By: ABP Desam | Updated at : 23 Dec 2021 05:19 PM (IST)
అబ్బాయితో అమ్మాయి స్నేహం ..లైంగిక వాంఛలు తీర్చుకోమని ఆఫర్ కాదు.. !
ఆడా - మగ ఫ్రెండ్ షిప్ మీద సూపర్ హిట్ సినిమాలొచ్చాయి. ఇద్దరి ఫ్రెండ్ షిప్ చివరికి ప్రేమతో ముగిసే కాన్సెప్ట్ కథలు వచ్చాయి. వేర్వేరు వ్యక్తుల్ని పెళ్లి చేసుకుని ... తర్వాత వారి స్నేహాన్ని తప్పుగా అర్థం చేసుకునే జీవిత భాగస్వాములు వచ్చినప్పుడు ఎదురయ్యే పరిస్థితులపై సినిమాలొచ్చాయి. అయితే ఫ్రెండ్‌షిప్‌ను తప్పుగా అర్థం చేసుకుని అడ్వాంటేజ్ తీసుకుని లైంగిక వాంఛలు తీసుకోవాలనుకునే ఫ్రెండ్ ఉన్నకథలు మాత్రం పెద్దగా కనిపించవు. దీనికి కారణం అలాంటి మనస్థత్వం ఉండటం అసహజమే. ఫ్రెండ్ షిప్‌ను అపవిత్రం చేయడమే. అలా చేయడం నేరం కూడా అని తాజాగా కోర్టు కూడా తీర్పు ఇచ్చింది.
స్నేహంగా ఉన్నంత మాత్రాన లైంగిక వాంఛలు తీర్చుకునేందుకు అనుమతించినట్లు కాదని పోక్సో కోర్టు తీర్పు చెప్పింది. ఈ కోర్టు ముందుకు వచ్చిన కేసులో ఇరవై ఏళ్ల యువకుడు.. తనతో స్నేహంగా ఉన్న మైనర్ బాలికతో లైంగిక వాంఛలు తీర్చుకునే ప్రయ.త్నం చేశాడు. లైంగికంగా వేధించాడు. తనతో స్నేహంగా ఉంటుందని... చొరవగా ఉంటుందని.., అతను ఆ ఆడ్వాంటేజ్ తీసుకున్నాడు. చివరికి వ్యవహారం కేసుల వరకూ వెళ్లింది. కోర్టులోనూ అతను అదే వాదన వినిపించాడు. వాదనలు విన్న పోక్సో కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అబ్బాయితో అమ్మాయి స్నేహంగా ఉన్నంత మాత్రాన లైంగిక వాంఛలు తీర్చేందుకు అనుమతి ఇవ్వడం కాదని స్పష్టం చేసింది.
స్నేహితురాలి స్నేహాన్ని అంగీకారంగా భావించి లైంగిక దాడికి పాల్పడిన యువకుడికి పోక్సో కోర్టు శిక్ష విధించింది. నేటి తరానికి ఈ శిక్ష ఓ పాఠం లాంటిదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. యువతరం స్నేహాన్ని తప్పుగా అర్థం చేసుకుని తప్పుడు మార్గంలో పయనిస్తే జీవితం ప్రభావితమవుతుందని.. ఈ కేసులో అటు నిందితుడు..ఇటు బాధితురాలు కూడా జీవితంలో తీవ్రంగా నష్టపోతున్నారని న్యాయస్థానం ఆవేదన వ్యక్తం చేసింది.
Also Read: తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థిని మృతి... ఫస్టియర్ లో ఫెయిల్ అవ్వడంతో ఆత్మహత్య ..!
స్నేహం అనేది హద్దులు లేనిది. కానీ ఆడ, మగ స్నేహాల మధ్య మాత్రం ... కనిపించని హద్దులు ఉంటాయి. వాటిని ఎవరూ దాటకూడదు. ఈ హద్దులపై స్పష్టమైన అవగాహన ఉన్న వారు మాత్రమే... స్నేహాన్ని స్నేహంగా ఉంచుకుంటారు. లేకపోతే.. నేరస్తులుగా మిగిలిపోతారు. ఈ కేసు అందుకే అందరికీ ఓ పాఠంలా మారింది.
Also Read: మద్యం ధరలపై వాగ్వాదం... టీడీపీ కార్యకర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Anantapur: సచివాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ట్రైనీ జేసీ తనిఖీలు - పోలీసులు అరెస్టు చేయడంతో కి‘లేడీ’ ట్విస్ట్
DK SrinivaS Arrest : డ్రగ్స్ కేసులో డీకే ఆదికేశవులు కుమారుడు - బెంగళూరులో అరెస్ట్ చేసిన ఎన్సీబీ !
Texas Gun Fire: కాల్పులతో దద్దరిల్లిన టెక్సాస్, ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులు - 18 పిల్లలు, టీచర్లు మృతి
Goa News: దొంగల నయా ట్రెండ్- ఇల్లంతా దోచేసి, లవ్ లెటర్ రాసి పరార్!
Hyderabad: వంట మాస్టర్‌తో మహిళ సహజీవనం, ఇంతలో గది నుంచి కంపు వాసన - తెరిచి చూసి స్థానికులు షాక్
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్పోర్ట్
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి