News
News
X

భర్తను చంపి, శవంతో బిర్యానీ వండేసిన భార్య? 40 ఏళ్లుగా వీడని మిస్టరీ క్రైమ్‌లో అన్నీ ట్విస్టులే!

ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టకున్న భర్తను చంపి భర్త శవంతో బిర్యానీ చేసింది భార్య. 40ఏళ్ల క్రితం జరిగిన ఇప్పటికీ.. ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇంతకీ.. ఈ కర్రీ మర్డర్‌ కేసు ఏంటి.?

FOLLOW US: 
Share:

మీకు గుర్తుందో లేదో.. 40 ఏళ్ల కిందట ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. ఆధారాలేవీ దొరకకుండా ఉండేందుకు అతడిని ముక్కలు చేసింది. అయితే, వాటిని బయట పడేసే వీలు లేకపోవడంతో.. ఏకంగా భర్త శరీర భాగాలతో బిర్యానీ వండేసింది. అయితే, ఈ కేసులో ఇంకా చాలా చిక్కుముడులు ఉన్నాయి. అందుకే.. 40 ఏళ్లు అవుతున్నా ఆ కేసు కొలిక్కి రాలేదు. ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. 

ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన కర్రీ మర్డర్‌ కేసు

అది.. 1983, డిసెంబరు 18వ తేదీ. సింగపూర్‌లోని ఓ చర్చిలో కేర్‌ టేకర్‌గా పని చేస్తున్న 34 ఏళ్ల అయ్యకన్ను మరితముత్తు అనే వ్యక్తి కనిపించకుండా పోయాడు. అతడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత ఆరు రోజులుగా అయ్యకన్ను కనిపించడం లేదంటూ అతడి భార్య నాగరత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె భర్తను కనిపెట్టడానికి చాలా శ్రమించారు. దీంతో వారికి భార్య నాగరతపై అనుమానం కలిగింది. ఆరు రోజులుగా భర్త కనిపించకపోతే ఏం చేస్తున్నావ్? వెంటనే ఫిర్యాదు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇందుకు ఆమె.. ‘‘నా భర్త జూదం, క్యాసినో వంటి ఆటలు ఆడేందుకు రెండు, మూడు రోజుల బయటకు వెళ్తారు. ఇప్పుడు కూడా అలాగే వెళ్లారని అనుకున్నా. పైగా అతడికి బాగా డబ్బున్న అమ్మాయితో సంబంధం ఉంది’’ అని తెలిపింది. దీంతో పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ చేపట్టారు. అన్ని విధాలుగా మరితముత్తు ఆచూకీ తెలుసుకొనేందుకు ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. దీంతో ఆ కేసును డిటెక్టివ్‌కు అప్పగించాడు.

అసలు కథ.. అలా మొదలైంది

అలమైకి అనే డిటెక్టివ్ ఈ కర్రీ మర్డర్‌ కేసు దర్యాప్తు ప్రారంభించాడు. ఈ సందర్భంగా అయ్యకన్ను భార్య, అతడి స్నేహితులపై నిఘా పెట్టాడు.   ఓ రోజు ఆ డిటెక్టివ్‌కు ఇన్‌ఫార్మర్ నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. అయ్యకన్ను కేసు గురించి కొన్ని వివరాలు మీకు చెప్పాలని, తన పేరు బయటకు చెప్పొద్దని తెలిపాడు. దీంతో అలమైకి ఆ వ్యక్తిని కలిసి.. అతడి వద్ద ఉన్న సమాచారాన్ని సేకరించాడు. అతడు తెలిపిన వివరాల ప్రకారం.. 

ఓ రోజు సాయంత్రం ఫుల్లుగా మద్యం సేవించి, ఇంటికి వెళ్లాడు అయ్యకన్ను. అదే సమయంలో అతడి భార్య నాగరత.. తన ముగ్గురు సోదరులతో కలిసి ఇంట్లో ఉంది. ఇంటికి రావడం రావడమే.. అతడు భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ధనవంతురాలైన తన ప్రియురాలితో సెటిల్‌ అయిపోతానంటూ భార్యపై చేయిజేసుకున్నాడు. దీంతో ఆమె ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రోజూ ఇలాగే తనని కొడుతున్నాడని, అతడిని చంపేస్తే పీడ వదులుతుందని సోదరులకు చెప్పింది. అప్పటి నుంచి ఆమె సోదరులు అయ్యకన్నును చంపేందుకు అవకాశం కోసం ఎదురు చూశారు. ఓ రోజు ఫుల్‌గా తాగి వచ్చిన అయ్యకన్ను మెడకు తాడు కట్టి ఉరేసి చంపేశారు. 

శవాన్ని బిర్యానీ చేసి.. చర్చిలో విందు

‘‘అయ్యకన్ను శవాన్ని ఎక్కడైన పారేస్తే.. విషయం బయటకు తెలుస్తుందని, పోలీసులకు దొరికిపోతామని భార్య, ఆమె సోదరులు భావించారు. వారి ఫ్రెండ్ మటన్‌ షాపు వద్ద నుంచి పదునైన కత్తులను తీసుకొని వచ్చారు. ఇంట్లోనే అయ్యకన్ను శరీరభాగాలను ముక్కలు ముక్కలుగా నరికి, బిర్యానీ చేసి, ఆ తర్వాతి రోజే చర్చిలో విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది మెత్తటి ఆవు మాంసం అని అందర్నీ నమ్మించి, విందు ఇచ్చారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు’’ అని ఆ ఇన్ఫార్మర్ చెప్పాడు.

ఈ విషయం తెలిసిన తర్వాత డిటెక్టివ్ విచారణ మొదలుపెట్టాడు. ఇన్‌ఫార్మర్ ఇచ్చిన సమాచారంతో డిటెక్టివ్ వారికి కత్తులు ఇచ్చిన మటన్ షాప్‌ యజమానిని కలిసి విచారించాడు. కొద్ది రోజుల క్రితం.. నాగరత సోదరుడు తన వద్ద నుంచి పదునైన కత్తులు తీసుకోని వెళ్లిన్నట్లు తెలిపాడు మటన్‌ షాప్‌ యజమాని చెప్పాడు. దీనిపై డిటెక్టివ్ నాగరత సోదరుడిని ప్రశ్నించగా.. అతడికి కొడుకు పుట్టాడన్న సంతోషంలో, ఆ మటన్‌ షాపు నుంచి కత్తులు తీసుకెళ్లి, ఓ లేత ఆవు మాంసంతో చర్చిలో విందు ఇచ్చిన్నట్లు తెలిపాడు. కావాలంటే.. ఆవు కొన్న వ్యక్తిని కూడా మీకు చూపిస్తానని తెలిపాడు. దీంతో ఆవును అమ్మిన వ్యక్తిని కూడా డిటెక్టివ్ విచారించాడు. వాళ్లు తన దగ్గర ఓ ఆవును కొనుగోలు చేయడం నిజమేనని పేర్కొన్నాడు. కోర్టులో సైతం ఇదే విషయాన్ని వెల్లడించడంతో న్యాయమూర్తి ఆ కేసును కొట్టేశారు. అయ్యకన్ను భార్య, సోదరులపై పోలీసులు తప్పుడు కేసు బనాయించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. 

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు

దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన ఈ కేసును కల్పిత పాత్రలతో ‘కర్రీ మర్డర్‌’ పేరుతో ఓ క్రైమ్‌ సీరియల్‌ కూడా ప్రసారమైంది. ఇందులో నాగరత, అతడి సోదరులే అయ్యకన్నును మర్డర్‌ చేసి, అతడి శరీరంతో బిర్యానీ తయారు చేసి విందు ఇచ్చారంటూ సీరియల్‌‌లో చెప్పారు. అయితే 1985-86వ సంవత్సరంలో ఈ సీరియల్‌ మంచి క్రేజ్ వచ్చింది. ఈ సీరియల్‌పై మండిపడిన నాగరత, ఆమె ముగ్గురు సోదరులు కోర్టులో కేసు వేశారు. ఈ సీరియల్లో తామే అయ్యకన్నును మర్డర్‌ చేసిన్నట్లు చూపిస్తున్నారంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. ఆ సీరియల్‌ దర్శక, నిర్మాతలను ప్రశ్నించింది. కేవలం ఇది కల్పిత పాత్రలతోనే అలా చూపించామని, అయినా.. వాళ్లు చేయని తప్పుకు అంత భయం ఎందుకంటే తమ వాదనలు కోర్టుకు తెలిపారు. అందుకు జడ్జీ కూడా మీరు ఏమైన అయ్యకన్నును చంపారా..? అని ప్రశ్నించగా.. అందుకు వాళ్లు ఒక్కసారిగా టెన్షన్‌ పడ్డారు. అలాంటిది ఏమిలేదరని మేము అయ్యకన్నును మర్డర్‌ చేయలేదని, ఆ ఫిర్యాదును రిటర్న్‌ తీసుకున్నారు. 

ఇన్‌ ఫార్మర్‌తో నాగరత అక్రమ సంబంధం

డిటెక్టివ్‌ అలమైకి ఎంతో నమ్మకస్తుడైన ఇన్‌ ఫార్మర్‌కు అనుకోకుండా నాగరతకు పరిచయం ఏర్పడింది. భర్త చనిపోయిన తర్వాత ఓ రోజు నాగరత చర్చికి వచ్చింది. అలా చర్చికి వచ్చిన నాగరతతో ఇన్‌ ఫార్మర్‌కు పరిచయం ఏర్పాడి, ఆ తర్వాత ప్రేమగా మారింది. వీళ్లదరి మధ్య లవ్‌ట్రాక్‌ ఐదేళ్ల పాటు కొనసాగింది. అయితే డిటెక్టివ్‌ అలమై మిత్రుడే ఈ ఇన్‌ ఫార్మార్‌ అన్న విషయం నాగరతకు తెలియదు. అలా రిలేషన్‌లో ఉన్న క్రమంలో ఓ రోజు రాత్రి మద్యం మత్తులో శృంగారం అనంతరం తాగిన మైకంలో ఇన్‌ఫార్మర్‌కు తన భర్తను చంపిన స్టోరీ మొత్తం ఇన్‌ ఫార్మర్‌కు చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న ఇన్‌ ఫార్మర్‌ ఆమె మీద ఉన్న ప్రేమతో తనను ఎంతగానో నమ్మిన డిటెక్టివ్‌ కూడా చెప్పలేదు. నాగరతకు సాఫీగా సాగుతున్న లైఫ్‌ బోర్‌ కొట్టడంతో.. మరో యువకుడిని ప్రేమించడం మొదలుపెట్టింది. ఇన్‌ఫార్మర్‌తో రిలేషన్‌ కట్‌ చేసుకుంది. ఇక ఈ విషయం జీర్ణించుకోలేకపోయిన.. ఇన్‌ఫ్మార్మర్‌ ఎంతో ఆవేశంగా తన డిటెక్టివ్‌కు అసలు విషయం చెప్పాడు. 

దర్శక, నిర్మాతలకు అసలు స్టోరీ చెప్పిన డిటెక్టివ్‌

ఇన్‌ ఫార్మర్‌ తన వ్యక్తి కాబట్టి డిటెక్టివ్‌ నమ్మాడు. కానీ.. ఇదే విషయం కోర్టులో జడ్జి ముందుకు చెప్పగా.. అందుకు కోర్టు ఒప్పుకోలేదు. ఎందుకంటే.. నాగరత, ఆమె సోదరులు మర్డర్‌ చేశారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. అందుకే ఈ కేసును మరోసారి కొట్టేసింది కోర్టు. ఈ క్రమంలోనే డిటెక్టివ్‌ కర్రీ మర్డర్‌ దర్శక నిర్మాతలకు ఈ రియల్‌ స్టోరీలో అసలు విషయాలు చెప్పిన్నట్లు టాక్‌ కూడా ఉంది. దీంతో దర్శక నిర్మాతలు ఆ సీరియల్‌ను మళ్లీ ప్రారంభించారు. దీంతో ‘కర్రీ మర్డర్‌’ సీరియల్‌ మరోసారి సింగపూర్‌‌లో సంచలనంగా మారింది. దీంతో నాగరత తన బాయ్‌ఫ్రెండ్‌తో సిటీ వదిలి పారిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కేసు ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. అయ్యకన్ను ఏమయ్యాడనేది ఇంకా తెలియరాలేదు. 

Also Read: కోర్టు కేసు వివాదం, భర్తను రాడ్డుతో కొట్టి చంపిన భార్య!

Published at : 15 Dec 2022 06:47 PM (IST) Tags: Crime wife murder husband Singapor curry murder case Mystery case

సంబంధిత కథనాలు

Annamayya District Crime: విలేకరిపై గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులు- అన్నమయ్య జిల్లాలో కలకలం

Annamayya District Crime: విలేకరిపై గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులు- అన్నమయ్య జిల్లాలో కలకలం

TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం  

TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం  

Peddapalli Crime : రౌడీషీటర్ సుమన్ హత్య కేసును ఛేదించిన పోలీసులు, పాతకక్షలతో మర్డర్!

Peddapalli Crime : రౌడీషీటర్ సుమన్ హత్య కేసును ఛేదించిన పోలీసులు,  పాతకక్షలతో మర్డర్!

Satysai District Crime News: సత్యసాయి జిల్లాలో దారుణం - ఆరో తరగతి విద్యార్థినిపై యువకుడి అత్యాచార యత్నం

Satysai District Crime News: సత్యసాయి జిల్లాలో దారుణం - ఆరో తరగతి విద్యార్థినిపై యువకుడి అత్యాచార యత్నం

Hyderabad: ఒకరోజులో 20 ఇళ్లలో దొంగతనాలు! అవాక్కైన పోలీసులు - ఎట్టకేలకు అరెస్టు

Hyderabad: ఒకరోజులో 20 ఇళ్లలో దొంగతనాలు! అవాక్కైన పోలీసులు - ఎట్టకేలకు అరెస్టు

టాప్ స్టోరీస్

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

IND vs AUS: విశాఖలో మ్యాచ్‌ ఉందని గుర్తుందా! బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ షెడ్యూలు, టైమింగ్స్‌, వేదికలు ఇవే!

IND vs AUS: విశాఖలో మ్యాచ్‌ ఉందని గుర్తుందా! బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ షెడ్యూలు, టైమింగ్స్‌, వేదికలు ఇవే!