By: Ram Manohar | Updated at : 04 Jul 2022 09:56 AM (IST)
మెక్సికోలోని ఓ మేయర్ మొసలిని పెళ్లి చేసుకున్నాడు.
మొసలితో పెళ్లి..ఇదో ఆచారమట..
ప్రపంచవ్యాప్తంగా రోజూ ఏదో ఓ మూల రకరకాల వింత సంఘటనలు జరుగుతుంటాయి. వాటిలో కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తుంటాయి.ఇప్పుడు అలాంటి సంఘటనే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. మెక్సికోలోని ఒక్సాకా మేయర్ అలిగేటర్ (పెద్ద మొసలి)ని పెళ్లి చేసుకున్నాడు. ఎంతో ప్రేమగా దానికి ముద్దు కూడా పెట్టాడు. మరి ఇంత అరుదైన సీన్‌ని చూస్తూ అలా ఊరుకుంటారా. చుట్టు పక్కన వాళ్లంతా ఈ తంతుని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేశారు. ఇక అప్పటి నుంచి ఈ మెక్సికో మేయర్ గురించే ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. మొసలిని పెళ్లి చేసుకోవటమా..? ఇదేం విడ్డూరం అని ఆశ్చర్యపోతున్నారంతా. మెక్సికోలోని సాన్ పెడ్రో హ్యుమెలులా ప్రాంత మేయర్ విక్టర్ హుగో ఈ పని చేసినప్పటి నుంచి ఎందుకిలా పెళ్లి చేసుకున్నాడబ్బా అని అందరూ ఆరా తీయటం మొదలు పెట్టారు. ఇంతకీ తేలిందేంటంటే ఇది అక్కడి ఆచారమట.
ప్రకృతిని, మనుషుల్ని కలిపే వేడుక ఇది..
శతాబ్దాలుగా ఇక్కడి ప్రజలు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారట. ఈ ప్రాంతంలో రకరకాల కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ప్రజలు నివసిస్తుంటారు.వీళ్లు ప్రకృతిని ఆరాధించటంలో భాగంగా ఇలాంటి పెళ్లిళ్లు చేసుకుంటారట. సరైన విధంగా వర్షాలు పడాలని, అందరకీ ఆహారం దొరకాలని, నదుల్లో చేపలు పుష్కలంగా దొరకాలని కోరుకుంటారట. ఈ కోరికలు తీరాలంటే ఇలాంటి పెళ్లిళ్లు చేసుకోక తప్పదని అంటున్నారు స్థానికులు. అందుకే ఈ ఏడేళ్ల మొసలికి వైట్‌డ్రస్ వేసి పెళ్లి కూతురులా తయారు చేశారు. మూతిని మాత్రం కట్టేశారు. ఈ మొసలిని "మహారాణి"గా భావిస్తారు. పెళ్లి కూతురు వేషంలో ఉన్న ఈ మొసలి భూతల్లికి మరో రూపమని, పెళ్లి చేసుకోవటం ద్వారా, ప్రకృతిని, మనుషుల్ని ఏకం చేసినట్టవుతుందని విశ్వసిస్తారు. సాధారణ పెళ్లిళ్లలో ఎలాగైతే పెళ్లికూతుర్ని బ్యాండ్ బాజాలతో వేదికపైకి తీసుకొస్తారో, అలాగే ఈ మొసలికీ స్వాగతం పలికారు. ఒకరు ఈ మొసలిని చేతిలో పట్టుకుని వస్తుంటే చుట్టూ ఉన్న వాళ్లంతా ట్రంపెట్స్, డ్రమ్స్ వాయిస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట ప్రత్యక్షమైతే నెటిజన్లు ఊరుకుంటారా. లైక్స్, కామెంట్స్, షేర్స్‌తో ఫేమస్ చేసేశారు. "మొసలికి అప్పుడే పెళ్లి చేసుకునే వయసు వచ్చిందా" అని కొందరు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.
In an age-old ritual, a Mexican mayor married his alligator bride to secure abundance. Victor Hugo Sosa sealed the nuptials by kissing the alligator's snout https://t.co/jwKquOPg93 pic.twitter.com/Vmqh4GpEJu
— Reuters (@Reuters) July 1, 2022
And I thought I had seen everything born in NYC. Considering where this is happening I hope the alligator is of age to be married?
— Rob M (@RobM09782051) July 1, 2022
— Vera García Novelo (@VeraNovelo) July 1, 2022
— The Wanderer (@xxxxVASHxxxx) July 1, 2022
TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు
Mancherial News : ప్రేమించిన యువతి కోసం యువకుడి పోరాటం, లవర్ ఇంటి ముందు నిరసన
Delhi liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ వ్యాపారి పేరు - సీబీఐ ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు
Batukamma Sarees : సెప్టెంబర్ 17 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ, ఈసారి కోటికి పైగా!
రామాంతపూర్ ఘటనతో ఇంటర్‌బోర్డు అలర్ట్- కాలేజీలకు కీలక ఆదేశాలు
High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం
Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్
Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?