East Godavari Crime: కాంక్రీట్ జంగిల్‌లో రొటీన్ - పచ్చటి పొలాల మధ్య వెరైటీ - గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ భగ్నం
Rave Party: పబ్బుల్లో, క్లబ్బుల్లో , ఫామ్ హౌసుల్లో రేవ్ పార్టీలు చేసుకోవడం కామన్. ఇప్పుడు జల్సా రాయుళ్లు మరింత క్రియేటివ్ గా ఆలోచిస్తున్నారు. పొలాల మధ్య పార్టీలు చేసుకుంటున్నారు.

Green fields Rave Party Busted: చట్ట విరుద్ధమైన జల్సా పార్టీల సంస్కృతి నగరాల నుంచి పల్లెలలకు పాకుతోంది. నగరాల్లో అయితే పోలీసుల నిఘా ఎక్కువగా ఉంటోందని దొరకకుండా చూసుకునేందుకు కొంత మంది పల్లెల బాట పడుతున్నారు. పొలాల మధ్యలో.. మంచి సీనరి ఉండేలా చూసుకుని తాత్కలిక ఏర్పాట్లు చేసుకుని డీజేలు, డాన్సులు, మద్యంతో జల్సా చేస్తున్నారు. అయితే ఇలాంటివి చట్ట విరుద్ధం కావడంతో పోలీసులుక సమాచారం వస్తే వెంటనే అరెస్టు చేస్తున్నారు. ఈ సంస్కృతిని జల్సా రాయుళ్లు గోదావరి జిల్లాలకు తీసుకు వెళ్తున్నారు.
పార్టీలు చేసుకోవడానికి పొలాల్లోకి పోతున్న జల్సా రాయుళ్లు
తాజాగా పచ్చదనంతో ఎప్పుడూ పాడిపంటల తో ఉండే తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఘంటవారిగూడెం లో రేవ్ పార్టీ ఒక్కసారిగా కలకలం సృష్టించింది. ఓ యువకుడు తన పుట్టిన రోజు పార్టీని మంట వారి గూడెంలో పొలాల మధ్య ఏర్పాటు చేసిన సెటప్‌లో నిర్వహించారు. ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మద్యం, విందుతో పాటు ఆశ్లీల డాన్సులు చేయడానికి యువతుల్ని కూడా తీసుకు వచ్చారు. అర్థరాత్రి పూట పెద్ద ఎత్తిన శబ్దాలతో.. అరుపులు, కేకలు, డాన్సులు శృతి మించడంతో పోలీసులకు కొంత మంది స్తానికులు ఫిర్యాదులు చేశారు.
పచ్చని ప్రాంతాల్లో ఇలాంటి పనులు చేస్తే తాట తీస్తామంటున్న పోలీసులు
పొలంలో రేవ్ పార్టీ జరుగుతోందని సమాచారం వచ్చిన వెంటనే కొవ్వూరు డిఎస్పి దేవకుమార్ ప్రత్యేక బృందాలను పంపించారు. ఆయన ఆదేశాల మేరకు నల్లజర్ల సిఐ బాలసౌరి దేవరపల్లి సిఐ నాయక్ తమ సిబ్బందితో దాడి చేశారు. పోలీసులు వస్తున్న సమయంలోనూ వాళ్లు జల్సాలు ఆపలేదు. చివరికి పోలీసులు వచ్చిన తరవాతనే వారికి కాస్త మత్తు దిగింది. మొత్తం పార్టీలో పాల్గొన్న వారిలో 25 మంది పురుషులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే మరో ముగ్గురు మహిళలను అరెస్టు చేశారు. వీరిని డాన్సులు చేయడానికి మాట్లాడుకున్నట్లుగా భావిస్తున్నారు.
ఇలాంటి గెస్ట్ హౌస్‌లను సీజ్ చేస్తామని హెచ్చరికలు
పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి.. మొజులో పడి యువత పెడదారి పట్టి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని పోలీసులు అంటున్నారు. ఇలాంటి విచ్చలవిడి పార్టీలు చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ పి నరసింహ కిషోర్ తెలిపారు. ఈ దాడిలో 25 మంది పురుషులు ముగ్గురు మహిళలతో పాటు ఏడు కార్లు పదివేల రూపాయల నగదు మూడు విస్కీ బాటిల్స్ 20 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని కొవ్వూరు డిఎస్పి దేవకుమార్ తెలియజేశారు. గతంలో ఇదే గెస్ట్ హౌస్ లో ఇలాంటి కేసులు నమోదయ్యాయని.. గెస్ట్ హౌస్‌ను సీజ్ చేస్తామని పోలీసులు ప్రకటించారు.





















