AP Liquor Shops: మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.... మద్యం దుకాణాల పనివేళలు మరో గంట పొడిగింపు
మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మద్యం దుకాణాల పనివేళలను మరో గంట పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఇటీవల మద్యం ట్యాక్సుల్లో మార్పులు చేసి ధరలు తగ్గించిన ప్రభుత్వం తాజాగా మరో వెసులుబాటు కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల సమయాన్ని మరో గంట పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలను తెరచి ఉంచుతున్నట్లు ఎక్సైజ్‌శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10 గంటల తర్వాత ఖాతాల నిర్వహణకు మరో గంట సమయం పొడిగించినట్టు వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని బేవరేజెస్ కార్పొరేషన్ దుకాణాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
Also Read: మద్యంపై వ్యాట్ తగ్గింపు.. ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు..! ఏ బ్రాండ్ ఎంత తగ్గనుందంటే ?
ప్రీమియం బ్రాండ్లు
ఆంధ్రప్రదేశ్ మందు బాబులకు ఇటీవల అనూహ్యమైన గిఫ్ట్‌ను ప్రభుత్వం ఇచ్చింది. పాపులర్ బ్రాండ్లు దొరక్క మేడిన్ ఆంధ్రా మద్యం బ్రాండ్లతో గొంతు తడుపుకుంటున్నవారికి కొత్త ఏడాదిలో కాస్త ఊరట లభించే నిర్ణయం తీసుకుంది. పాపులర్ బ్రాండ్లను మళ్లీ మద్యం దుకాణాల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. పాపులర్ బ్రాండ్ల మద్యం బెవరేజెస్ కార్పొరేషన్ మద్యం దుకాణాల్లో అందుబాటులో ఉంచింది. ఏపీలో వైఎస్ఆర్‌సీపీ సర్కార్ వచ్చిన తర్వాత మద్యం విధానం సమూలంగా మారిపోయింది. ప్రభుత్వం అధీనంలోకి అమ్మకాలు వచ్చాయి. దుకాణాలన్నీ ప్రభుత్వమే నిర్వహిస్తోంది. ఆ మద్యం ఇతర రాష్ట్రాల్లో అమ్మడానికి పర్మిషన్ ఉండదు. ఏపీలో మాత్రమే అమ్ముతారు. పాపులర్ బ్రాండ్లను ఎందుకు అమ్మరని విపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు వచ్చినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు.
మద్యం ధరలు తగ్గింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల మద్యంపై వ్యాట్‌ను క్రమబద్ధీకరించింది. ఇలా చేయడం ద్వారా దాదాపుగా ఇరవై శాతం వరకూ మద్యం ధరలు తగ్గాయి. వ్యాట్‌తో పాటు స్పెషల్ మార్జిన్, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ సవరించారు. బీర్లపై వ్యాట్ 10 నుంచి 20 శాతం తగ్గింది. స్పెషల్ మార్జిన్ 36 శాతం, అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ 36 శాతం తగ్గింది. మొత్తంగా బీర్లపై రూ. 20 నుంచి రూ. 30 వరకు వరకు తగ్గింది. ఐఎంఎల్ లిక్కర్‌పై వ్యాట్ 35 నుంచి 50 శాతం, స్పెషల్ మార్జిన్ 10 నుంచి 20 శాతం, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ 5 నుంచి 26 శాతం తగ్గాయి.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి