News
News
వీడియోలు ఆటలు
X

Eluru News : ఏలూరు జిల్లాలో విషాదం, బైక్ పై విద్యుత్ వైర్ పడి అన్నదమ్ములు సజీవదహనం

Eluru News : ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులపై 11కేవీ విద్యుత్ వైర్ తెగిపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు సజీవ దహనం అయ్యారు.

FOLLOW US: 
Share:

Eluru News : ఏలూరు జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో ఇద్దరు యువకులు సజీవదహనం అయ్యారు. శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళ్తున్న ఇద్దరు యువకులు దారిలోనే మంటల్లో చిక్కుకుని మరణించారు. దేవులపల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములు వల్లేపల్లి నాగేంద్ర (21), వల్లేపల్లి ఫణీంద్ర (19) పాలు తెచ్చేందుకు పొలం వద్దకు బైక్‌పై  వెళ్తున్నప్పుడు ప్రమాదం జరిగింది. వీరు వెళ్తున్న బైక్‌పై 11 కేవీ విద్యుత్‌ వైరు పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బైక్‌పై ఉన్న అన్నదమ్ములు ఇద్దరూ అక్కడిక్కడే సజీవదహనమయ్యారు. మృతుల్లో ఒకరైన నాగేంద్ర ఇంజినీరింగ్‌ ఫైనర్ ఇయర్ చదువుతున్నారు. ఫణీంద్ర ఇంటర్‌ రెండో సంవత్సవరం పూర్తిచేశారు. ఇద్దరు కుమారులు చనిపోయవడంతో ఆ తల్లిదండ్రుల గుండెలపగిలేలా రోధిస్తున్నారు. విద్యుత్‌శాఖ నిర్లక్ష్య్ం కారణంగానే ఈ విషాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అందనాలపాడులో సోమవారం విషాదం జరిగింది. దైవ కార్యం కోసం వెళ్లిన ముగ్గురు వ్యక్తులు విద్యుదాఘాతంతో మరణించడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సోమవారం అర్ధరాత్రి వర్షం కురవడంతో గుడి దగ్గర విద్యుత్ తీగల్లో కరెంట్ ప్రవహించింది. ఈ విషయం తెలియక కొందరు మైక్ సెట్ చేస్తుండగా అకస్మాత్తుగా కరెంట్ షాక్ వచ్చిందని సమాచారం. దాంతో స్థానిక ఆలయంలో మైక్ సెట్ చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. మృతులను సుబ్బారావు, మస్తాన్‌రావు, వెంకయ్య లుగా గుర్తించారు.

దైవ కార్యానికి వెళ్తే 

డోర్నకల్ మండలం అందనాలపాడులోని స్థానిక ఆలయంలో ఓ వ్యక్తి మైక్ సెట్ చేయడానికి ట్రై చేశారు. నిన్న రాత్రి వర్షం కారణంగా విద్యుదాఘాతం జరిగింది. దాంతో కరెంట్ తీగల్ని పట్టుకుని మైక్ సెట్ చేస్తున్న వ్యక్తితో పాటు అతడ్ని అంటుకుని ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు సైతం విద్యుదాఘాతానికి గురయ్యారు. కరెంట్ షాక్ కొట్టడంతో మస్తాన్‌రావు, సుబ్బారావు, వెంకయ్య ముగ్గురు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దేవుడి సన్నిధిలో అక్కడే ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. దైవ కార్యం కోసం వెళ్లిన తమ ఇంటి యజమానులు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారంటూ విలపించడం చూసి గ్రామస్తులను సైతం కంటతడి పెట్టించింది.

Published at : 24 Jun 2022 02:16 PM (IST) Tags: Jangareddygudem Eluru News Electricity wire two died electrocution

సంబంధిత కథనాలు

Coromandel Express Accident: వెల్లివిరిసిన మానవత్వం - రైలుప్రమాద బాధితులకు రక్తమిచ్చేందుకు క్యూ కట్టిన యువకులు !

Coromandel Express Accident: వెల్లివిరిసిన మానవత్వం - రైలుప్రమాద బాధితులకు రక్తమిచ్చేందుకు క్యూ కట్టిన యువకులు !

Coromandel Express Accident: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొనడంతో 70 మందికి పైగా మృతి! - ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షల పరిహారం

Coromandel Express Accident: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొనడంతో 70 మందికి పైగా మృతి! - ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షల పరిహారం

Odisha Train Accident: పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ- రైల్వే మంత్రికి ఫోన్!

Odisha Train Accident: పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ- రైల్వే మంత్రికి ఫోన్!

Odisha Train Accident: 50 అంబులెన్సులు కూడా సరిపోలేదు! మమతా బెనర్జీ దిగ్భ్రాంతి- Helpline Numbers ఇవీ

Odisha Train Accident: 50 అంబులెన్సులు కూడా సరిపోలేదు! మమతా బెనర్జీ దిగ్భ్రాంతి- Helpline Numbers ఇవీ

Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం

Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం

టాప్ స్టోరీస్

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?