Eluru Attack: ఏలూరులో ‘ఉప్పెన’ తరహా ఘటన, యువకుడి మర్మాంగం ఛిద్రం - రోకలిబండతో అక్కడ కొట్టి
Eluru Attack: చాట్రాయి మండలంలోని నరసింహారావు పాలెంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా.. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Eluru: ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో దారుణం జరిగింది. ‘ఉప్పెన’ సినిమా తరహాలో జరిగిన వాస్తవ ఘటన కలకలం రేపింది. శ్రీకాంత్ అనే (బాధిత యువకుడు) వ్యక్తి మర్మాంగంపై రోకలి బండతో యువతి తండ్రి దాడి చేశారు. చాట్రాయి మండలంలోని నరసింహారావు పాలెంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా.. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తన కూతురు వెంటపడుతున్నాడు అనే నెపంతో నరసింహారావు పాలెం గ్రామానికి చెందిన సింగపం శ్రీకాంత్ ని ఇంటికి పిలిపించి మరి తండ్రి జాన్ దాడికి పాల్పడ్డాడు. చీకటి గదిలో బంధించి, చిత్ర హింసలు పెట్టాడు. రోకలి బండతో యువకుని మర్మాంగాన్ని ఛిద్రం చేశాడు. శ్రీకాంత్ అపస్మారక స్దితిలోకి వెళ్ళటంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం నూజివీడు ఆస్పత్రికి తరలించారు. నూజివీడు నుండి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు అక్కడే చికిత్స పొందుతున్నాడు.