Visakha Crime : కోర్టు కేసు వివాదం, భర్తను రాడ్డుతో కొట్టి చంపిన భార్య!
Visakha Crime : విశాఖలో దారుణ ఘటన జరిగింది. భర్తపై రాడ్డుతో దాడి చేసింది భార్య.
Visakha Crime : విశాఖలో దారుణం జరిగింది. భార్యపై కత్తితో భార్య దాడి చేసింది. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 95వ వార్డు లక్ష్మీపురంలో భార్య భర్తను హత్య చేసింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మీపురం ఫ్లై ఓవర్ బ్రిడ్జి పక్కన ఉన్న నివాసాల్లో ఈ కుటుంబం ఉంటుంది. భార్య భర్తల మధ్య గత కొద్ది కాలంగా కోర్టు కేసు వివాదం నడుస్తుంది. బుధవారం రాత్రి భార్య వద్దకు వచ్చిన భర్త కేసు విత్ డ్రా చేసుకోవాలని లేదంటే నీ అంతు చూస్తామని బెదిరించాడు. దీంతో భార్య కోపంతో తన వద్ద ఉన్న రాడ్డుతో భర్త తలపై గట్టిగా కొట్టింది. తీవ్ర గాయమైన భర్త అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య
భార్య వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో జరిగింది. బెంగళూరు ఉళ్లాల ఎంవీ లేఔట్‌లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరుకు చెందిన మహేశ్వర(25)కు మూడు నెలల క్రితం కవన అనే యువతితో వివాహమైంది. అయితే పెళ్లయిన దగ్గర నుంచి కవన తరచూ భర్తతో గొడవ పడేదని స్థానికులు తెలిపారు. ఆమె వేధింపులు తట్టుకోలేక మహేశ్వర ఐదు రోజుల క్రితం తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై జ్ఞానభారతి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే భార్య వేధింపులు తట్టుకోలేకే మహేశ్వర ఆత్మ హత్య చేసుకున్నట్లు అతని బంధువులు కూడా ఆరోపిస్తున్నారు.
కేరళలో దారుణం
దేశంలో సంచలనం సృష్టించిన దిల్లీ శ్రద్ధా వాకర్ హత్య కేసు మరువకముందే అలాంటి మరో సంఘటన కేరళలో జరిగింది. రాజధాని తిరువనంతపురంలో జరిగిన ఈ ఘటనలో రెండు సంవత్సరాలుగా సహజీవనం సాగిస్తున్న ప్రియురాలిని.. ప్రియుడు పట్టపగలే కిరాతకంగా నరికి చంపాడు. తిరువనంతపురంలో గురువారం పట్టపగలే ఈ ఘటన జరిగింది. నిందితుడు రాజేష్ తన ప్రియురాలు సింధూతో ఏదో విషయంలో వచ్చిన తగాదాల కారణంగా పెరూర్కడ ప్రధాన రహదారిపై కొడవలితో నరికి చంపడానికి ప్రయత్నించాడు. తీవ్ర గాయాలపాలైన సింధూను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. నిందితుడు రాజేష్ తిరువనంతపురం శివార్లలో జూస్ సెంటర్ నిర్వహించేవాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన గురించి వార్తా సంస్థ ఏఎన్ఐ ట్విట్టర్ లో వెల్లడించింది.
" సింధూ అనే మహిళను తనతో సహా జీవనం చేస్తున్న ఆమె ప్రియుడు రాజేష్ నరికి చంపాడు. ప్రస్తుతం నిందితుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. వారిరువురు గత రెండు సంవత్సరాలుగా సహజీవనం సాగిస్తున్నారు. వ్యక్తిగత విభేదాల కారణంగా రాజేష్ ఆమెను కొడవలితో నరికాడు. తీవ్ర గాయాలపాలైన సింధూను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు. "- పోలీసులు