అన్వేషించండి

Madanapalle Lady Don: మదనపల్లె లేడీడాన్ ఇంట్లో తనిఖీలు.. భారీగా ఆస్తి పత్రాలు, ఫోర్జరీ డాక్యుమెంట్లు స్వాధీనం!

Madanapalle Lady Don: మదనపల్లె లేడీడాన్ కోనేటి సులోచన ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో 50 రకాల కీలక పత్రాలు, ఫోర్జరీ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మదనపల్లె లేడీ డాన్ సులోచన ఇళ్లలో కోర్టు ఆదేశాలతో పోలీసులు తనిఖీలు చేశారు.
  • తనిఖీల్లో ఫోర్జరీ సంతకాల బాండ్లు, కీలక ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
  • మాజీ మంత్రి అనుచరుడితో కలిసి వందల కోట్ల భూములు అక్రమంగా ఆక్రమించింది.
  • సులోచనపై ఇప్పటికే 14 క్రిమినల్ కేసులు, రౌడీషీట్ నమోదు చేయబడింది.

Madanapalle Lady Don: చిన్న గదిలో ఉంటూ.. వ్యవసాయ కూలీగా జీవితం మొదలుపెట్టిన ఓ మహిళ మాజీ మంత్రి కీలక అనుచరుడి సాయంతో లేడీ డాన్‌గా ఎదిగింది. ఆమె మదలనపల్లెకు చెందిన కోనేటి సులోచన. స్థానికంగా ‘లేడీ డాన్‌’గా చలామణి అవుతూ అనేక అక్రమాలకు పాల్పడింది. శనివారం కోనేటి సులోచన ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మాజీ మంత్రి ముఖ్య అనుచరుడితో చేతులు కలిపి వందల కోట్ల విలువైన భూములను అక్రమంగా కాజేసిన వ్యవహారం వెలుగులోకి రావడంతో.. కోర్టు ఆదేశాలతో తనిఖీలు నిర్వహించారు. మదనపల్లె డీఎస్పీ బుచ్చిరాజు ఆధ్వర్యంలో సీఐలు మోహన్‌ కుమార్, రాజారెడ్డి, మహమ్మద్‌ రఫీలతో కూడిన మూడు టీమ్‌లు నిర్వహించాయి. సులోచన నివాసంతో పాటు ఆమె సోదరుడు శ్రీనివాసులు ఇంట్లో తనిఖీలు చేశారు. 

ఫోర్జరీ సంతకాలు

పోలీసులు తనిఖీల్లో 50 రకాల కీలక ఆస్తి డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో 15 ఫోర్జరీ సంతకాలు చేసి ఉంచిన పాత ఖాళీ బాండు పేపర్లు బయటపడ్డాయి. అప్పులు ఇచ్చినట్లు నమ్మించి, వారి నుంచి బలవంతంగా ఖాళీ బాండ్లపై సంతకాలు తీసుకుని ఆస్తులు లాక్కోవడానికి వీటిని ఉపయోగించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ పత్రాలను ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీకి పంపినట్లు డీఎస్పీ తెలిపారు. 

కోట్లలో దందాలు

సులోచన పేరుపై బండకమ్మమీదపల్లెలో రూ.60 కోట్ల విలువైన 502 చదరపు గజాల స్థలం, బిల్డింగ్, పొన్నూటిపాళ్యంలో 1.75 ఎకరాల భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఫోర్జరీ పవర్‌ ఆఫ్‌ అటార్నీ దస్తావేజును ఉపయోగించి 10 కోట్ల విలువైన 47 సెంట్ల భూమిని ఆక్రమించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ భూమిని మాజీ మంత్రి భార్య పేరిట 2023 జూన్‌లో  గిఫ్ట్‌డీడ్‌గా మార్చినట్లు గుర్తించారు. గతంలో కోట్ల విలువైన భూములను అక్రమంగా రాయించుకున్నారని బాధితులుచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో మదనపల్లె లేడీ డాన్ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. 

Also Read: గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు

14 క్రిమినల్ కేసులు 

అయితే పోలీసుల తనిఖీలు చేస్తున్న క్రమంలో సులోచన ఇంట్లో లేదు. ఆమె విజయవాడలో ఉన్నట్లు గుర్తించారు. సులోచన ఇంట్లో స్వాధీనం చేసుకున్న పత్రాల వివరాలను ఇంట్లో ఉన్న ఆమె పిల్లలకు అందజేశారు. బాధితుడు మార్పు వెంకటేష్‌ నాయుడు ఇచ్చిన ఫిర్యాదుతో కోర్టు ఆదేశాలతో పోలీసులు తనిఖీలు నిర్వహించనట్లు సమాచారం. లేడీడాన్ సులోచనపై మదనపల్లె ఒకటో, రెండో పట్టణ, పోలీసు స్టేషన్లలో 14 క్రిమినల్‌ కేసులు, రౌడీషీట్‌ ఉండడం గమనార్హం. 

Also Read: తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !

 

Frequently Asked Questions

మదనపల్లెకు చెందిన కోనేటి సులోచన ఎవరు?

కోనేటి సులోచనను 'లేడీ డాన్' అని పిలుస్తారు. ఆమె వ్యవసాయ కూలీగా ప్రారంభించి, మాజీ మంత్రి అనుచరుడితో కలిసి వందల కోట్ల విలువైన భూములను అక్రమంగా కాజేసింది.

పోలీసులు సులోచన ఇంట్లో ఎందుకు తనిఖీలు నిర్వహించారు?

వందల కోట్ల విలువైన భూములను అక్రమంగా కాజేసిన వ్యవహారంపై కోర్టు ఆదేశాలతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో 50 కీలక ఆస్తి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల తనిఖీల్లో సులోచన ఇంట్లో ఏమేం దొరికాయి?

పోలీసులు 50 కీలక ఆస్తి డాక్యుమెంట్లను, అలాగే 15 ఫోర్జరీ సంతకాలతో కూడిన ఖాళీ బాండు పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని బలవంతంగా ఆస్తులు లాక్కోవడానికి ఉపయోగించినట్లు తెలిసింది.

కోనేటి సులోచనపై ఎన్ని క్రిమినల్ కేసులు నమోదయ్యాయి?

కోనేటి సులోచనపై మదనపల్లెలోని ఒకటో, రెండో పట్టణ పోలీసు స్టేషన్లలో మొత్తం 14 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఆమెపై రౌడీషీట్ కూడా ఉంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Loud Sound: హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
Vijayawada Digital Arrest: విజయవాడ డిజిటల్ అరెస్ట్ కేస్.. బాధితుడి ఖాతాలో రూ.7.32 కోట్లు జమ.. ముగ్గురు నిందితులకు కస్టడీ!
విజయవాడ డిజిటల్ అరెస్ట్ కేస్.. బాధితుడి ఖాతాలో రూ.7.32 కోట్లు జమ.. ముగ్గురు నిందితులకు కస్టడీ!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS NZ 3rd T20 Result Update: అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Hyderabad Loud Sound: హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
Dhanush Political Entry: కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
Hot Stone Massage : హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
Wrong e-Challan: ట్రాఫిక్ రూల్స్‌ ఉల్లంఘించకపోయినా చలానా వచ్చిందా? రాంగ్‌ ఈ-చలాన్‌ను రద్దు చేయించడం ఎలా?
పొరపాటున మీకు ట్రాఫిక్‌ చలాన్ వచ్చిందా? కంగారు వద్దు.. ఆన్‌లైన్‌లో ఇలా ఫిర్యాదు చేయండి!
Dhoni Secret Superpower: గ్రౌండ్ లోకి దిగేముందు ఎలాంటి ప్లాన్లు ఉండవ్..  ధోని అసలు సిసలు మ్యాజిక్ బయటపెట్టిన ఫాఫ్ డుప్లెసిస్
గ్రౌండ్ లోకి దిగేముందు ఎలాంటి ప్లాన్లు ఉండవ్..  ధోని అసలు సిసలు మ్యాజిక్ బయటపెట్టిన ఫాఫ్ డుప్లెసిస్
Embed widget