By: ABP Desam | Updated at : 17 Jan 2022 06:56 PM (IST)
స్కూల్ ఫీజుల నియంత్రణకు కొత్త చట్టం
విద్యార్థలు తల్లిదండ్రులకు భారం అవుతున్న ఫీజులను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ప్రైవేట్ స్కూల్స్, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఫీజులను నియంత్రించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. అలాగే వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనకై.. కొత్త చట్టాన్ని తీసుకురావాలని కూడా నిర్ణయించారు. ఈ రెండు అంశాల పై పూర్తి అధ్యయనం చేసి సంబంధిత విధి విధానాలను రూపొందించేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన... పంట నష్టాన్ని పరిశీలించనున్న సీఎం
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన...మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి , పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కెటిఆర్ లు ఈ సబ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వీరు వీలైనంత త్వరగా సమావేశం అయి చట్టానికి రూపకల్పన చేస్తారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన నూతన చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ. 7289 కోట్ల తో ..." మన ఊరు - మన బడి" ప్రణాళిక కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణలో ప్రతి ఏడాది స్కూళ్లు ప్రారంభమయ్యే సమయంలో ఫీజుల పంచాయతీ నడుస్తుంది. విద్యార్థుల తల్లిదండ్రులు... స్కూళ్ల తీరుపై ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తూంటారు. అయినా నియంత్రించలేని పరిస్థితి.
Also Read: టార్గెట్ 2023... వరంగల్ లో దూకుడు పెంచిన బీజేపీ
స్కూల్ ఫీజుల వ్యవహారంపై కోర్టుల్లోనూ పిటిషన్లు పడినా ...ప్రైవేటు విద్యా సంస్థలు ఎక్కడా తగ్గడం లేదు. ప్రస్తుతం ఒకటో తరగతి విద్యార్థికి కూడా ఓ మాదిరి విద్యా సంస్థలు రూ. అరవై నుంచి ఎనభై వేల ఫీజు వసూలు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్ని అధిగమించాలంటే కొత్త చట్టం తేవడమే కాదు.. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు.. నాణ్యత పెంచాలని నిర్ణయించారు.
Also Read: ఈ సంక్రాంతికి దుమ్ములేపిన చికెన్ సేల్స్.. 60 లక్షల కిలోలు తినేసిన హైదరాబాదీలు, మటన్ సేల్స్ ఎంతంటే..
Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే
CPGET Seat Allotment: సెప్టెంబరు 29న సీపీగెట్ సీట్ల కేటాయింపు, ఈ తేదీలోగా జాయిన్ అవ్వాల్సిందే!
TSPSC: 'గ్రూప్-1' పరీక్షలో అవకతవకలు జరగలేదు, టీఎస్‌పీఎస్సీ వివరణ
Rain In Hyderabad: హైదరాబాద్‌లో వర్షం - చిరుజల్లుల మధ్యే కొనసాగుతున్న నిమజ్జనం
Minister Dance: గణేశ్ శోభాయాత్రలో డాన్స్ చేసిన మంత్రి, ఆయనతో కలెక్టర్, ఎస్పీ కూడా
Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !
Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం
BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది
Kotamreddy : చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత - కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !
/body>