East Godavari News: ఆ ఊరు ప్రెసిడెంట్ బెట్టింగ్ బాబు.. సొంత ఇంటిలోనే క్రికెట్ బెట్టింగ్.... చివరికి సీన్ రివర్స్...
ఆయన గ్రామానికి సర్పంచ్... యువతకు ఆదర్శంగా ఉండాల్సి పోయి అడ్డదారిలో వెళ్లి అడ్డంగా బుక్కాయ్యాడు. సొంత ఇంటిలోనే క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు.
![East Godavari News: ఆ ఊరు ప్రెసిడెంట్ బెట్టింగ్ బాబు.. సొంత ఇంటిలోనే క్రికెట్ బెట్టింగ్.... చివరికి సీన్ రివర్స్... East Godavari district rajapudi village president caught in cricket betting East Godavari News: ఆ ఊరు ప్రెసిడెంట్ బెట్టింగ్ బాబు.. సొంత ఇంటిలోనే క్రికెట్ బెట్టింగ్.... చివరికి సీన్ రివర్స్...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/09/952adc370a93b075bc242695f10b4999_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
అధికారం చేతిలో ఉందనుకున్నాడో... నేతల అండదండలు మెండుగా ఉన్నాయనుకున్నాడో గానీ ఇంటినే బెట్టింగ్ కేంద్రంగా మార్చేశాడో సర్పంచ్. అంతే కాదు తనిఖీలకు వచ్చిన పోలీసులపై దాడులకు పాల్పడి పరారయ్యారు. ఇప్పటి వరకు పట్టణాలకే పరిమితమై క్రికెట్ బెట్టింగ్ భూతం పల్లెలకు కూడా పాకింది.
Also Read: ఏపీలో రూ. 10, 20వేలకే ఇళ్లు ! వాలంటీర్లను సంప్రదిస్తే పూర్తి వివరాలు ..
పోలీసులపై దాడి!
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి సర్పంచ్ బుసాల విష్ణు తన నివాసంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో జగ్గంపేట పోలీసులు ఆయన ఇంట్లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో బెట్టింగ్ ఆడుతూ అడ్డంగా దొరికిపోయిన సర్పంచ్ పోలీసులపై దాడిచేసి పరారయ్యాడు. విష్ణు ఇంట్లో ఒక లక్ష 26 వేల 890 రూపాయల నగదు, బెట్టింగ్ కు ఉపయోగిస్తున్న రెండు లాప్ టాప్ లు, ఐదు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సెల్ ఫోన్ కాల్స్ ఆధారంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడు బుసాల విష్ణుమూర్తితో పాటు 13 మంది బెట్టింగ్ రాయుళ్లను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై సామర్లకోట పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ 'రాజపూడి గ్రామంలో బెట్టింగ్ జరుగుతుందన్న సమాచారంతో జగ్గంపేట పోలీసులు తనిఖీలు నిర్వాగించారు. ఈ బెట్టింగ్ లో 30 మంది వరకు పాల్గొన్నారు. ఫోన్ కాల్స్ ఆధారంగా 13 మందిని అరెస్ట్ చేశాము. క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. క్రికెట్ ను వినోదాత్మకంగా చూడాలి కానీ ఇలా బెట్టింగ్ కు ఆడుతూ డబ్బులు పోగొట్టుకోకూడదు' అని డీఎస్పీ హితవు పలికారు.
Also Read: లవర్ ని పార్క్ తీసుకెళ్లడం విన్నాం.. కానీ ఈ మహానుభావుడు ఎక్కడికి తీసుకెళ్లాడో తెలుసా?
ఆదర్శంగా ఉండాల్సింది పోయి అడ్డదారుల్లో
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన బుసాల విష్ణు బాగానే ఖర్చు చేసినట్లు సమాచారం. ఆయన అధికార పార్టీ తరఫున పోటీ చేసి సర్పంచ్ గా ఎన్నికయ్యాడు. బాధ్యతగల పదవికి ఎంపికైన విష్ణు గ్రామానికి ఆదర్శంగా నిలవాల్సింది పోయి యువతను పెడదోవ పట్టే మార్గాల వైపు నడిపిస్తూ అడ్డదారిలో జేబులు నింపుకుంటుండంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: యువతి సమయస్ఫూర్తి.. దిశా యాప్ ద్వారా ఆకతాయి ఆట కట్టించిన పోలీసులు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)