By: ABP Desam | Updated at : 17 Jan 2022 11:58 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని సీతానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వంగలపూడికి చెందిన ఓ వ్యక్తి విషం తాగి, పిల్లలకూ తాగించి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతనితోపాటు ఓ కొడుకు చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. అతడితో పాటు పదేళ్ల కొడుకు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే, ఇలా భర్త ఆత్మహత్య చేసుకున్నందుకు గల కారణాన్ని పోలీసులు వివరించారు.
తన భార్య వేరే వ్యక్తితో కలిసి ఉన్న అసభ్యకర ఫోటోలు ఫేస్‌బుక్ కనిపించడం వల్లే మనస్తాపానికి గురై ఇలా చేశానని బాధితుడు చెప్పినట్లుగా పోలీసులు వివరించారు. తూర్పు గోదావరి జిల్లా వంగలపూడికి చెందిన 30 ఏళ్ల వివాహిత కువైట్‌లో ఉండి ఉద్యోగం చేస్తోంది. ఆమె భర్త స్వగ్రామం గోకవరంలో ఇద్దరు కుమారులు ఉంటున్నారు. మరో కుమార్తె అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటోంది. తండ్రి అప్పుడప్పుడు వెళ్లి పిల్లల్ని చూస్తుంటాడు. శనివారం సాయంత్రం పండగ పేరుతో వంగలపూడికి వచ్చిన తండ్రి తన ముగ్గురు పిల్లలను బయటకు తీసుకెళ్లాడు. ముందుగా తాను ఎలుకల మందు తాగేశాడు. తర్వాత ముగ్గురు పిల్లలతో తాగించాడు.
కొద్దిసేపటికి వారిని గమనించిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరి బాధితులను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగతా ఇద్దరు పిల్లలు సురక్షితంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. పిల్లలు ఇద్దరూ మాట్లాడుతూ.. తమ తండ్రి ఎప్పుడూ తమను పట్టించుకోడని అన్నారు. అమ్మమ్మ ఇంటి వద్దే ఉండే తమను అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుంటాడని అన్నారు. పండక్కి వచ్చాడనుకుని బయటకు వెళ్దామంటే బయలుదేరామని అన్నారు. బలవంతంగా ఏదో చేదు మందు తమతో తాగించే ప్రయత్నం చేశాడని అన్నారు. తమ్ముడు తెలియకుండానే తాగేశాడని విలపించారు. చావుబతుకుల్లో ఉన్న పిల్లల తండ్రి ఆటో నడుపుతాడని, గతంలో చోరీలకు పాల్పడినట్లు గోకవరంలో కేసు కూడా నమోదై ఉందని ఎస్సై తెలిపారు.
Also Read: D.Srinivas: కాంగ్రెస్ లోకి ధర్మపురి శ్రీనివాస్ రీ ఎంట్రీ.. 'కారు' దిగి 'చేయి' పట్టుకునేది ఎప్పుడంటే!
MLC Anantha Udaya Bhaskar: డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్లు అంగీకరించిన ఎమ్మెల్సీ అనంతబాబు ! సాయంత్రం పోలీసుల ప్రెస్‌మీట్
Hyderabad: కొడుకుని బిల్డింగ్ పైనుంచి తోసిన తల్లి, అయినా బతకడంతో మరో ప్లాన్ వేసి హత్య!
Fake FB Account: మహిళ ఫేస్‌బుక్ అకౌంట్‌తో యువకుడి ఛాటింగ్- విషయం తెలిసిన వివాహితులు షాక్
Bihar Road Accident: బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రక్కు బోల్తా పడటంతో 8 మంది దుర్మరణం - పరారీలో డ్రైవర్ !
MLC Anantha Udaya Bhaskar Arrest: ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ అరెస్ట్, మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచిన పోలీసులు ! ఎందుకు ప్రకటించడం లేదో !
India Railways: భారత్‌లో భారీగా రైల్వే ట్రాక్‌ల ధ్వంసానికి పెద్ద కుట్ర - నిఘా వర్గాల హెచ్చరికలు
KTR On Petrol Price: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే మార్గమిదే, అలా చేయాలని కేంద్రానికి కేటీఆర్ డిమాండ్
Mehreen: బన్నీ సినిమా వదులుకున్నా, అది కానీ చేసుంటే - మెహ్రీన్ బాధ
Konaseema: ‘కోనసీమ’ పేరు మార్పుపై ఉద్రిక్తతలు, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ - కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక