BCCI Devajit Saikia On Indian Players | బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సంచలన వ్యాఖ్యలు
భారత క్రికెట్ జట్టును వేధిస్తున్న వరుస గాయాల సమస్యపై బీసీసీఐ జాయింట్ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పష్టత ఇచ్చారు. ఆటగాళ్లు తరచూ గాయపడటానికి బిజీ షెడ్యూలే ప్రధాన కారణమని ఆయన వెల్లడించారు. ఇటీవల జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ వంటి కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడి జట్టుకు దూరం కావడంతో టీమిండియా మేనేజ్మెంట్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) మధ్య సమన్వయ లోపం ఉందనే ప్రచారం జరిగింది.
అయితే, ఈ వార్తలను సైకియా తీవ్రంగా ఖండించారు. బోర్డులోని అన్ని విభాగాలు భారత క్రికెట్ ప్రయోజనాల కోసమే కలిసి పని చేస్తున్నాయని స్పష్టం చేశారు. ఇకపై ప్లేయర్లపై వర్క్‌లోడ్ తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, ఓవర్సీస్ టూర్స్ కోసం మరింత ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తామని తెలిపారు. ముఖ్యంగా సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల పర్యటనలకు వెళ్లే ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఇదే సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్పై సాగుతున్న ప్రచారానికి కూడా సైకియా చెక్ పెట్టారు. రోహిత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారని, చివరిగా ఇంగ్లండ్‌పై 138 పరుగులు చేసి తన సత్తా చాటారని గుర్తుచేశారు. అలాంటప్పుడు అతని రిటైర్మెంట్ గురించి చర్చించడం అర్థరహితమని స్పష్టం చేశారు.
ట్రెండింగ్ వార్తలు






















