందటి నుంచి వర్క్ ఫర్ హోమ్ చేస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఆమె ఉద్యోగంలో చేరాల్సి ఉంది. హైదరాబాద్‌లో ఉద్యోగంలో జాయిన్ అవుతానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. జగ్గయ్యపేట రూరల్ మండల పరిధిలోని చిల్లకల్లులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శ్వేత మిస్ అయింది. జాబ్‌లో చేరేందుకు హైదరాబాద్ వెళ్తున్నానని ఇంట్లో చెప్పిన శ్వేత శనివారం సాయంత్ర స్కూటీపై బయటకు వెళ్లింది. తాను చిల్లకల్లు చెరువుతో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తల్లి ఫోన్‌కు మెస్సేజ్ చేసింది.
కుటుంబసభ్యులు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ అని రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. శనివారం రాత్రి పోలీసులు రెస్క్యూ టీమ్‌తో కలిసి చిల్లకల్లు చెరువులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శ్వేత డెడ్ బాడీ కోసం గాలించారు. రాత్రి కావడంతో అధికారులు అర్ధరాత్రి ఇంటికి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం గాలించగా శ్వేత డెడ్ బాడీ దొరికింది. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని జగ్గయ్యపేట ఆసుపత్రికి తరలించారు.
కొన్ని రోజుల కిందట ఆమెకు ఆన్ లైన్‌లో పరిచయమైన వ్యక్తి రూ.1.2 లక్షలు చెల్లిస్తే దాదాపు రూ.7 లక్షలు వస్తాయని నమ్మించాడు. తన వద్ద డబ్బు లేదని చెప్పగా.. రూ.50 ఇచ్చి, మిగతా నగదు కలిపి తాను చెప్పిన అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలని అపరిచిత వ్యక్తి సూచించాడు. ఇన్‌స్టాల్‌మెంట్స్ రూపంలో నగదు చెల్లించింది. ఆ తరువాత నుంచి ఆన్‌లైన్ ఫ్రెండ్ శ్వేత ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయడం లేదు. ఏం చేయాలో తెలియక హైదరాబాద్‌లో ఉద్యోగం అంటూ ఇంట్లో చెప్పి.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శనివారం రాత్రి తల్లికి మెస్సేజ్ చేసి సూసైడ్ చేసుకుందని పోలీసులు తెలిపారు.
వ్యాయామం చేస్తుండగా గుండెపోటు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
చిత్తూరు జిల్లా పుంగనూరులో విషాదం చోటుచేసుకుంది. వ్యాయామం చేస్తుండగా గుండెపోటు రావడంతో యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. పుంగనూరుకు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి సుధాకర్‌రెడ్డికి ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు తేజ విష్ణువర్ధన్‌రెడ్డి (27) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడు. అతడికి రెండు నెలల కిందట వివాహమైంది. ఆయన భార్య లావణ్య కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఆషాఢ మాసం కావడంతో లావణ్య తన పుట్టింటికి వెళ్లింది.
ఎప్పటిలాగే వ్యాయామం.. కానీ అంతులేని విషాదం
రోజూ వార్మప్ చేసే అలవాటున్న విష్ణువర్ధన్ రెడ్డి ఆదివారం ఉదయం ఎక్సర్‌సైజ్ చేస్తూ కుప్పకూలిపోయాడు. సైక్లింగ్ చేస్తుండగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయిన విష్ణువర్ధన్‌ను గుర్తించిన తండ్రి వెంటనే గ్రామంలోని డాక్టర్‌కు సమాచారం అందించారు. ఇంటికి వచ్చి పరిశీలించిన డాక్టర్ అప్పటికే గుండెపోటుతో విష్ణువర్ధన్ రెడ్డి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆషాడ మాసం తర్వాత కొత్త జంట తిరుమలకు వెళ్లి, అనంతరం హనీమూన్ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ అంతలోనే ఊహించని విషాదం చోటుచేసుకుంది.
Also Read: Viral Video: మేళతాళాల మధ్య మొసలిని పెళ్లి చేసుకున్న మేయర్, అక్కడ అదే ఆచారమట