Guntur Car Accident: గుంటూరు జిల్లాలో విషాదం... చెరువులో కారు బోల్తా, నలుగురు మృతి
గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. యర్రబాలెం చెరువులో కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.
గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మంగళగిరి మండలం యర్రబాలెం చెరువులో కారు బోల్తా పడిపోయింది. ఈ విషాద ఘటనలో సాయి, శ్రీనివాస్, నరేంద్ర కుమార్, తేజ రాంజీ ప్రాణాలు కోల్పోయారు. మృతులు మంగళగిరి కొత్తపేట వాసులుగా గుర్తించారు. దీంతో కొత్తపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Also Read: AP Liquor Shops: మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.... మద్యం దుకాణాల పనివేళలు మరో గంట పొడిగింపు
చెరువులోకి దూసుకెళ్లిన కారు
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం యర్రబాలెం చెరువులో కారు బోల్తా కొట్టింది. AP 16CE5328 కారు ప్రమాదవశాత్తు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ కారులో ఉన్న నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న గుంటూరు రూరల్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. మృతుల్లో ముగ్గురు మంగళగిరికి చెందిన వారు కాగా మరో వ్యక్తి యర్రబాలెంకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. యర్రబాలెంకు చెందిన వ్యక్తి మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యలయం వద్ద దస్తావేజులేకరిగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సాయి, శ్రీనివాస్, నరేంద్ర కుమార్, తేజ రాంజీ కారు ప్రమాదంలో మృతి చెందారు.
స్థానికులు కాపాడేందుకు యత్నించినా...
కృష్ణాయపాలెం నుంచి నలుగురు వ్యక్తులు కారులో వస్తున్నారు. యర్రబాలెం చెరువు మలుపు వద్దకు రాగానే కారు అదుపుతప్పి ఒక్కసారిగా చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న సాయి, శ్రీనివాస్, నరేంద్ర కుమార్, తేజ రాంజీగా అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి కారు అద్దాలు పగులగొట్టి నలుగురిని బయటకు తీశారు. అప్పటికే వారు మృతి చెందారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాయి, శ్రీనివాస్, నరేంద్ర మంగళగిరి వాసులు కాగా, తేజ రాంజీ యర్రబాలెం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు.
Also Read: సోషల్ మీడియాలో భార్య ఫోటోలు.. పిల్లలకు ఎలుకల మందు పెట్టి తానూ తిన్న భర్త
Also Read: తల్లిదండ్రులారా ఊపిరి పీల్చుకోండి.. స్కూల్ ఫీజుల నియంత్రణకు తెలంగాణ సర్కార్ కొత్త చట్టం .. త్వరలోనే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి