Pedakakani News : భార్యపై అనుమానం, కన్న బిడ్డలను కాలువలో పడేసిన కసాయి తండ్రి
Pedakakani News : కన్న తండ్రే కసాయి మారిపోయిన ఘటన పెదకాకానిలో చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో ఇద్దరు చిన్నారులను కాలువలో తోసేశాడు.
Pedakakani News : భార్య మీద అనుమానంతో సైకోలా వ్యవహరించాడో భర్త. కన్న బిడ్డలను కాలువలో తోసి చంపాడు. గుంటూరు జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. కుంచనపల్లి బాకింహంగ్ కెనాల్ లో చిన్నారుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. తండ్రి వెంకటేశ్వరరావు పిల్లలను చంపి కాలువలో పడేసినట్లు పోలీసుల నిర్థారించారు. మృతులు జోష్ణ(6) బాలిక, షణ్ముఖ వర్మ (4) బాలుడు గుర్తించారు. నిన్నటి నుంచి పిల్లలు కనిపించడంలేదని వెంకటేశ్వరరావు భార్య పెద్దకాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
తల్లి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి
పెద్దకాకాని పోలీస్ స్టేషన్ లో తన ఇద్దరు పిల్లలు కనిపించడంలేదని వివాహిత సోమవారం ఫిర్యాదు చేశారు. దీంతో పెదకాకానికి చెందిన జోష్ణ(6), షణ్ముఖ వర్మ(4) కోసం పోలీసుల గాలింపు చేపట్టారు. తాడేపల్లి పరిధి కుంచనపల్లి వద్ద డెల్టా కాల్వలో ఇద్దరు పిల్లలను తండ్రి వెంకటేశ్వరరావు పడేసినట్లు పోలీసులు తెలిపారు. వెంకటేశ్వరరావును పోలీసులు విచారించగా పిల్లలను పడేసిన ప్రదేశాన్ని చూపించాడు. ఆ ప్రదేశంలో పిల్లల మృతదేహాల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. భార్య పై అనుమానంతో పిల్లలను కాల్వలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. గజ ఈతగాళ్ల సహాయంతో బకింగ్ హోమ్ కెనాల్ లో ఇద్దరి చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు పెదకాకాని పోలీసులు.
కేసు నమోదు
భార్యపై అనుమానంతో కన్న పిల్లలనే ఓ తండ్రి కడతేర్చాడు. పోలీసుల కథనం ప్రకారం పెదకాకానికి చెందిన వెంకటేశ్వరరావు తన భార్యపై అనుమానం ఉంది. సైకోలా మారిన అతడు ముక్కుపచ్చలారని పసి పిల్లలను కుంచనపల్లిలోని బకింగ్ హామ్ కెనాల్‌లో పడేశాడు. పిల్లలు కనపడకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు కాలువలో చిన్నారుల మృతదేహాలను గుర్తించి బయటకుతీశారు. అభం శుభం తెలియని పసిపిల్లలను పొట్టన పెట్టుకున్న తండ్రిని పోలీసులు విచారించగా తానే కెనాల్‌లో తోసేశానని ఒప్పుకున్నాడు. పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాజమండ్రిలో విషాదం
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాజమండ్రి అర్బన్ రాజవోలు చెరువులో దూకి తండ్రి పక్కి సత్యేంద్ర కుమార్ (40), కుమార్తెలు పక్కి రిషిత (12), పక్కి హాద్దిక (7) తో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతులు రాజమండ్రి అర్బన్ వీఎల్ పురానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. అకౌంటెంట్ గా పనిచేస్తున్న సత్యేంద్ర కుమార్ ఉద్యోగంలో ఒత్తిడి వల్ల ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ నోట్లో రాసినట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం భార్య ఊరు వెళ్లడంతో పిల్లలతో కలిసి సత్యేంద్ర కుమార్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. భార్య తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉండడంతో వారికోసం గాలించగా ఎటువంటి సమాచారం తెలియలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజవోలు చెరువులో మృతదేహాలు లభ్యం కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read : Rajahmundry News : ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర నిర్ణయం, ఇద్దరు చిన్నారులతో సహా తండ్రి ఆత్మహత్య!
Also Read : కొముర భీం జిల్లాలో విషాదం, కూల్ డ్రింక్ అనుకొని పురుగుల మందు తాగేసిన ఐదేళ్ల చిన్నారి!