IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

Chittoor Crime: సిగరెట్ తాగేందుకు స్నేహితుడ్ని బయటకు పిలిచి ఏం చేశారంటే..! ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా !

స్నేహితులు అంటే కలిసి‌మెలసి తిరిగే వారే కాదు. కష్ట సుఖాలను పంచుకునే వారే నిజమైన స్నేహితులుగా అంటుంటాం. ఓ ఘటన చిత్తూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది..

FOLLOW US: 

Chittoor Crime News: తిరుపతి : ఈ లోకంలో వయసుతో వ్యత్యాసం లేకుండా ఇతరులతో చేసేది స్నేహం. సృష్టిలో స్నేహితులు లేని వారే ఉండరు. అందుకే స్నేహం ఒక అద్భుతమైనదిగా పెద్దలు అంటారు. స్నేహితులు అంటే కలిసి‌మెలసి తిరిగే వారే కాదు. కష్ట సుఖాలను పంచుకునే వారే నిజమైన స్నేహితులుగా అంటుంటాం. తల్లిదండ్రులకు, బంధువులకు, తోబుట్టువులకు సైతం చెప్పుకోలేనివి కూడా స్నేహితులకు చెప్పుకుని భాధ పడుతుంటారు. అంతటి విలువైన స్నేహానికి కొందరు యాయని మచ్చను తీసుకువస్తున్నారు. ఆర్ధిక‌ లావాదేవీల విషయంలో స్నేహితుడితో గొడవ‌ పడి పక్కా స్కెచ్ తో బయటకు పిలిచి మరీ హత్య చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది..

వివరాలిలా ఉన్నాయి... తిరుపతి నగరం మల్లంగుంట చెందిన మహబూబ్ బాషా, దామోదర్, షేర్ల వెంకటేష్, సంజీతం బాలాజీలు స్నేహితులు. చిన్నతనం నుంచి స్నేహితులుగా ఉన్న వీరు పెరిగి పెద్దయ్యాక కూడా అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. ఎక్కడికి వెళ్లాలన్నా స్నేహితులు అందరూ కలసి వెళ్లి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని‌ గానీ తిరిగి వచ్చే వారు కాదు. అయితే మహబూబ్ బాషా ఓ ప్రముఖ పార్టీలో నాయకుడిగా వ్యవహరిస్తూ పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవారు. తనతో పాటు తన ముగ్గురు స్నేహితులు మహబూబ్ భాషాకు తమ చేతనైన సాయం చేస్తూ వస్తున్నారు.

అవసరాల నిమిత్తం మహబూబ్ బాషా తనకు అత్యంత సన్నిహితులైన సంజీతం బాలాజీ, షేర్ల వెంకటేష్, దామోదర్ల వద్ద కొంత మొత్తంలో అప్పు తీసుకున్నారు. ఎంతకీ నగదు తిరిగి ఇవ్వక పోవడంతో ముగ్గురు స్నేహితులు మహబూబ్ బాషాపై ఒత్తిడి తీసుకువచ్చేవారు. ఈ క్రమంలో గత కొంత కాలంగా ఆ నలుగురు స్నేహితుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటోంది. తీసుకున్న నగదును తిరిగి ఇవ్వక పోవడమే కాకుండా మహబూబ్ బాషా వారిపై రౌడీయిజం చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో బాషాపై కక్ష పెంచుకున్న ఆ ముగ్గురు స్నేహితులు ఎలాగైనా మహబూబ్ బాషా నుంచి నగదును తిరిగి తీసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. కానీ నగదు చేతికి తిరిగి రాకపోవడంతో పక్కా స్కెచ్ వేసి మహబూబ్ బాషాను అంతం చేసేందుకు ఆ ముగ్గురు స్నేహితులు ప్లాన్ చేశారు.

తాము వేసుకున్న ప్లాన్ ప్రకారం మహబూబ్ భాషాను హత్య చేసేందుకు పలుమార్లు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు విఫలం చెందడంతో మరోమారు వారి ప్రయత్నాన్ని కొనసాగించే పక్కాగా స్కెచ్ వెశారు. జనవరి 29న ఉదయం ముగ్గురు స్నేహితులు మహబూబ్ బాషా కు ఫోన్ చేసి సిగరెట్ త్రాగేందుకు పిలిచారు. తనకు పని ఉందని ఇప్పుడు వీలు కుదరదని మహబూబ్ బాషా నిరాకరించారు. కానీ ఎలాగైనా రావాలని ఆ ముగ్గురు బలవంతం చేయడంతో స్నేహితులతో కలిసి సిగరెట్ తాగేందుకు తిరుపతి శివారు ప్రాంతానికి వెళ్లారు.

జన సంచారం లేని ప్రాంతానికి ఆ ముగ్గురు స్నేహితులు మహబూబ్ బాషాను తీసుకెళ్ళారు. కొంతసేపు నవ్వుతూ మట్లాడిన ఆ ముగ్గురు తరువాత తాము ఇచ్చిన నగదును తమకు తిరిగి ఇవ్వాలని స్నేహితుడిపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ క్రమంలో స్నేహితులకు, మహబూబ్ బాషాకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. మహబూబ్ బాషాపై ఆగ్రహించిన ఆ ముగ్గురు స్నేహితులు వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశారు. మహబూబ్ బాషా మృతి చెందాడని నిర్ధారించుకున్న తర్వాత నిందితులు అక్కడి నుండి పరారయ్యారు. రోడ్డుకు పక్కన పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించి స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. 

కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే బుధవారం నాడు మల్లంగుంట జంక్షన్ వద్ద ఆ ముగ్గురు వ్యక్తులు పోలీసు వాహనం చూసి ద్విచక్ర వాహనంలో పరార్ అయ్యేందుకు ప్రయత్నిస్తుండగా వారిని అదుపులోకి తీసుకుని విచారించగా మహబూబ్ బాషాను హత్య చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. నిందుతుల వద్ద నుండి రెండు కత్తులు, మూడు మొబైల్స్, ఒక ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దామోదర్, షేర్ల వెంకటేష్, సంజీతం బాలాజీలలను తిరుపతి పోలీసులు రిమాండుకు తరలించారు.

Also Read: Schools Reopen: స్కూల్స్ రీఓపెన్.. భౌతిక తరగతుల నిర్వహణకు పేరెంట్స్ పర్మిషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం

Also Read: Gold Rate Today: గుడ్ న్యూస్.. నిలకడగా పసిడి ధర.. స్వల్పంగా దిగొచ్చిన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇవీ

Published at : 03 Feb 2022 09:24 AM (IST) Tags: ANDHRA PRADESH AP News Chittoor News murder Chittoor Telugu News Mahabub Basha

సంబంధిత కథనాలు

Hyderabad: వంట మాస్టర్‌తో మహిళ సహజీవనం, ఇంతలో గది నుంచి కంపు వాసన - తెరిచి చూసి స్థానికులు షాక్

Hyderabad: వంట మాస్టర్‌తో మహిళ సహజీవనం, ఇంతలో గది నుంచి కంపు వాసన - తెరిచి చూసి స్థానికులు షాక్

Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - బస్సు, లారీ ఢీకొనడంతో 7 మంది మృతి

Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - బస్సు, లారీ ఢీకొనడంతో 7 మంది మృతి

Hyderabad: ఏడాదిగా సహజీవనం, రెండ్రోజుల్లోనే పెళ్లి - ఇంతలో వరుడు మృతి! వధువు ఏం చేసిందంటే

Hyderabad: ఏడాదిగా సహజీవనం, రెండ్రోజుల్లోనే పెళ్లి - ఇంతలో వరుడు మృతి! వధువు ఏం చేసిందంటే

Tirupati: పీకలదాకా తాగి పోలీసులు వీరంగం, భయపడి 100కి కాల్ చేసిన స్థానికుడు - తరువాత ఏం జరిగిందంటే !

Tirupati: పీకలదాకా తాగి పోలీసులు వీరంగం, భయపడి 100కి కాల్ చేసిన స్థానికుడు - తరువాత ఏం జరిగిందంటే !

Bus Accident: బెంగళూరు-హైదరాబాద్ హైవేపై ప్రమాదం, ప్రైవేటు బస్సు - లారీ ఢీ

Bus Accident: బెంగళూరు-హైదరాబాద్ హైవేపై ప్రమాదం, ప్రైవేటు బస్సు - లారీ ఢీ
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Congress Task Force 2024: టాస్క్ ఫోర్స్ టీమ్‌ను ప్రకటించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా G 23 నేతలకు కాంగ్రెస్ షాక్

Congress Task Force 2024: టాస్క్ ఫోర్స్ టీమ్‌ను ప్రకటించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా G 23 నేతలకు కాంగ్రెస్ షాక్

Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?

Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?

Quad Summit 2022: భారత్‌, అమెరికా బంధం మరింత పటిష్టంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం- జపాన్‌లో మోదీతో బైడెన్‌

Quad Summit 2022: భారత్‌, అమెరికా బంధం మరింత పటిష్టంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం- జపాన్‌లో మోదీతో బైడెన్‌

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, ఆగస్టు దర్శన టికెట్లు విడుదల - మధ్యాహ్నం మరిన్ని సేవల కోటా టికెట్లు ఆన్‌లైన్‌లో

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, ఆగస్టు దర్శన టికెట్లు విడుదల - మధ్యాహ్నం మరిన్ని సేవల కోటా టికెట్లు ఆన్‌లైన్‌లో