అన్వేషించండి

Gold Smuggling: హైదరాబాద్‌కు విదేశీ బంగారం స్మగ్లింగ్, 4.7 కేజీలు సీజ్ - ముగ్గురి అరెస్ట్

Hyderabad Crime News | కోయంబత్తూరు నుంచి హైదరాబాద్ కు బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ముఠా ఆటకట్టించారు డీఆర్ఐ అధికారులు. ఓ కారులో చెక్ చేయగా 4.7 కేజీల బంగారం లభించడంతో ముగ్గుర్ని అరెస్ట్ చేశారు.

Gold Seized at Raikal Tollplaza Hyderabad News | హైదరాబాద్‌: కేటుగాళ్లు తెలివి మీరిపోయారు. ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు ఎంతగా పెరిగిపోతున్నాయో, మరోవైపు స్మగ్లింగ్ లో సైతం నేరస్తులు కొత్త మార్గాలు వెతుక్కుంటూ పోలీసులకు ఛాలెంజ్‌గా నిలుస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు అక్రమంగా బంగారం తరలిస్తున్న గ్యాంగ్ ను డీఆర్ఐ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. కోయంబత్తూరు నుంచి హైదరాబాద్‌కు స్మగ్లింగ్ చేస్తున్న 4.7 కేజీల విదేశీ బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. 

విదేశీ బంగారాన్ని ఓ గ్యాంగ్ నగరానికి తరలిస్తుందని అధికారులకు సమాచారం అందింది. దాంతో అప్రమత్తమైన అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కోయంబత్తూరు నుంచి వస్తుండగా హైదరాబాద్ శివారులోని రాయికల్‌ టోల్‌ప్లాజా (Toll Plaza) వద్ద ఓ కారును ఆపిన అధికారులు సోదాలు చేశారు. కారులో మొత్తం ముగ్గురు ప్రయాణిస్తున్నారు. కాగా, వారిపై అనుమానం వచ్చి, పూర్తి స్థాయిలో చెక్ చేయగా స్మగ్లింగ్ గ్యాంగ్ గుట్టు రట్టయింది. కారు హ్యాండ్‌ బ్రేక్‌ కిందవైపు ప్రత్యేకంగా తయారు చేసిన క్యావిటీలో బంగారం (Gold) దాచి తరలిస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు. బంగారం అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు నిందితులపై కస్టమ్స్‌ చట్టం 1962 నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు. నిందితుల వద్ద నుంచి ఓ కారుతో పాటు 4.7 కేజీల బంగారం సీజ్ చేశారు. అనంతరం ముగ్గురు నిందితుల్ని రిమాండ్‌కు తరలించామని వెల్లడించారు.

Also Read: Asifabad District: జైనూర్‌ ఘటన మరువక ముందే ఆసిఫాబాద్ జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం, ఉరితీయాలంటూ నిరసన

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Embed widget