Bjp: టార్గెట్ 2023... వరంగల్ లో దూకుడు పెంచిన బీజేపీ
తెలంగాణలో అధికారం చేపట్టేందుకు బీజేపీ అడుగులు వేస్తుంది. తెలంగాణ ఉద్యమానికి ఆయువు పట్టువుగా ఉన్నా జిల్లాలను ఎంచుకుని ప్రజ సమస్యలపై గళమెత్తుతున్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఆందోళనలు చేపడుతున్నారు.
ఆనాడు తెలంగాణ ఉద్యమానికి వెనుదన్నుగా ఉన్న వరంగల్ జిల్లాలో బీజేపీ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ఆ నేతలు హుడావుడి చూస్తే ముందస్తు ఎన్నికలు ఖాయం అనేలా చర్చ సాగుతుంది.
ఉత్తర తెలంగాణ జిల్లాలో కాషాయం దళం కదం తొక్కుతుంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ తరువాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారాయి. 2023లో అధికారాన్ని చేపట్టేందుకు బీజేపీ నాయకత్వం పావులుకదుపుతుంది. ఈ దఫా తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకులకు ఢిల్లీ నాయకత్వం దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా, గ్రామీణ స్థాయిలో క్యాడర్ ను బీజేపీ పార్టీ సన్నద్ధం చేస్తుంది. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో విజయం ఎలా సాధించామో అదేవిధంగా రానున్న ఎన్నికల్లో సైతం అదే ఉత్సాహాన్ని కనబరచేలా కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.
ప్రజాసమస్యలపై తెలంగాణ బీజేపీ తనదైన శైలిలో స్పందిస్తుంది. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగుల సమస్యలపై బీజేపీ పార్టీ అధినాయకత్వం గళమెత్తుతుంది. అందుకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు, ఉత్తర తెలంగాణ జిల్లాలోని వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలో బీజేపీ దూకుడు పెంచింది. తాజాగా వరంగల్ లో బీజేపీ ఉద్యోగుల సమస్యలపై నిరసన సభ నిర్వహించి ఉద్యోగులకు ,నిరుద్యోగులకు, విద్యార్థులకు బీజేపీ బాసటగా ఉందని సంకేతాన్ని ప్రజలకు పంపారు. వరంగల్ లో నిర్వహించిన నిరసన సభలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సర్కారు నియంతలా వ్యవహరిస్తుందని ఘూటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్రప్రభుత్వం పరిశీలిస్తుందని ప్రజస్వామ్య దేశంలో ప్రశ్నించే వారిపై పోలీసులతో అణచివేస్తామని చూస్తే సరికాదని అన్నారు.
వరంగల్ వేదికగా కేసీఆర్ పతనం ప్రారంభమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ అన్నారు. అయితే కేసీఆర్ చేస్తున్న అరాచకాలను సహించదిలేదని కేసీఆర్ ను జైలుకు పంపడం ఖాయమని బండి సంజయ్ జోస్యం చెప్పారు. తెలంగాణలో ఉన్న ప్రతి కాషాయ కార్యకర్త ప్రజలకు కేసీఆర్ చేస్తున్నా అక్రమాలను బయటపెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ప్రజాసమస్యలను పరిష్కారించకుండా వారి స్వలాభం కోసం ఏం చేస్తున్నారో ప్రజలకు అర్థమైందని బండి సంజయ్ అన్నారు.
తెలంగాణలో రానున్న ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేసేందుకు ఇప్పటినుంచే బీజేపీ కసరత్తు చేస్తుంది. వ్యూహత్మక ఎత్తుగడలు వేయడంలో ఢిల్లీ కాషాయ నాయకత్వం సిద్ధంగా ఉందనే సంకేతాలను ఇతర పార్టీలకు ఇస్తున్నారు. ప్రతిరోజు రాష్ట్ర అధ్యక్షుడు మొదలుకుంటే, గ్రామీణ స్థాయి కార్యకర్త వరకు ప్రజాసమస్యలపై పోరాటం చేసేలా కార్యచరణ రూపొందిస్తున్నారు కాషాయ నేతలు గతంలో బీజేపీ గెలిచిన నియోజకవర్గాలపై సైతం కాషాయ దళం ఫోకస్ పెంచింది. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంతో పాటు పరకాల, వరంగల్ పశ్చిమ, వర్థన్నపేట నియోజకవర్గాలలో కార్యకర్తలను ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మిగతా నియోజకవర్గలైనా భూపాలపల్లి, జనగామ, వరంగల్ తూర్పు, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, ములుగు నియోజకవర్గాలలో సైతం బీజేపీ యాక్షన్ ప్లాన్ రూపొందిస్తుంది. అయితే వరంగల్ జిల్లా ప్రజలను బీజేపీ వైపు ఆకర్షితులు చేస్తే తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలను సైతం కాషాయ దళం వైపు చూసేలా ప్రయత్నాలు ప్రారంభించింది. అందుకు RSS తో పాటు,BJYM, ABVP, TGVP లాంటి బీజేపీ అనుబంధ సంస్థలను సైతం సమాయాత్తం చేస్తున్నారు. అయితే ఎస్టీ నియోజకవర్గాలలో నెలకొన్న పోడురైతులు ఎదుర్కొంటున్నా సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకచ్చి గిరిజన రైతులలో బీజేపీ మార్క్ చూపేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.
అసలు తెలంగాణలో బీజేపీ ఫార్ములా వర్కవుట్ అవుతుందా?.....కేసీఆర్ సెంటిమెంట్ గా భావించే వరంగల్ లో బీజేపీ వ్యూహరచన పనిచేసి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా?...ప్రజలు అదరిస్తారా??..బీజేపీ భవిష్యత్తు అధికార పార్టీ ప్రయాణమవుతుందో...ప్రతిపక్షా పార్టీ ప్రయాణవుతుందో వేచి చూడాల్సిందే.