Enforcement Directorate: రెయిడ్ సినిమాను మించిన ఈడీ రెయిడ్ - సోదాలు చేస్తూంటే గుట్టల కొద్దీ నగదు, నగలు బయటపడుతూనే ఉన్నాయి !
Full Cash: ఢిల్లీలో అమన్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లో ఈడీ చేసిన సోదాల్లో గుట్టల కొద్దీ నగదు, నగలు బయటపడుతున్నాయి. సోదాలు ఇంకా జరుగుతున్నాయి.

Enforcement Directorate has seized Rs 5 crores Cash: ఢిల్లీలో మరో భారీ ఆర్థిక కుంభకోణం గుట్టును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రట్టు చేసింది. డిసెంబర్ 30న ఢిల్లీలోని సంపన్న ప్రాంతమైన సర్వప్రియ విహార్ లోని ఒక నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు, కళ్లు చెదిరే స్థాయిలో నగదు, నగలు , కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాలు ఇంకా కొనసాగుతుండటంతో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
దాడుల్లో ఈడీ అధికారులు సుమారు రూ. 5.12 కోట్ల** నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు ఒక సూట్‌కేస్ నిండా ఉన్న రూ. 8.80 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు బయటపడటం సంచలనం సృష్టించింది. కేవలం ఒకే చోట ఇంత భారీ మొత్తంలో అక్రమ ఆస్తులు దొరకడం చూస్తుంటే, దీని వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి.
నగదు, నగలే కాకుండా ఒక బ్యాగ్ నిండా చెక్ బుక్కులు, ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు కనుగొన్నారు. వీటి ప్రాథమిక విలువ సుమారు రూ. 35 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ పత్రాల్లో పేర్కొన్న ఆస్తుల అసలు మార్కెట్ విలువ వందల కోట్లలో ఉండే అవకాశం ఉందని సమాచారం. నిందితులు విదేశాల్లో , దేశంలోని ఇతర నగరాల్లో బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టారా అనే కోణంలో ఈడీ ఆరా తీస్తోంది.
The Enforcement Directorate has seized Rs 5.12 crores; one suitcase full of Jewellery (both gold and diamond jewellery) worth Rs 8.80 crores; one bag full of cheque books, documents pertaining to properties worth Rs 35 crores during a search operation conducted on December 30 at… pic.twitter.com/PddnI1MiIa
— ANI (@ANI) December 31, 2025
ఈ దాడులు అమన్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లో జరిగాయి. ఇందర్జిత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి వ్యాపార భాగస్వామిగా ఈడీ గుర్తించింది. ఇందర్జిత్ సింగ్ యాదవ్ గతంలో భారీ బ్యాంక్ కుంభకోణాలు . మనీ లాండరింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి. అమన్ కుమార్ ప్రధానంగా ఇందర్జిత్ కు సంబంధించిన అక్రమ నిధులను చక్కబెట్టడం, బినామీ ఆస్తుల కొనుగోలు , హవాలా మార్గాల్లో నగదు మళ్లింపు వంటి వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటారని సమాచారం. సర్వప్రియ విహార్‌లోని అమన్ కుమార్ ఇంట్లో గాలింపు ఇంకా ముగియలేదు. డిసెంబర్ 30 నుండి ప్రారంభమైన ఈ సెర్చ్ ఆపరేషన్ 31వ తేదీన కూడా కొనసాగుతోంది. అధికారుల బృందం మరిన్ని లాకర్లను తెరిచే ప్రయత్నంలో ఉంది.
The search operation is being carried out in a money laundering case against one Inderjit Singh Yadav, his accomplices, Apollo Green Energy Ltd and other associated entities and persons under the provisions of the Prevention of Money Laundering Act (PMLA), 2002. The money…
— ANI (@ANI) December 31, 2025





















