CPI-Maoist case: తెలంగాణ, ఛత్తీస్ గఢ్ లో 8 చోట్ల ఎన్ఐఏ అధికారుల సోదాలు
తెలంగాణ, ఛత్తీస్గఢ్ లో 8 చోట్ల ఎన్ఐఏ అధికారుల సోదాలు...
తెలంగాణ, ఛత్తీస్గడ్ రాష్ట్రాల్లో 8 చోట్ల ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా తెలంగాణలోని వరంగల్ లో 5 చోట్ల, భద్రాద్రి కొత్తగూడెంలోని 2 చోట్ల, భద్రాచలంతో పాటు ఇతర ప్రాంతాల్లో అధికారులు ముమ్మరంగా సోదాలు చేశారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ లోని ఓ ప్రాంతంలో సోదాలు చేయగా... కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు తదితర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. జూన్ నెలలో చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురిని స్థానిక పోలీసులు అరెస్టు చేయగా... మావోయిస్టులకు అధునాతన ఆయుధాలు, ఎలక్ట్రానిక్ పరికరాల సరఫరా లక్షంగా అధికారులు రైడ్స్ చేశారు. ఈ తనిఖీల్లో ఎన్ఐఏ అధికారులు పెద్ద ఎత్తున డ్రోన్లు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 12 మందిపై కేసులు నమోదు చేశారు. వారి వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలు, తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 12 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు ఆధారంగా ఆగస్టులో మరో కేసు నమోదు చేసిన ఎన్ఐఏ అధికారులు ఆ కేసు పై కూడా విచారణ చేస్తున్నారు.
దర్యాప్తులో భాగంగా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్లో కలిపి మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు చేశారు. కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ప్రస్తుతం నిపుణులు విశ్లేషిస్తున్నారు. మావోయిస్టులకు అయుధాలు, సామాగ్రిని సరఫరా చేస్తురన్న అభియోగంపై దర్యాప్తు చేస్తున్నారు. గతంలో పట్టుబడిన ముగ్గురి ప్రాధమిక విచారణలో పీపుల్స్ వార్(Peoples War) పేరుతో మావోయిస్టు కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఎన్‌ఐఏ అధికారులు తెలపారు. దేశవాళీ తుపాకులను తయారు చేసి వాటిని మావోయిస్టులకు పంపుతున్నారని పేర్కొన్నారు. నూతన సాంకేతికతను ఉపయోగంచి సీపీఐ మావోయిస్టు పార్టీ యువకులను రిక్రూట్మెంట్ చెసినట్లు ఎన్ఐఏ పేర్కొంది.
మావోయిస్టులకు ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి?
కాలంతో పాటు అప్‌డేట్ అవుతున్నారు మావోయిస్టులు. ఆధునాతన ఆయుధాలు సమకూర్చుకుంటున్నారు. నూతన పోరాట పద్దతులపై పట్టు సాధిస్తున్నారు. మరి మావోయిస్టులకు అధునాతన ఆయుధాలు ఎక్కడి నుంచీ వస్తున్నాయి? సరఫరా ఎలా జరుగుతోంది. అనే వాటిపై ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు దృష్టి పెట్టారు. ఛత్తీస్ గఢ్ లో 2019లో మావోయిస్టులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పాక్ ఆర్మీ ఉపయోగించే హెక్లెర్, కోచ్ జీ3 రైఫిల్‌లను మావోల నుంచి స్వాధీనం చేసుకున్నారు. 2018లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్. జర్మనీలో తయారైన రైఫిల్, యూఎస్ సబ్- మెషిన్ గన్ స్వాధీనం చేసుకున్నారు.
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని కొన్ని చోట్ల మావోయిస్టులకు కీలక స్థావరాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రతీ ఏటా మావోయిస్టులు దాచిన అనేక ఆయుధ డంప్‌లను పోలీసులు వెలికి తీస్తున్నారు. 2021 ఏప్రిల్ 3న ములుగు మండలంలో ఒక పోడు భూమిలో దాచిన ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. భూమిలో స్టీల్ బక్కెట్‌లలో పెట్టిన వందలాది తూటాలు, డిటోనేటర్లు వెలికితీశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్ఐఏ సోదాలు సోదాలు నిర్వహించడం కలకలం కలకలం రేపుతోంది. అందులోనూ భారీగా పేలుడు పదార్థాలు లభించడంతో దీని వెనుక ఎవరెవరున్నారు? వీరి ఆలోచన ఏమిటని అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.