East Godavari: అన్నదమ్ముల మధ్య భూతగాదాలు... సర్వే అధికారుల్ని అడ్డుకునేందుకు పెట్రోల్ పోసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం
తూర్పుగోదావరి జిల్లాలో భూవివాదంతో మహిళ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. సర్వే అధికారులను అడ్డుకునేందుకు మహిళ ఈ ఘాతుకానికి పాల్పడింది.
తూర్పు గోదావరి జిల్లా బెండమూర్లంక గ్రామంలో పెట్రోల్ పోసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. భూవివాదంలో సర్వేకి వచ్చిన అధికారులను అడ్డుకునే ప్రయత్నంలో మహిళ ఆత్మహత్యాయత్నం చేసిందని గ్రామస్తులు అంటున్నారు. వారిస్తున్నా వినకుండా ఒంటిపై పెట్రోలు పోసుకుని కొటికలపూడి లక్ష్మీ ప్రసన్న నిప్పటించుకుందని అధికారులు అంటున్నారు. కొటికలపూడి లక్ష్మీ ప్రసన్న భర్త కొటికలపూడి పాండురంగారావుకు అతని ఐదుగురు అన్నదమ్ములకు మధ్య భూతగాదాలు ఉన్నాయి. 15 ఏళ్ల కిందట తుమ్మలపల్లి గ్రామ పరిధిలోకి వచ్చే బెండమూర్లంక రెవెన్యూ గ్రామ పరిధిలో ఆకివీడుకి చెందిన ఆరుగురు అన్నదమ్ములు 18 ఎకరాలు కొనుగోలు చేశారు. ఎవరికి వారు వేర్వేరుగా రెండున్నర ఎకరాల చొప్పున రిజిస్టర్ చేయించుకున్నారు. గత కొంత కాలంగా కొటికలపూడి పాండురంగారావు ఈ భూములన్నీ చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. తమ భూములు తమకు అప్పగించాలని మిగిలిన అన్నదమ్ములు అడగడంతో వివాదం మొదలైంది.
Also Read: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి యువతి షికారు.. ఆకతాయిల ఎంట్రీతో కథలో ట్విస్ట్.
పంట కాల్వలోకి తోయడంతో తప్పిన ప్రమాదం
భూ సర్వే నిర్వహించి తమ భూములు తమకు అప్పగించాలని మిగిలిన ఐదుగురు అన్నదమ్ములు రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. ఇప్పటికే రెండు సార్లు సర్వే నోటీసులు జారీ చేసినా స్వీకరించక పోవడంతో మూడోసారి నేరుగా కొలిచేందుకు అధికారులు ప్రయత్నించారు. శనివారం గ్రామానికి వచ్చిన అధికారులను అడ్డుకునేందుకు పాండురంగారావు, అతని భార్య ప్రయత్నించారు. ఉన్నపళంగా ఆమె ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించికుంది. ఒంటికి నిప్పు పెట్టుకున్న లక్ష్మీ ప్రసన్నను పక్కనే ఉన్న పంట కాల్వలోకి ఆమె భర్త తోసివేయడంతో ప్రాణాపాయం తప్పింది. గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు.
Also Read: నెల్లూరు జిల్లాలో ఘాతుకం... సహజీవనంలో గొడవలు ఇద్దరి దారుణ హత్య
కోర్టు ప్రాంగణంలో పెట్రోల్ బాటిల్ తో వ్యక్తి హల్ చల్
గుంటూరు జిల్లా తెనాలి కోర్టు ప్రాంగణంలో ఇటీవల ఓ వ్యక్తి పెట్రోల్ బాటిల్‌తో హల్‌చల్ చేశాడు. కోర్టు ప్రాంగణంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. చెరుకూరి ప్రదీప్ రామచంద్ర తన భార్యతో విభేధాల నేపథ్యంలో కోర్టులో కేసులు నడుస్తున్నాయి. తనను పోలీసులు వేధిస్తున్నారంటూ ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని లైటర్‌తో నిప్పు పెట్టుకునేందుకు ప్రయత్నించగా న్యాయవాది హరిదాసు గౌరీశంకర్ చాకచక్యంగా అడ్డుకున్నారు. ప్రదీప్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఒన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో కోర్టులో పెట్రోల్ పోసుకుని ఓ ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకున్నారు. వరుసగా ఇది రెండో ఘటన.
Also Read: ఈ చదువులు వద్దు.. ఒత్తిడి తట్టుకోలేక బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో ఏముందంటే..!
Also Read: ఇవిగో గుడివాడ కేసీనో ఆధారాలు... రిలీజ్ చేసిన టీడీపీ !