కొముర భీం జిల్లాలో విషాదం, కూల్ డ్రింక్ అనుకొని పురుగుల మందు తాగేసిన ఐదేళ్ల చిన్నారి!
Kumaram Bheem District News : చిన్న పొరపాటు పెద్ద మూల్యాన్ని చెల్లించింది. అన్యంపుణ్యం ఎగురని చిన్నారిని బలితీసుకుంది.
Kumaram Bheem District News :తెలిసి తెలియని వయసు, తెల్లనివన్నీ పాలని, నల్లనివన్నీ నీళ్లని నమ్మే అమాయకత్వం. అలాగే ఓ చిన్నారి కూల్ డ్రింక్ అని భావించి క్రిమిసంహారక మందు అని తెలియక తాగేసింది. తల్లిదండ్రులు ఎన్ని ఆసుపత్రులకు తీసుకెళ్లినా చికిత్సకు ఎవరూ ముందుకు రాలేదు. తమ గారాలపట్టిని బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రాణాలు దక్కలేదు. ఈ హృదయవిదారక ఘటన కొమురం ఆసిఫాబాద్ జిల్లాలోని భీంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
అసలేం జరిగింది?
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా భీంపూర్ గ్రామానికి చెందిన రాజేష్, లావణ్య దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఐదేళ్ల శాన్వి గుండి గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో LKG చదువుతోంది. ఆదివారం పెద్దనాన్న ఇంటి వద్ద శాన్వి ఆడుకుంటోంది. పంటకు పిచికారీ చేయగా మిగిలిన పురుగుల మందును కూల్ డ్రింగ్ బాటిల్ నింపి ఇంటి దగ్గర పెట్టారు. అక్కడే ఆడుకుంటున్న పాప సీసాను చూసి కూల్ డ్రింక్ అనుకుని తాగింది. ఇంటికి వచ్చి వాంతులు చేసుకోవడంతో వాసనను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే హుటాహుటిన కాగజ్‌నగర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల ఆసుపత్రికి పంపారు. అక్కడ పది ఆసుపత్రులు తిరిగినా చోర్చుకోడానికి ఎవరూ ముందుకు రాలేదు. చివరకు ఓ ఆసుపత్రిలో చేర్చుకున్నా అప్పటికే బాలిక ప్రాణాలు విడిచింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి కళ్లముందే విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా కన్నీరుమున్నీరుగా రోధిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తనయుడికి విషం పెట్టిన తల్లి
పిల్లలు కడుపులో పడినప్పటి నుంచి ఆ తల్లి.. పిల్లల కోసం ఎన్నో కలలు కంటుంది. వారికోసం ఎన్నెన్నో త్యాగాలను కూడా చేస్తుంది. వారిని మంచి స్థానంలో చూడాలని.. రేయింబవళ్లు కష్టపడుతుంటుంది. అయితే భర్త చనిపోయిన ఓ తల్లి కూడా తన కూతురు, కొడుకు కష్టపడి సాకుతోంది. బాగా చదివి ఉన్నత స్థాయి ఉద్యోగం తెచ్చుకొని తల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఆ కన్నకొడుకు వ్యసనాలకు బానిస అయ్యాడు. ఓనాడు ఫుల్లుగా తాగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కాళ్లు విరిగి మంచానికే పరిమితం అయ్యాడు. ఇంతటి కష్ట సమయంలో కూడా అతనికి కాస్త కూడా బుద్ధి రాలేదు. తాగేందుకు మద్యం, తినేందుకు మాంసాహారం కావాలంటూ తల్లిని వేధిస్తూనే ఉన్నాడు. ఇవన్నీ తాళలేని ఆ తల్లి.. కన్నకొడుకును చంపేయాలనుకుంది. అనుకున్నదే తడవుగా అతను తినే అన్నంలో పురుగుల మందు కలిపేసింది. సొంత కుమారుడిని కాటికి పంపింది.
విజయనగరం జిల్లాలో
విజయనగరం జిల్లా డెండాక మండలానికి చెందిన గొడ్డు రామాయమ్మ భర్త మూడేళ్ల కిందట చనిపోయారు. కుమార్తె సునీత, కుమారుడు సాయితో కలిసి పూసపాటిరేగ మండలం గుండపు రెడ్డిపాలెంలో ఉంటున్నాడు. స్థానికంగా ఫార్మా కంపెనీలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే మూడు నెలల క్రితం కుమారుడు ఫుల్లుగా తాగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలోనే కాళ్లు విరిగిపోయి మంచానికి పరిమితం అయ్యారు. అంతకు ముందే చెడు వ్యసనాలకు బానిసై అయిన అతడు ఇంట్లోనూ మద్యం తాగేవాడు. రోజూ మాంసం వండాలని, మద్యం తీసుకురావాలని తల్లిని, అక్కని వేధించి కొట్టేవాడు. కుమారుడి ఆగడాలను భరించలేని రామాయమ్మ శుక్రవారం రాత్రి సాయి(20)కి అన్నంలో పురుగుల మందు కలిపి వడ్డించారు. అది తిన్న సాయి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆ తర్వాత తల్లే స్వయంగా అంబులెన్స్ కు సమాచారం అందించింది. హుటాహుటిన రంగంలోకి దిగి సాయి శనివారం చనిపోయాడు. ఈ మృతిపై సోదరి సునీత అనుమానాలు వ్యక్తం చేయగా... తల్లిని విచారించారు. అయితే వేధింపులు తాళలేక, అతడి అడిగింది ఇవ్వలేకే అన్నంలో పురుగుల మందు కలిపినట్లు ఆమె ఆంగీకరించారు.
Also Read : Kurnool Nude Call: వీడియో కాల్‌లో బట్టలిప్పేసిన యువతి, తర్వాత చుక్కలు! ఆ వెంటనే సీబీఐ అని ట్విస్ట్