అన్వేషించండి

Kakinada News: కాకినాడలో లవ్ జిహాద్ కలకలం! ఆరుగురితో సహజీవనం చేసి మత మార్పిడి.. భర్తపై వివాహిత ఆరోపణలు

Love Jihad In Kakinada | హిందువులను ట్రాప్ చేసి ఇస్లాంలోకి మార్చి వేధింపులకు గురిచేస్తున్నాడని కాకినాడకు చెందిన వివాహిత తన భర్తపై సంచలన ఆరోపణలు చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కాకినాడ బాలరమ్య భర్త గౌస్‌పై మతమార్పిడి, వేధింపుల ఫిర్యాదు.
  • గౌస్ బలవంతంగా మతం మార్చి, శారీరకంగా, మానసికంగా వేధించాడని ఆరోపణ.
  • మరో ఆరుగురి మహిళలను మోసం చేసి మతమార్పిడి చేశాడని బాలరమ్య ఆరోపణ.
  • బాలరమ్య తల్లి సమక్షంలో తిరిగి హిందూ మతంలోకి చేరినట్లు ప్రకటించింది.

Forced Religious Conversion | కాకినాడ జగన్నాథపురానికి చెందిన బాలరమ్య, మటన్ వ్యాపారి గౌస్ మొహిద్దీన్‌ను ప్రేమించి వివాహం చేసుకోగా.. మరో ఆరుగురు మహిళలతో సహజీవనం చేస్తూ మత మార్పిడి చేస్తున్నాడని  ఎస్పీకి ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కఠిన చర్యలు కోరుతూ, తల్లి సమక్షంలో తిరిగి హిందూ మతంలోకి మారినట్లు ప్రకటించింది.

అసలేం జరిగిందంటే..

కాకినాడ జగన్నాథపురానికి చెందిన శిరివూరి బాలరమ్య డిగ్రీ చదువుతున్న సమయంలో మటన్ వ్యాపారం చేసే గౌస్ మొహిద్దీన్‌తో పరిచయం ఏర్పడింది. 8 ఏళ్ల క్రితం తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రియుడు గౌస్‌ను వివాహం చేసుకుంది. అయితే, పెళ్లయిన 2 నెలల నుంచే మొహిద్దీన్ వేధించడం మొదలుపెట్టాడు. ఆమెను బలవంతంగా మతం మార్పించి షేక్ ఉమల్ ఖైర్‌గా పేరు మార్చడమే కాకుండా, ఒక కుమార్తె పుట్టిన తర్వాత కూడా మానసిక, శారీరక వేధింపులకు గురిచేశాడు. స్థానిక పెద్దల దృష్టికి తీసుకెళ్లి పంచాయతీ పెట్టినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు.


Kakinada News: కాకినాడలో లవ్ జిహాద్ కలకలం! ఆరుగురితో సహజీవనం చేసి మత మార్పిడి.. భర్తపై వివాహిత ఆరోపణలు

తన కళ్ల ముందే మొహిద్దీన్ మరో ఐదారుగురు మహిళలతో సహజీవనం చేస్తున్నాడని బాలరమ్య ఆరోపించారు. ఆ మహిళల్ని కూడా ఉచ్చులోకి లాగి మతమార్పిడికి పాల్పడ్డాడని సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై ప్రశ్నిస్తే ఏడుగురిని పెళ్లి చేసుకున్నా తనను అడిగే దిక్కు లేదంటూ తీవ్రంగా కొట్టేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. అతడి బారి నుంచి ఎలాగోలా తప్పించుకుని వెళ్లినా కత్తులతో బెదిరించేవాడని తెలిపారు. మా అమ్మానాన్నలకు ఫోన్ చేసి మీ రెండో అమ్మాయిని కూడా ఇలాగే వేధిస్తా అంటూ హెచ్చరించి వారిని సైతం భయాందోళనకు గురిచేశాడు. గతంలో ఓ యువతిపై కత్తితో దాడి చేసిన ఘటనలో ఇతనిపై రౌడీషీట్ తెరిచి 20 రోజులు రిమాండ్‌కు తరలించారు. ఇటీవల మరో ఎస్సీ యువతిని వేధించిన కేసులో ప్రస్తుతం మొహిద్దీన్ జైలులో ఉండటంతో, ధైర్యం తెచ్చుకుని బయటకు వచ్చినట్లు బాధితురాలు బాలరమ్య తెలిపారు.

మత మార్పిడి ఆరోపణలు వచ్చిన కాకినాడ పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ సామూహిక ఆత్మహత్య ఘటన మరువక ముందే జిల్లాలో అలాంటి మరో కేసు నమోదు కావడం స్థానికంగా కలకలం రేపింది. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చిలుకూరి రామ్‌కుమార్‌తో కలిసి సోమవారం రోజు బాలరమ్య కాకినాడ ఎస్పీ బిందుమాధవ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. మొహిద్దీన్ నుండి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఎస్పీ ఆఫీసు ఎదుటే తన తల్లి చేతుల మీదుగా నుదుటన బొట్టు పెట్టించుకుని తాను తిరిగి హిందూ మతంలోకి చేరినట్లు బాలరమ్య ప్రకటించారు. ఈ బలవంతపు మతమార్పిడులపై లోతైన దర్యాప్తు జరపాలని, లవ్ జిహాద్ తరహా కేసులపై పోలీసులు ఫోకస్ చేయాలని బీజేపీ నేత రామ్‌కుమార్ పోలీసులను డిమాండ్ చేశారు.

 

 

Frequently Asked Questions

కాకినాడలో బలవంతపు మత మార్పిడిపై ఎవరు ఫిర్యాదు చేశారు?

బాలరమ్య అనే యువతి మటన్ వ్యాపారి గౌస్ మొహిద్దీన్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఆమెను బలవంతంగా మతం మార్చి వేధించినట్లు ఆరోపించింది.

గౌస్ మొహిద్దీన్‌పై బాలరమ్య చేసిన ప్రధాన ఆరోపణలు ఏమిటి?

గౌస్ మొహిద్దీన్ మరో ఆరుగురు మహిళలతో సహజీవనం చేస్తూ, వారిని మత మార్పిడి చేశాడని ఆరోపించింది. బాలరమ్యను కూడా బలవంతంగా మతం మార్చి, శారీరక, మానసిక వేధింపులకు గురిచేశాడని ఫిర్యాదు చేసింది.

బాలరమ్య తన మతం గురించి ఏ నిర్ణయం తీసుకుంది?

గౌస్ మొహిద్దీన్ వేధింపుల నుంచి బయటపడి, ఎస్పీ కార్యాలయం ఎదుటే తన తల్లి సమక్షంలో తిరిగి హిందూ మతంలోకి మారినట్లు ప్రకటించింది.

గౌస్ మొహిద్దీన్ ప్రస్తుతం ఏమైనా న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నాడా?

అవును, గతంలో కత్తితో దాడి చేసిన కేసులో రౌడీషీట్ ఉంది. ప్రస్తుతం మరో ఎస్సీ యువతిని వేధించిన కేసులో జైలులో ఉన్నాడు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Hyderabad Crime News: చెవులు కుట్టించేందుకు వెళితే రెండేళ్ల పాప మృతి- జీడిమెట్లలో విషాదం
చెవులు కుట్టించేందుకు వెళితే రెండేళ్ల పాప మృతి- జీడిమెట్లలో విషాదం
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget