అన్వేషించండి

Cyber Crimes Matrimonial: పెళ్లి చేసుకుంటానని, రూ.91 లక్షలు కాజేసి! మ్యాట్రిమోనియల్ సైట్‌లో మహిళ మోసం

Cyber Crimes Matrimonial: మ్యాట్రిమోనియల్ సైట్ లో ఓ మహిళ చేతిలో పుణెకు చెందిన ఓ టెక్కీ రూ.91 లక్షలు మోసపోయాడు.

Cyber Crimes Matrimonial: ఈ మధ్యకాలంలో ఆన్ లైన్ మోసాలు పెరిగిపోయాయి. టెలీ కాలర్ స్కామ్ లు, ఆన్‌లైన్ స్కాములు, సోషల్ మీడియాలో పరిచయమై డబ్బులు వసూలు చేసే కుంభకోణాల గురించి తరచూ వార్తల్లో వస్తూనే ఉన్నాయి. చదువుకున్న వాళ్లు కూడా ఈ ఆన్‌లైన్ స్కాముల్లో చిక్కుకుని మోసపోతున్నారు. వందల్లో, వేలల్లో కాదు ఏకంగా లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మ్యాట్రిమోనీ సైట్లలో పెళ్లి కూతురు కావాలంటూ, పెళ్లి కొడుకు కావాలంటూ పోస్టులు పెట్టి.. ఆయా ప్రొఫైళ్లకు ఆకర్షితులైన వారి నుంచి డబ్బులు కాజేస్తున్న మోసాలు కూడా వెలుగుచూస్తున్నాయి. అలాంటి ఓ ఘటన తాజాగా పుణెలో జరిగింది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నుంచి ఓ మహిళ ఏకంగా రూ. 91 లక్షల రూపాయలు కాజేసింది. 

పుణెకు చెందిన ఓ ఐటీ ఉద్యోగి ఆన్‌లైన్‌ లో మహిళను కలుసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ ప్రముఖ మ్యాట్రిమోనీలో తన ప్రొఫైల్ నచ్చి తనను కాంటాక్ట్ అయ్యాడు. ఇద్దరూ ఫోన్లలో మాట్లాడుకోవడం ప్రారంభించారు. కొన్ని రోజులుగా వీరి మధ్య ఫోన్లలో సంభాషణలు జరుగుతూనే ఉన్నాయి. ఆ మహిళకు పుణె టెకీకి మధ్య సాన్నిహిత్యం కూడా పెరుగుతూ వచ్చింది. అలా మాట్లాడుతూ బ్లెస్‌కోయిన్ ట్రేడింగ్ లో పెట్టుబడి పెట్టాలంటూ ఆ మహిళ పురుషుడితో మాట్లాడి ఒప్పించింది. ఆ మహిళ మాటలు నమ్మిన టెకీ.. పలు బ్యాంకులతో పాటు లోన్ యాప్ ల ద్వారా రుణాలు తీసుకుని దశల వారీగా రూ. 91.75 లక్షలను మహిళకు అందించి పెట్టుబడి పెట్టాడు. తను పెట్టిన పెట్టుబడి ఎంతకీ తిరిగి రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన అతడు ఆ మహిళను నిలదీశాడు. అయినా ప్రయోజనం లేకపోవడంతో దేహు రోడ్ లోని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీనిని ఆన్ లైన్ కుంభకోణంగా తేల్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

Also Read: Karnataka News: కూలీకి నిప్పంటించి హత్య చేసిన కిరాణ షాపు యజమాని, విచారణలో దొరకడంతో జైలుశిక్ష

లగ్జరీ కార్లు, విల్లాలు, ఫామ్‌హౌజ్‌లతో ఫోటోలు 

ఫుల్ సౌండ్ పార్టీ అని చెప్పాడు. లగ్జరీ కార్ల పక్కన నిలబడి ఫోటోలు తీసుకున్నాడు. విల్లాలు, ఫామ్‌హౌజ్‌లు కూడా ఉన్నాయని బిల్డప్ ఇచ్చాడు. మ్యాట్రిమొనీ సైట్‌లో ఓ అమ్మాయికి ఈ ఫోటోలన్నీ పంపాడు. ఇక పెళ్లి చేసుకోవడమే మిగిలింది అనుకునే టైమ్‌లోని పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఆ మహిళను మోసం చేసి అడ్డంగా దొరికిపోయాడు. యూపీలోని ముజఫర్‌నగర్‌కు చెందిన విశాల్ అనే 26 ఏళ్ల యువకుడు తనను తాను "రిచ్ బ్యాచిలర్‌" అని ప్రచారం చేసుకున్నాడు. తనకు తగిన జోడీ కోసం వెతుకుతున్నట్టు మాయ మాటలు చెప్పాడు. అమ్మాయిల్ని ఇంప్రెస్ చేసేందుకు లగ్జరీ కార్‌లలో తిరుగుతున్నట్టు ఫోటోలు, వీడియోలు పంపేవాడు. ఈ కేటుగాడి వలలో పడిన ఓ మహిళ రూ.3 లక్షలు కోల్పోయి చివరకు పోలీసులను ఆశ్రయించింది. చీప్‌గా iPhones ఇస్తానంటూ మూడు లక్షలు తీసుకుని సైలెంట్‌గా ఉండిపోయాడు నిందితుడు. మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాక కానీ...ఈ నాటకం అంతా బయట పడలేదు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే...ఆ నిందితుడు బాగా చదువుకున్నాడు. పైగా ఓ MNCలో ఉద్యోగం కూడా చేశాడు. సొంతగా వ్యాపారం మొదలు పెట్టాడు. కానీ ఆ వ్యాపారంలో బాగా నష్టాలొచ్చాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోనే ఓ ఐడియా వచ్చింది. ఈజీమనీ కోసం ప్రయత్నించాడు. వెంటనే మ్యాట్రిమొనీ సైట్‌లో ఫోటోలు పెట్టి డ్రామా స్టార్ట్ చేశాడు. పోలీసుల అరెస్ట్‌తో ఈ నాటకానికి తెర పడింది. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Embed widget