Crime News: ఈగలు హత్య కేసు నిందితుడిని పట్టించాయి - అసలు కథేంటో తెలుసా?
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఓ హత్య కేసులో ఈగలు నిందితున్ని పట్టించాయి. నిందితుని దుస్తులపై పదే పదే ఎక్కువగా ఈగలు వాలడాన్ని గమనించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
![Crime News: ఈగలు హత్య కేసు నిందితుడిని పట్టించాయి - అసలు కథేంటో తెలుసా? flies helped police to crack a murder case in madhyapradesh Crime News: ఈగలు హత్య కేసు నిందితుడిని పట్టించాయి - అసలు కథేంటో తెలుసా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/06/05012fcc62bd29ab9664e0cb533c11e91730887754886876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Flies Helped The Police To Crack Murder Case In Madhya Pradesh: నిందితులు ఎంత తెలివైన వారైనా పోలీసులకు చిక్కక మానరు. అయితే, ఓ హత్య కేసులో నిందితుడిని ఈగలు పట్టించాయి. విచారణ సమయంలో ఆ వ్యక్తి దుస్తులపై పదే పదే ఈగలు వాలడాన్ని గమనించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో (Madhyapradesh) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 30న పని కోసం ఇంటి నుంచి బయల్దేరిన మనోజ్ ఠాకూర్ (26) అనే యువకుడు మరుసటి రోజు తప్రియా గ్రామంలోని ఓ పొలంలో విగతజీవిగా కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా హత్యా స్థలంలో గుంపులో ఉన్న మనోజ్ మేనల్లుడు ధరమ్ ఠాకూర్ (19)ను విచారించారు. ఆ సమయంలో అతని దుస్తులపై ఎక్కువగా ఈగలు వాలడం గమనించారు.
దీంతో అతన్ని తనిఖీ చేయగా ఛాతిపై రక్తపు మరకలు కనిపించాయని పోలీసులు తెలిపారు. అతని దుస్తులపైనా రక్తపు మరకలు ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదికలోనూ నిర్ధారణ అయ్యిందని చెప్పారు. పూర్తి స్థాయిలో విచారించగా హత్య చేసింది తానేనని నిందితుడు అంగీకరించినట్లు వెల్లడించారు. మనోజ్, ధరమ్‌లు చివరిసారిగా ఓ మార్కెట్‌లో కోడి మాంసం, మద్యం కొనుగోలు చేశారు. వీటి కొనుగోలు విషయంలో ఇరువురి మధ్య విభేదాలు తలెత్తడంతో మనోజ్‌ను పదునైన వస్తువుతో కొట్టి ధరమ్ పరారయ్యాడని పోలీసులు తెలిపారు. నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Actress Kasthuri: తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)